----------------------------------------------------------------------------
సూర్య వంశజులు "క్షత్రియ" కులమునకు చెందిన వ్యక్తి అగ్నికులక్షత్రియ బోగస్ కుల ధృవీకరణ పత్రం తో ఉద్యోగం పొందితే....... ఇతను ఆగ్నికులక్షత్రియ కులం కు చెందిన వాడు కాదు " క్షత్రియ" కులానికి చెందిన వాడు అని నిరూపించడం తో, నెల్లూర్ జిల్లాకలెక్టర్ గారు సంబంధిత వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించు విధముగా ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికారి పై కూడా చర్యలు తీసుకోవాలి.
✍️ బోగస్ కులధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వ్యక్తులపై చేస్తున్న న్యాయపోరాటంలో మరో విజయం ✌ ️✊️
డి ఎస్ సి -2018 లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ )పోస్టుకు బోగస్ అగ్నికులక్షత్రియ సర్టిఫికేట్
తో బీసీ -ఏ రిజర్వేషన్ కోటాకింద ఎంపికైన ముప్పాల. సురేష్ (నెల్లూరు జిల్లా, గూడూరు నివాసి., క్షత్రియ OC కులస్థుడు )కు నెల్లూరు తహసిల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ను జిల్లాకలెక్టర్ రద్దుచేశారు. అగ్నికులక్షత్రియ (బీసీ -ఏ )కింద ఈ వ్యక్తి పొందిన లబ్దికి సబంధించి రికవరీ చేయాలని జిల్లా విద్యాశాఖాధి కారి &గూడూరు సబ్ కలెక్టర్ లను ఆదేశించారు. అలాగే సదరు వ్యక్తిపై పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేయించాలని నెల్లూరు తహసిల్దారును ఆదేశించారు.
శారు.
వివరాలు :
గూడూరు లో నివసిస్తున్న ముప్పాల. సురేష్ అగ్నికులక్షత్రియ (బీసీ -ఏ)కాదని, అతనిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని అతని కారణంగా పై ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయిన నిజమైన బీసీ-ఏ కులాలకు కు చెందిన చల్లాసురేష్, జె. చెంగల్ రాయులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ముప్పాల. సురేష్ కు ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు ఇవ్వరాదని స్టే తెచ్చారు. కష్టపడి కొన్ని ఆధారులు సేకరించారు. వీరికి మద్దతుగా పై ముప్పాల. సురేష్ OC క్షత్రియకులస్తుడని పలు ఆధారాల పత్రాలతో DLSC ఛైర్మెన్ అయిన జాయింట్ కలెక్టర్ గారికి పై కేసు విచారణ ల్లో వినతిపత్రాలు అందచేయడమైనది.
ఎట్టకేలకు పై ముప్పాల. సురేష అక్రమంగా పొందిన బోగస్ అగ్నికుల క్షత్రియ సర్టిఫికెట్ రద్దు చేయబడినది. న్యాయం చేకూర్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము.బాధితుడు చల్లా. సురేష్ మరో ఉపాధ్యాయ ఉద్యోగం పొందినందున, మరో పిర్యాదు దారుడు అయిన జె. చెంగల్ రాయులు పై ఉద్యోగానికి నియమితులు కావలసి ఉంది.
