గ్రంథం: అనిలాచలశివమాల
అవతరించిన కాలం: క్రీ.శ.2000 సంవత్సరం.
అవతరించిన ప్రదేశం: అత్యాశ్రమం, కైకాలవీధి, శ్రీకాళహస్తి-517 644.
Sadguru Birthday Special Song
గ్రంథం: అనిలాచలశివమాల
అవతరించిన కాలం: క్రీ.శ.2000 సంవత్సరం.
అవతరించిన ప్రదేశం: అత్యాశ్రమం, కైకాలవీధి, శ్రీకాళహస్తి-517 644.
ఇప్పటి కాలానికి జటిలంగా అనిపించే వేదాంతాన్ని
చాలా సరళంగా...మనం నిత్యం వాడుకునే చిన్న చిన్న పదాలతోనే... సద్గురుదేవులవారు 'అనిలాచలశివమాల'ను రచించారు.
అది 2000 సంవత్సరం...
ఓ రోజు సత్సంగంలో(గురువుగారి ఇంటి వరండాలో చాపలు పరచి) గురువుగారి చుట్టూ అందరమూ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాం....
గురువుగారు హఠాత్తుగా లేచి వారి పడకగదిలోకి వెళ్లి అక్కడున్న కుర్చీలో ఒంటరిగా కూర్చొని...సిగరెట్ కాలుస్తూ ...స్పిరల్ బుక్ లో ఏదో వ్రాయడం మొదలు పెట్టారు....
మాకు అది చిత్రంగా అనిపించింది...
యెందుకంటే గతంలో ఎన్నడూ అలా చేయలేదు గురువుగారు.
ఆ స్పిరల్ నోట్ బుక్ లో ఒక్కో పేజీ అవగానే, ఆ పేజీని చించి, కాశీరెడ్డి ద్వారా బయట వరండాలో ఉన్న మా వద్దకు పంపడం ప్రారంభించారు....
నేను ఆ ఒక్కో పేజీని అప్పుడే గట్టిగా చదివి మిగతా సత్సంగ సభ్యులకు వినిపిస్తూ వచ్చాను...
చివరికి ఆ పేజీలన్నీ కలిపితే 108 ద్విపదలు అయినాయి....
అదే అనిలాచలశివమాల అయ్యింది.
మనం దానిని పారాయణం చేసినంత వ్యవధిలోనే అంత గొప్ప తత్త్వాన్ని రచించడం అనేది ఏ మానవమాత్రుడికీ సాధ్యం కాని పని.
అది సర్వ వేదాంతసారము....
ఆ ఒక్క గ్రంథమే కోటి గ్రంథాల పెట్టు.
త్రాసులోని ఒక తక్కెడలో అనిలాచలశివమాలను ఉంచి, మరో తక్కెడలో ప్రపంచంలో ఉండే వేదాంతగ్రంథాలన్నింటినీ వేసినా సరే ఈ చిన్న పుస్తకానికి సరి తూగవు.
మానవజాతే కాదు....దేవతలు సైతం ప్రతి నిత్యం పారాయణం చేయదగిన అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం ఇది.
ఈ మాట ప్రస్తుతానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు.
పారాయణం చేయగా చేయగా అది
పరమసత్యమనేది త్వరలో మీకే తెలుస్తుంది...
ఈ శివమాల అనుభవంలోకి రాగానే తానే శివుడైపోవడం ఖాయం.
గురువుగారు సైతం నిత్యపారాయణం చేస్తుంటారు.
నేను వ్రాయలేదు....నా "ద్వారా" వ్రాయబడింది...అంటారు గురువుగారు.
అందుకే మేము ప్రచురించే ఏ పుస్తకంలోనూ రచయిత పేరును వ్రాయం.
రచయిత పరబ్రహ్మమే అనేది కాస్త చదువగానే పాఠకుడికి అర్థమైపోతుంది.
* * *