ఉబుంటు 11.04

స్థిర రూపాంతరం  28 ఏప్రిల్  2011  న విడుదలైంది. 

పరిశీలించగా తెలిసిన  వివరాలు, దోషాలు క్రింద ఇవ్వబడినవి. వీటిని ధృవీకరించే వారు, వీటిని సరిదిద్దే వారు మెయిలింగ్ లిస్ట్ లో తెలియపరచవలసినదిగా కోరుచున్నాము లేక ఈ వెబ్సైట్ లో సభ్యత్వం తీసుకొని నేరుగా ఇక్కడి పేజీలను తాజాపరచవచ్చు.
<పేజీ తాజాకరణ పని జరుగుతున్నది>

స్థాపన

ప్రయత్నించబడిన హార్డ్వేర్
 1. డెల్ ఇన్స్పిరాన్ 600M లాప్టాప్, పెంటియమ్ మొబైల్ ప్రాసెసర్@1.6GHz, 1 GB రేమ్, 80 GB హార్డ్ డిస్క్ (మార్కెట్ ప్రవేశం 2003)
 2. డెస్క్టాప్  i945 chipset with Intel(R) Core(TM)2 Duo CPU     E7200  @ 2.53GHz మరియు 2GB రేమ్, 160 GB హార్డ్ డిస్క్, శామ్సంగ్ scx-3201  బహుళ కార్య లేసర్ ప్రింటర్. (మార్కెట్ లోకి వచ్చిన సంవత్సరం 2008)
డివిడి ఇమేజ్ (3.9GB) నెట్ లో బిఎస్ఎన్ఎల్   బ్రాడ్ బాండ్  512 Kbps అనుసంధానం ద్వారా పొందటానికి దాదాపు 22 గంటలు పట్టింది. ఆ తరువాత దానినుండి  డివిడి బర్న్ చేశాము.
మొదటి సారి ప్రత్యక్ష వాడుకలో కొంత సేపు తరువాత వ్యవస్థ దోషాలు వస్తూ (SquashFS Error: unable to read page block xxx, size yyy. గ్రాఫికల్ తెర పై  కంపిజ్ దోషాలు వచ్చి కొంత సేపులో మరుగునపడి మరల ప్రత్యక్షం అయ్యాయి. రెండవసారి అయితే  ప్రత్యక్ష అనుభవం బాగానే జరిగింది.మొత్త సిద్ధం అయినతరువాత స్థాపన  ప్రయత్నిస్తే సరిగా  జరుగుతున్నది.సిడి తోస్థాపన

సిడీ లో తెలుగు ఎంపిక వున్నా ప్రత్యక్ష అనుభవం ఇంగ్లీషులో వుంటుంది. దాని నుండి స్థాపన ఎంచుకున్నప్పుడు అవసరమైన భాష ఫైళ్లు అంతర్జాలం నుండి పొంది స్థాపించటం జరుగుతుంది. డివిడితో ఒక గంట సమయం పడితే, దీనికి   ఒక అరగంట ఎక్కువ సమయం పట్టవచ్చు,

తెలుగు రూపీకరణ

స్థాపన సమయంలో

గ్రబ్ బూట్లోడర్ లో తెలుగు రూపం విడివిడిగావుంది.
GRUB1.99 నుండి తెలుగు అనువాదం వచ్చింది. ఇవి నేను లాంచ్ పాడ్ లో చేర్చినవాటినే వాడుకున్నట్లుంది.

ఉబుంటు తెలుగు స్లైడ్ లు సరిగా కనిపించాయి.


వాడుకలో

చూడండి బీటా 2 సమీక్ష

యూనిటీ

 డెస్క్ టాప్ మెనూ, అప్లికేషన్ మెనూకి ఫాంటు సైజు ఎంపిక లేదు. అందుకని ఒక్కొక్కసారి తెలుగు మెనూ అక్షరాలు పైన (ఫైర్పాక్స్ కొన్ని పేజీలలో)  లేక క్రింద వైపున కొద్దిగా కత్తిరించబడుతున్నాయి. దీనిగురించి బగ్ నమోదు చేశాము