DSC -2016 లో నాయుడుపేటకు చెందిన OC క్షత్రియ కులస్థులు కీర్తిపాటి. మంజుల నెల్లూరు MRO nunchi పొందిన బోగస్ అగ్నికులక్షత్రియ (బీసీ-ఏ )రిజర్వేషన్ తో ఉద్యోగం పొందారు. ఖచ్చితమైన ఆధార పత్రాలతో ఆమెపై మనం పిర్యాదు చేయడం, DLSC విచారణ, కలెక్టర్ గారు ఆమె సర్టిఫికేట్ రద్దుచేసి, ఉద్యోగం తొలగించడం తెలిసినదే. అది మన తొలి విజయం. 🌹🌷🙏
🔥 తిరువత్తూరు, శివశంకర్,
ప్రధానకార్యదర్శి, నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ
సంఘం
Andhra Jyothi News Paper clipping dt.14Jun2021
**********
అగ్నికులక్షత్రియ సంఘం అభ్యర్థనలను సాను కూలంగా పరిష్కరించుతానని తెలియజేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ధన్యవాదములు
Sri.T.Siva Sankar rendered yeomen service to a scholarship holder who and whose family members were Covid-affected. In recognition of (1)his AKK-Covid-patient care and rehabilitation services (2)his general services to our community (3)his efforts in identifying the right persons for scholarship scheme benefits (4)his good authoring skills ... ..., he has been presented "Distinguished Agni(Vahni)kula Kshatriya Award(విశిష్ట అగ్ని(వహ్ని)కుల క్షత్రియ పురస్కారం"). He has been presented Rs.5000/- cash award and a citation certificate will be presented to him soon
...Prof.K.Chandra Sekharaiah, Cyberpolicing R&D Chief@PGF, India
http://sites.google.com/site/agnivahnikukutpally
http://sites.google.com/site/chandraksekharaiah
**********
అగ్ని( వహ్ని )కుల క్షత్రియ సేవా సంస్థాన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కనగలూరు. చంద్రశేఖరయ్య గారు తమ సంస్థ ద్వారా విశిష్ట పురస్కారానికి నన్ను ఎంపికచేసినందుకు వారికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను.
16సంవత్సరాలు గా OC క్షత్రియ /రాజు కులస్థుల బీసీ రిజర్వేషన్ దోపిడీ దారులపై న్యాయపోరాటం చేస్తూ... 11 సంవత్సరాలు పదవతరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమాలు నిర్వహిస్తూ... శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానం (నవాబుపేట )పునర్ నిర్మాణము, ఆక్రమణలను అడ్డుకోవడం... ఎంపిక చేసిన 13మంది విద్యార్థులకు మహా దాత ద్వారా స్కాలర్షిప్ లు అందచేయిస్తూ... అధ్యయనం చేసిన కులచరిత్ర, సేకరించిన కులచరిత్ర వివరాలు వెలుగులోకి తేవడం...
కులసంఘానికి రాజకీయ రంగు అంట కుండా చూడడం...
మొ..కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా అగ్నికులక్షత్రియ సంఘం మొత్తం క్రియాశీల కార్యకర్తలకు, సహాయ సహకారం అందిస్తున్న అందరికీ లభించిన గుర్తింపు,గౌరవం ఈ పురస్కారమని సవినయంగా తెలియ చేస్తున్నాను. 🙏
- తిరువత్తూరు. శివశంకర్
**********
👆ఈరోజు ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం లో నెల్లూరు జిల్లా అగ్నికులక్షత్రియ సంఘప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ శ్రీ కె. వి. యన్ చక్రధర్ బాబు గారిని కలసి వినతిపత్రం అందచేయడమైనది.
