Sadguru Birthday Special Song
1. విశ్వపరిమాణం
నీ కనుచూపు పారినంత మాత్రమే.
The quantum of universe is limited to the extent your sight beholds.
2.నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది.
It appears everything, including me is contained in me.
3.జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడూ కలిపి ఓ పెద్దకల అని ఉండడమే నిజమైన మెలకువ(మోక్షం)
If one can realise that the waking, dreaming and deep sleep states are a big dream -- it is real wakefulness (Moksha).
4.'నేను' అని, దానికి ఇంకొక్క అక్షరం కూడా చేర్చకుండా అక్కడితో ఆగిపోతే, ఆ 'నేనే' పరమాత్ముడు.
I is Paramatma if nothing...even an additional syllable, is not added to it.
5.'అందరూ' అంటూ ఎవరూ లేరు.
ఉండేది నీవొక్కడివే.
There are not 'many'. All that exists is you.
6.నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు.
You keep some distance from you.
7. ఉన్నది ఒకే వస్తువు
మాట వరుసకు కూడా రెండవ వస్తువును
అంగీకరించవద్దు.
What exists is only one thing. Do not accept even casually that a second one exists.
8.ప్రతి కదలికా భగవంతునిదే.
నేను కదులుతున్నానని భ్రమపడుతున్నావు.
Every movement is that of God. You delude yourself that you are moving.
9.సకలమూ పరమాత్మలో ఉన్నది, పరమాత్మయే అయి ఉన్నది.
ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, నేనే అయి ఉన్నాడు.
All is within Parmatma -- All is as Paramatma. That Paramatma is in me. He is as me.
10.పుట్టువారిలో మొదటివాడను.
గిట్టువారిలో చివరివాడను.
నా ఈ రెండు కార్యముల నెరుగుటకు
నాకు ముందు వెనకలు ఎవ్వరూ లేరు.
"నేను"తప్ప.
I am the first among the born -- I am the last among those who die. In order to know about these two aspects, there is none before me or after me except I.
11. నాకు జ్ఞానం, నాకు సుఖం అని కాకుండా
నేను జ్ఞానం, నేను సుఖం అని ఉండాలి.
It is not 'Jnanam' or pleasure (Sukham) to me. It should be I am Jnanam -- I am pleasure (Sukham).
12.కావాలి అంటే బంధం.
వద్దు అంటే మోక్షం.
Desire is bondage. Negating is liberation (Moksha).
13.పొందేవాడు సత్యం కాదు.
పొందబడేది దైవం కాదు.
The One who can be obtained is not true. God cannot be obtained.
14.నేను ఆత్మను చేరుకోవడానికి ఎంత దూరమో తెలుసా?
కుండ మట్టిని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరం.
The distance between me and Atman is the distance between the pot and mud.
15.ఏ మనస్సయితే సకలాన్ని త్రోసివేస్తుందో
ఏ మనస్సయితే సకలాన్ని తనలో ఇముడ్చుకుంటుందో
ఆ మనస్సే బ్రహ్మము.
The mind which jettisons everything and the mind which contains everything -- that mind is Brahman.
16.సాకారుడైన భగవంతుడే భక్తుడు.
నిరాకారుడైన భక్తుడే భగవంతుడు.
Embodied God is disciple. Disembodied disciple is God.
17.తనలోనే పుట్టి, ఉండి, తనలోనే నశించే
ఆలోచన వంటిది ఈ దేహం, ఈ ప్రపంచం.
This world is like the body and thought -- born in itself, exists in itself and dissolves in itself.
18.శిష్యునికి గురువున్నాడు. గురువుకు శిష్యుడుండడు.
భక్తునికి భగవంతుడున్నాడు. భగవంతునికి భక్తుడుండడు.
అజ్ఞానికి జ్ఞాని ఉన్నాడు.
జ్ఞానికి అజ్ఞాని ఉండడు.
Disciple has Guru. Guru has no disciple. Devotee has God. God has no devotee. Ignorant (Ajnani) perceives Jnani. Jnani does not perceive (any) ignorant one.
19.స్మరణ వలన లభించేవాడు కాడు పరమాత్ముడు.
పరమాత్ముడు లభించిన తర్వాత కలిగే కదలికే స్మరణ.
Paramatma is not obtained by contemplation. Contemplation is the movement on obtention of Paramatma.
20.తానై సంసారాన్ని పట్టుకుని ఉంటే తాను సంసారి.
సంసారం తనను పట్టుకుని ఉంటే తాను సన్న్యాసి.
తాను భగవంతుణ్ణి తలిస్తే తాను భక్తుడు.
భగవంతుడు తనను తలిస్తే తాను ముక్తుడు.
If you hold on to Samsara, you are a Samsari -- If Samsara holds you, you are a Sanyasi.
21.ప్రతి నది గమ్యం సముద్రం.
ప్రతి జీవి గమ్యం దైవం.
The destination of every river is the sea. The destination of every being is God.
22.నా పూర్వ పూర్ణస్థితియే నా పూర్వజన్మ.
ఆ మరచినస్థితిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మరుజన్మ.
My previous (Poorna) complete state is my previous birth. Remembrance of that forgotten state is the next birth.
23.ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లాలి అనుకోవడం సాధన.
అక్కడ నుంచే ఇక్కడికి వచ్చాము అని ఉండడం సిద్ధి.
Sadhana is thinking of going from here to there. Siddhi is to remain ( with the conviction) that we came from there to here.
24.ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.
ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.
Absence of any (other) one is Presence of God. Not knowing anything is to know God. Not having any experience is God experience.
25. జగన్నాటక రచయిత, ప్రవక్త, నటీనట సమూహము,
నేపథ్యము, ప్రదర్శకుడు, ప్రేక్షకులు, సూత్రధారి, నిర్మాత
సకలమూ భగవంతుడే.
సర్వశక్తుడు కదా! విమర్శకుడు కూడా అతడే.
The author of the play of Universe, director, actors, background, exhibitor, spectators, conductor, producer -- all is God.Is he not all powerful !!He is critic too...