ఫైర్ఫాక్స్

కొన్ని పేజీలలో తెలుగు పెద్ద సైజు అక్షరాలలో పై అంచు కత్తిరించుకుపోతున్నది. ఫాంటు సైజు తగ్గించటం ద్వారా  దీనిని  ప్రస్తుతానికి సరిచేసుకోవచ్చు.  మరిన్ని వివరాలతో సరియైన చోట బగ్ దాఖలు చేయాలి. వికీపీడియా పేజీలు చూపించటంలో  ప్రక్కన వచ్చే పట్టీలో బొమ్మల అంచులు కత్తిరించుకోపోయే సమస్య వుంది. వ్యాసాలు బాగానే కనబడుతున్నాయిలిబ్రైఆఫీస్

తెలుగు మెనూలు ఇంగ్లిషు షార్ట్కట్ కీ అక్షరాల సైజులలోతేడా ఎక్కువగా వుంది. బగ్ దాఖలు చేయడమైనది.
దీనిని సరిచేయటానికి మీరు  వ్యవస్థ అమరికలలో అకారం లో పత్రం ఫాంటుగా లోహిత్ ఎంపిక చేస్తే సరిపోతుంది. అయితే లోహిత్ లో డాష్ ఖాళీగా వుంటుందని గుర్తుంచుకోండి.

అనువాద దోషాలు

క్రింద అనువాదాలు సవరించటానికి  https://translations.launchpad.net/ubuntu/natty/+lang/te లోని పాకేజీలో మార్పులు చేసి పైనిల్వలలో కూడా మార్పులను దాఖలు చేయండి. ఇక్కడి వరుసలపై అడ్డగీత చేర్చండి.

స్థాపించుటకు ముందు హెచ్చరికలు

స్థాపించు
apt-all?
Retrieving file X of Y. ->  X ఫైల్ Y ఫైళ్లలో పొందుతున్నాము  మరల ఇంగ్లీషులో కనబడుతుంది.
ముందుకు [Action](I) -> ముందుకు [Action](I)


ఉబుంటు సాప్టవేర్ కేంద్రము


ఎంఫథీ  
offline  లైను వెలుపల -> ఆఫ్ లైన్
అందుబాటులో వుంది->   అందుబాటులో వున్నాను


టోటెమ్
ఎంకొండి
-> ఎంచుకోండి (సందర్భం కొత్త ప్లగిన్ లను చేర్చేటప్పుడు)
ప్లగిఇన్ మెసేజ్ లు ఇంగ్లీషులోవున్నాయి
పల్స్ ఆడియో

అనువాదాల ప్రాధాన్యతలు

వచ్చే అక్టోబర్ 2011 విడుదలకు  చూడండి.

ఇతర ప్రాధాన్యతలు

 • ఉబుంటు తెలుగు వాడుకరి పుస్తకం తయారీ. చూడండి వికీబుక్స్ లో ప్రయత్నం పూర్తయ్యింది.
 • ఉబుంటు తెలుగు డివిడి  తయారీ
 • ప్రస్తుతానికి ఉబుంటు డివిడే ని వాడి కావలసిన వాటి కి లింకులు ఇవ్వడం మంచిదని నిర్ణయించటమైనది.
  • అత్యవసరము
   • దోషాలు సవరించిన పాంగో  ( అర్జున   సరిచేసిన పాకేజీలు  (i386 -32bit) కొంతకాలం పాటు దొరకుచోటు.   వీటిని తెచ్చుకొని సంచయంలో పెట్టుకున్ అక్కడనుండి sudo dpkg -i *.deb అన్న అదేశం టర్మినల్ నుండి ఇస్తే చాలు. ఆ తరువాత లిబ్రెఆఫీసు తప్ప మిగతా వాటిలో నిష్కళంక తెలుగు రూపీకరణ చూడవచ్చు.

   • లిబ్రెఆఫీసు 3.4 మే 2 విడుదల తర్వాత ఉబుంటు పాకేజిగా మార్చి (అక్షరదోషాలు సవరింపబడే విడుదల)
   • అడోబ్ ఫ్లాష్ ప్లగిన్ (Adobe-flashplugin from Ubuntu software centre natty-partner repo) అనుమతి సంపాదించడమైనది.
   •  ఫైర్ఫాక్స్ కు తెలుగు ముద్రాక్షర తనిఖీ ప్లగిన్,
   •  IBUS-M17N  పాకేజీ
  • అవసరము
   • గింప్
   • స్కైప్
 • ఉబుంటు తెలుగు డివిడి కవర్ రూపకరణ
 • ఉబుంటు తెలుగు కరపత్రం. చిత్తు ప్రతి తయారైంది
Comments