DSC-2018 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు (సోషల్ స్టడీస్ ) అగ్నికులక్షత్రియ పేరిట నఖిలి కులధ్రువీకరణ పత్రం తో BC-A రిజర్వేషన్ కోటాకింద ఎంపికయిన ముప్పాల. సురేష్ పై చేసిన పిర్యాదు మేరకు DLSC విచారణ తదుపరి సదరు వ్యక్తి కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు తెలియచేయడ మైనది. పెండింగ్ లో ఉన్న పైవ్యక్తి ఎంపిక జాబితా నుంచి అతని పేరు తొలగించి, మెరిట్ ప్రకారం పిర్యాదు దారుడు, అర్హుడైన BC-A అభ్యర్థి జడపల్లి. చెంగల్ రాయులు కు నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరడమైనది. అ. క్ష. పేరిట బీసీ -ఏ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు చేస్తున్న 29 మంది OC క్షత్రియ రాజులపై మన సంఘం పిర్యాదు పై 2005 సం. నుండి జరుగుతున్న DLSC విచారణ ను వేగవంతం చేసి, పరిష్కరించి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడమైనది. పై పోస్టుకు అర్హుడైన DSC-2018 అభ్యర్థి చెంగాల్ రాయలు కూడా మనతో కలసి మరో వినతిపత్రం అందచేశారు
కలెక్టర్ గారిని కలసిన వారు : నెల్లూరు జిల్లా అగ్నికులక్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి తిరువత్తూరు. శివశంకర్, కార్యదర్శి కంచి. జ్ఞానేంద్ర, కార్యవర్గసభ్యలు కంచి. ఆనంద్, శాఖా సంఘ నాయకులు చెంగల్పట్టు. శ్రీధర్, కొత్తూరు. మురళీమోహన్, ఆం. ప్ర. అ. క్ష. స్వర్ణకార సంఘం కార్యదర్శి వేలూరు. ప్రసాద్, 47వడివిజన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వేలూరు. పెంచలశేఖర్, యువకార్యకర్తలు కంచి. రవిశంకర్, ఎం. సుధీర్ కుమార్, కారణి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
PAGE 1 Click here--->>> to go to Page 2
Letter dt.7Oct2020 emailed to (collector_nlr@ap.gov.in, jcdevelopment-nlr@ap.gov.in, jc_nlr@ap.gov.in, jcwelfare-nlr@ap.gov.in, neldro@nic.in, sivasankarthiruvathuru3860@gmail.com) is available in https://spsnellore.ap.gov.in/te/whos-who/
*************************************************************
PART-A
*************************************************************
*************************************************************
*************************************************************
పెద్దలందరికీ నమస్కారం. నేను పంచాయతీ కార్యదర్శి గా 15 సంవత్సరాల సర్వీస్ చేస్తున్నాను క్షత్రియ రాజులు అగ్నికుల క్షత్రియులుగా సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు పొందిన వారు సుమారు 30 మంది నేను చూపించగలను క్షత్రియ రాజులు వన్నెకుల క్షత్రియ గా సర్టిఫికెట్లు తీసుకున్నట్టుగా నా దృష్టికి రాలేదు ఉదాహరణకి గూడూరులో మరియు నాయుడుపేట సైదాపురం ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియుల దొంగ సర్టిఫికేట్లు పొంది ఉన్నారు ఉదాహరణకు ఓజిలి మండలం రాచపాలెం గుర్రంకొండ ఆర్మిన్ పాడు మొదలగు గ్రామాల్లో పాఠశాలలో అగ్నికులక్షత్రియులు గా నమోదు చేసుకుంటున్నారు కావున కుల సంఘ పెద్దలు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ ద్వారా గాని లేదా జిల్లా సంఘం తరపున గాని రాష్ట్ర సంఘం తరపున గాని దీనిమీద పత్రికా ప్రకటన ద్వారా గాని లేదా ప్రజల్లో అవగాహన కార్యక్రమం బహిరంగ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం ద్వారా గానీ ముందుకు రావాలి అట్లా కాకుండా వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉద్యోగం పొందాడు అనేసి అసోసియేషన్ తాసిల్దారు వద్దకు వెళ్లి మన విన్నపాన్ని తెలియజేయడం జరుగుతుండేది ఇప్పటికైనా ఈ నిరసన కార్యక్రమాలు మీడియా ద్వారా బహిరంగ పరచడం ఒక క్రమపద్ధతిలో గ్రామ మండల జిల్లా స్థాయిలో సమావేశాలు ప్రతి నెల నిర్వహించుకోవడం జరగాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా పెళ్ళిళ్ళు చావులో ఒకే రీతిలో ఉండేటట్లుగా దిశా నిర్దేశకత్వం వహించగల సభ్యులను గుర్తించి ప్రతి గ్రామ మండల జిల్లా సంఘాలు నందు గౌరవ సభ్యులు గా ఉంచాలి.
నేను ప్రస్తుతం దొరవారిసత్రం మండలం నల్లబెల్లి ఉచ్చు రూ సచివాలయ(ddo) కార్యదర్శిగా పని చేస్తున్నాను 150 కుటుంబాలు వన్నెకుల క్షత్రియ లుగా వన్నె రెడ్డిపల్లి రెడ్లు ఉన్నారు వారికి అగ్నికుల క్షత్రియ పదం కూడా తెలియదు తమిళనాడు నందు ఒక బలమైన రాజకీయ పార్టీ బలమైన రాష్ట్ర నాయకత్వం ఉండుటవలన ఇటువంటి సమస్య అక్కడ లేదు కానీ తెలుగు రాష్ట్రంలో కుల పరంగా ఒక రాజకీయ పార్టీ లేదు ఇప్పుడిప్పుడే యువత ముందుకు వస్తుంది వారిని ప్రోత్సహిస్తూ అగ్నికుల క్షత్రియ కులస్తులందరికీ ఏకతాటిపైకి తీసుకువస్తూ ముందుకు తీసుకుపోవడానికి భవిష్యత్ ప్రణాళికలు రచించి గలరని కోరుచున్నాను అంతేగాని ఒక్కొక్కరు ఒక సంఘం పెట్టుకునే సి భిన్న అభిప్రాయాలతో అధికార దర్పం కోరకు కాకుండా ముందుకు పోవడానికి పెద్దలందరూ కృషి చేయాలని మీ అందరికీ పాదాభి వందనం చేయుచున్నాను
...MuniKrishnaReddy
*******************
PART B
సూర్య వంశ క్షత్రియలు - గూడూరు మండలం లో నివసిస్తున్న వారు (రాజులు ) మళ్ళీ దొంగ కుల ధ్రువీకరణ పత్రముల కోసం గూడూరు MRO గారికి వినతి పత్రం ఇచ్చినట్లు సమాచారం అందుకున్న మన సోదరులు జిల్లా అగ్నికులక్షత్రియ సంఘము వారితో కలసి ఈ రోజు 05-10-2019 న దొంగ క్షత్రియల గురించి వివరించి వారికి కులధ్రువీకరణ పత్రములు మంజూరు చేయరాదని కోరడం జరిగినది.
=========================
బరితెగిస్తున్న సూర్యవంశ క్షత్రియులు ( రాజులు ) ---- ఉద్యమ బాటలో మనం. నెల్లూరు జిల్లాలో 1983-84 లో సైదాపురం మండలం లో సూర్య వంశక్షత్రియులు మాకు అగ్నికులక్షత్రియ సర్టిఫికెట్స్ ఇవ్వండి అని రోడ్డు మీద MRO ఆఫీస్ ముందు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అప్పటి వరకు మనకు తెలియదు క్షత్రియులు అగ్నికులక్షత్రియులు గా చలామణి అవుతున్నారని, బీసీ రిజర్వేషన్ దోపిడీ చేస్తున్నారని, అప్పటి నుండి 2004 వరకు ఎన్నో పోరాటాలు చేసి MRO లతో ఒక ఒప్పందం కుదుర్చుకొని మనం సర్టిఫికెట్స్ పొందటం జరుగుతున్నది. దొంగలైనా క్షత్రియులు ఫై పోరాటం- ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎన్నో సాక్ష్యాలు సేకరించి దాదాపు 30 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. గత నెలలో గూడూరు లో మళ్ళీ కొంత మంది క్షత్రియులు మన తాత, ముత్తాతలకే వారు పుట్టారని మేము అగ్నికులక్షత్రియులమని సిగ్గు, లజ్జా లేకుండా గూడూరు MRO గారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయమని ఒక చోటా నాయకుని తీసుకొని వత్తిడి చేయడం జరిగింది. దీనితో సదరు MRO గారు మనకు, దొంగలైనా క్షత్రియులకు సర్టిఫికెట్స్ మంజూరు చేయటం నిలిపివేశారు. ఈ విషయం తెలిసిన గూడూరు మన శాఖ, జిల్లా సంఘము వారు గూడూరు MRO గారిని కలసి మన సమస్య ను చెప్పడం జరిగింది. MRO గారు కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లి వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అని చెప్పడం జరిగింది. ఒక బ్రాహ్మణుడు మేక తీసుకెళ్తుంటే కొంత మంది అది మేక కాదు కుక్క అని పదే పదే పదే చెప్పడం తో బ్రాహ్మణుడు కుక్క వదిలేసాడు. అలాగే దొంగలైనా క్షత్రియులు పదే పదే పదే అర్ధ బలం తో, అంగ బలం తో, ఆర్ధిక బలం తో అధికారులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదు మళ్ళీ ఉద్యమిస్తాం దొంగలైన క్షత్రియులు మళ్ళీ నోరు మెదపకుండా గుణపాఠం చెప్పాలి. ఆలాగే బీసీ A జాబితా లోని మిగిలిన కులముల వారిని కూడా కలుపుకొని మా కులానికే కాదు BC -A అందరికి ఇది నష్టం అని వారికి వివరించి ముందుకు వెళ్లక పోతే భావితరాలకు మనం తీరని ద్రోహం చేసిన వాళ్ళo అవుతాము. రండి కదలి రండి త్వరలో భవిష్యత్ కార్యాచరణ తెలియచేస్తాము. జై అగ్నికులక్షత్రియ........Sree9440187261
===================
మా ప్రకాశం జిల్లాలో కూడా ఈ సమస్య ఉంది. చాలామంది రాజులు మన సర్ట్ఫికెట్లతో మన వారికి అన్యాయం చేస్తున్నారు. దయచేసి వారికి గట్టిగా బుద్ధిచెప్పే ఏర్పాట్లు చేయాలి👍9441223391
Nayudu Balaji, (native of Singaraya Konda)(Hindi Pundit@Chandra Sekhara Puram Mandal, border of Prakasam Vs. Kadapa
===================
🙏🙏 ఆహ్వానం 🙏🙏ప్రియమైన బంధువులకు విజ్ఞప్తి : OC లైన క్షత్రియ/ రాజులకు కుల ధ్రువీకరణ పత్రాలు అగ్నికుల క్షత్రియ గా మంజూరు చేయమని మండల అధికారులను వత్తిడి చేయడం, సదరు బోగస్ వ్యక్తులకు అక్రమ BC కుల పత్రాలు మంజూరు చేయరాదని డిమాండ్ చేస్తూ...................
తేదీ 08-10-2019సోమవారం ఉదయం 10:00 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కి కలెక్టర్ ఆఫీస్( ఆచారి వీధి )నందు వినతి పత్రం అందచేస్తాము. కనుక సంఘ సభ్యులు, కులస్తులు అందరూ రావలసినదిగా కోరడమైనది. శివశంకర్ ప్రధానకార్యదర్శి నెల్లూరుజిల్లా అగ్నికులక్షత్రయ సంఘం.💪💪💪💪Sree9440187261
=================================
బరితెగిస్తున్న క్షత్రియుల దూకుడుకు కళ్లెం వేస్తూ మన జిల్లా సంఘము, గూడూరు శాఖ సంఘము ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలసి క్షత్రియ /రాజుల బోగస్ కుల ధ్రువీకరణ మాఫియా అధికారుల మీద చేస్తున్న వత్తిడి గురించి వివరించడం జరిగింది. మన జిల్లాలోని సూర్య, చంద్ర వంశజులు కొంత కాలంగా అగ్నికులక్షత్రియ కులం పేరిట బోగస్ కులధ్రువీకరణ పత్రాలను అధికారులను మభ్యపెట్టి, రాజకీయ వత్తిడి చేసి పొందుతున్నారు. దీనిమీద మనం వివిధ రకాలుగా పోరాడుతూనే వున్నాం. గత సంవత్సరం టీచర్ గా సెలెక్ట్ అయిన కీర్తిపాటి మంజుల అనే క్షత్రియ కులస్తురాలను మన సంఘము పోరాటం ద్వారా ఉద్యోగం నుండి తొలగించి, ఆమె సర్టిఫికెట్ ను రద్దు చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో గూడూరు మండలం లో మళ్ళీ ఒక చోటా నాయకుని సారథ్యంలో గూడూరు MRO ఫై సర్టిఫికెట్స్ మంజూరు చేయమని వత్తిడి చేసారు. దీనికి స్పందన గా మన సంఘం వారు కలెక్టర్ గారిని కలసి వారి దోపిడి గురించి వివరించడం జరిగింది. కలెక్టర్ గారు DRO గారిని కలసి సవివరంగా చెప్పామన్నారు. DRO గారు మనం చెప్పినది పూర్తిగా విని, అనుకూలంగా స్పందించి జిల్లాలోని అన్ని మండల అధికారులకు సరైన మార్గదర్శకాలు పంపుతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో గూడూరు శాఖ నుండి ఉదయగిరి శ్రీనివాసులు గారు ప్రధానకార్యదర్శి, పల్లిపాటి ప్రకాష్ గారు కార్యవర్గ సభ్యులు, కొత్తూరు మురళి మోహన్ మూలాపేట ఉపాధ్యక్షులు, ఆదూరు ప్రభాకర్ కోటమిట్ట అధ్యక్షులు, మల్లెంబకం కరుణకుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు, చిత్తతూరు రామకృష్ణ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘము, తిరపనాపాటీ వెంకటేశ్వర్లు ఇందుకూరు పేట శాఖ కార్యదర్శి, గండవరం చంద్రశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి, లేబూరు రాజేంద్ర వర్మ, P. వెంకటేశ్వర్లు, వెంకటేష్, ఇంకా మన సోదర బంధువులు పాల్గొన్నారు.
==============================
ప్రియమైన బంధువులారా...... ఈరోజు గూడూరు శాఖ సంఘము వారు RDO ని కలసి దొంగలు, బోగస్ కుల మాఫియా లైన క్షత్రియ /రాజుల దోపిడీ, దౌర్జన్యం, రాజకీయ వత్తిడి గురించి పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తి తో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లకు వినతి పత్రాలు ఇవ్వవలసిన బాధ్యత జిల్లా సంఘమునకు ఉంది. కార్యాచరణ రూపిందించి మరొక్కసారి మళ్ళీ జిల్లా అంతటా తిరిగి మన వాళ్లను కలుపుకొని ఉద్యమించాలి. అలాగే తీర ప్రాంతములలో వన్నీకాపు, అగ్నికులక్షత్రియ పేర్లతో వున్న మనవారికి కుల ధ్రువీకరణ పత్రాలు " పల్లి " అని ఇస్తున్నారు. దేనిమీద కూడా అధికారులను కలసి మన జాతి గురించి వివరించి మన వారికి సర్టిఫికెట్స్ లో వున్నవిధముగా ఇచ్చేటట్లు చూడవలెను. ఇంకనూ జిల్లాలో కొన్ని ప్రాంతాలవారికి సంఘము గురించి, కులం గురించి పూర్తి అవగాహన లేదు. ఈ తరం వారు భావితరాల వారికి మన కులం చరిత్ర, సంప్రదాయం, మొదలగునవి అందించవలసిన భాద్యత మన మీద వుంది. రండి... కదలి రండి.... మళ్ళీ ఉద్యమిస్తాం... ఈ సూర్య, చంద్ర వంశ రాజుల భరతం పడుతాం...... పల్లవుల వారసులమైన మనం అగ్నికులక్షత్రియులుగా కాకుండా " పల్లోళ్లు " అని ఇతర కులాల ముందు హీనంగా చేతులు కట్టుకొని నిలబడుతున్నాం..... సిగ్గు పడాలి....ఊరకనే మీసాలు మెలివేయడం కాదు, దానికి కొంచం పౌరుషం కలపాలి.... పల్లవ పౌరుషం చూపించాలి. జై అగ్నికులక్షత్రియ, జై జై అగ్నికులక్షత్రియ......
Youtube Video of representation submission @Gudur Tahsildar's Office-->https://youtu.be/4UK9JShWIrY
ప్రియమైన బంధువులారా...... ఇదే స్ఫూర్తి తో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లకు వినతి పత్రాలు ఇవ్వవలసిన బాధ్యత జిల్లా సంఘమునకు ఉంది. కార్యాచరణ రూపిందించి మరొక్కసారి మళ్ళీ జిల్లా అంతటా తిరిగి మన వాళ్లను కలుపుకొని ఉద్యమించాలి. అలాగే తీర ప్రాంతములలో వన్నీకాపు, అగ్నికులక్షత్రియ పేర్లతో వున్న మనవారికి కుల ధ్రువీకరణ పత్రాలు " పల్లి " అని ఇస్తున్నారు. దేనిమీద కూడా అధికారులను కలసి మన జాతి గురించి వివరించి మన వారికి సర్టిఫికెట్స్ లో వున్నవిధముగా ఇచ్చేటట్లు చూడవలెను. ఇంకనూ జిల్లాలో కొన్ని ప్రాంతాలవారికి సంఘము గురించి, కులం గురించి పూర్తి అవగాహన లేదు. ఈ తరం వారు భావితరాల వారికి మన కులం చరిత్ర, సంప్రదాయం, మొదలగునవి అందించవలసిన భాద్యత మన మీద వుంది. రండి... కదలి రండి.... మళ్ళీ ఉద్యమిస్తాం... ఈ సూర్య, చంద్ర వంశ రాజుల భరతం పడుతాం...... పల్లవుల వారసులమైన మనం అగ్నికులక్షత్రియులుగా కాకుండా " పల్లోళ్లు " అని ఇతర కులాల ముందు హీనంగా చేతులు కట్టుకొని నిలబడుతున్నాం..... సిగ్గు పడాలి....ఊరకనే మీసాలు మెలివేయడం కాదు, దానికి కొంచం పౌరుషం కలపాలి.... పల్లవ పౌరుషం చూపించాలి. జై అగ్నికులక్షత్రియ, జై జై అగ్నికులక్షత్రియ......9948882854Venkateswarlu
********************************************
ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి🔥🔥🔥అగ్నికుల క్షత్రియ అనే గుర్తింపుని ధర్మరాజు స్వామి గుడి స్థలాన్ని మనం కోల్పోకూడదు.
వాటిని కోల్పోతే సమాజంలో మన గుర్తింపు ప్రశ్నార్ధకంగా తయారవుతుంది.
ప్రస్తుతం ఇప్పుడు గూడూరు నడిబొడ్డులో పాత బస్టాండ్ పక్కన వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 🛕🛕🛕 ధర్మరాజు స్వామి గుడి ఉన్నది కానీ గూడూరు ఎమ్మార్వో మీరు ఏ కులస్తులు మీరు ఒరిజినల్ అగ్నికులక్షత్రియులు అని ఆధారాలు ఏమి ఉన్నాయి అని అడిగినారు మన కులస్తు లకు క్యాస్ట్ సర్టిఫికెట్ మూడు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఆపేసారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గూడూరు మన కమ్యూనిటీ వాళ్ళకి ఏమీ అందడం లేదు. విద్యార్థులకు క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా బాధ పెడుతున్నారు.
నెల్లూరు నవాబ్ పేట లోని 🛕🛕🛕శ్రీ కృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థాన స్థలం ఆక్రమణకు గురి అవుతున్నాయి వాటిని దేవాదాయ శాఖ వారి దృష్టికి తీసుకెళ్లి కొంతవరకు నిలుపుదల చేశాం అసిస్టెంట్ కమిషనర్ గారు స్థలం ఆక్రమించాలని అనుకున్న అటువంటి వారి మీద తగు చర్యలు తీసుకుంటామని గుడి దగ్గర ఖాళీ స్థలం హద్దులు ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు 2/10/2020 రేపు శుక్రవారం ఉదయం 8 గం గంటలకు మన కులస్తులు ప్రతి ఒక్కరూ మెసేజ్ చదివి నటువంటి వాళ్ళు మెసేజ్ తెలియనటువంటి వాళ్లకు సమాచారం తెలియజేసి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని గుడి దగ్గరకు వచ్చి మన ఐక్యతను చాటి చెప్పాలి. మన గుడి స్థలాన్ని మనమే కాపాడుకోవాలి బయట సమాజంలో మనం వీరులు సురులు అని చెప్పుకునేది కాదు రేపు గుడి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు నిరూపించుకోండి.
ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు బేల్దారి పని ఇతర వృత్తులు చేసి కష్టపడి అప్పట్లోనే ఆ స్థలాన్ని నిలబెట్టారు ఇప్పుడు ఆ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత మనది. మన తర్వాత తరాల వాళ్ళకి దాన్ని అప్పగించ వలసిన బాధ్యత కూడా మనదే ఉన్న స్థలానికి వేరే స్థలం కలిపి పెద్దదిగా చేయాలి గాని ఉన్న స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తే మనం చేతగాని వాళ్లు గా మిగిలిపోతాం ద్రౌపతి అమ్మ క్షమించదు ఆమె ఆగ్రహ జ్వాలలో మాడి మసి అయిపోగా తప్పదు జాగ్రత్తగా గుర్తుంచుకోండి
అగ్నికుల క్షత్రియ సంఘం
కార్యదర్శి
కంచి జ్ఞానేంద్ర
*************************************
✍️గోపీనాథ్( GK )✍️- అధికారులు తమ కుల ధృవీకరణకు సంభందించిన సర్టిఫికేట్లు మంజూరు చేయకపోవడంతో తాము ప్రభుత్వ పథకాలు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నామని నెల్లూరుజిల్లా గూడూరుకు చెందిన అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల సర్టిఫికేట్లు మంజూరు చేసి సుమారుగా ఏడాది గడిచిపోయిందని దీనిపై గూడూరు సబ్ కలెక్టర్ ను అడిగితే తమ పరిధిలో లేదని సమాధానమిస్తున్నారని అంటున్నారు.
https://drive.google.com/file/d/1eWifFWzFMIB9Pz31RIdkOqZyoO45TpF5/view?usp=sharing
****************************************************************
శ్రీ కృష్ణ ద్రౌపతి సమేత శ్రీ దర్మరాజ స్వామి దేవస్థానం గూడూరు, నెల్లూరు జిల్లా. మన అని చెప్పుకునే దేవస్థానం యొక్క అగ్నిగుండం, తపస్సుమాను జరుగు ప్రదేశం లో ఇప్పటి వరకు తాత్కాలిక రైతు బజార్ వున్నది. బ్రహ్మోత్సవాలు జరిగి దాదాపు 25 సంవత్సరాల పైన అయినది. అప్పుడు ఫై స్థలం ను ఖాళీ చేసిన వారు, తిరిగి ప్రభుత్వ సహకారంతో మళ్ళీ ఆక్రమించడం జరిగినది. మళ్ళీ ఇప్పుడు మార్కెటింగ్ శాఖ శాశ్విత కట్టడములు నిర్మించడానికి అనుమతులు ప్రభుత్వం వారు మంజూరు చేశారని, దీనిని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు వస్తున్నారని గూడూరు శాసన సభ్యులు తెలియచేస్తున్నారు. కొస మెరుపు : గౌరవ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు "అగ్నికులక్షత్రియులు " మన మినిస్టర్ చేతుల మీద గానే మన అని చెప్పుకుంటున్న మన దేవస్థానం స్థలం లో ఇక మీదట బ్రహ్మోత్సవాలు నిర్వహించకుండా ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలు చేపడుతుంది.All India Pawaar Kingdom whatsapp group post dt.10Oct2019 by 9440187261Sree
https://sites.google.com/site/agnivahnikukutpallythreefour/folder111/K__Sri_krishna_Dharmaraja_Saran[1].pdf
****************************************************************
****************************************************************
****************************************************************