నేను Dartmouth విశ్వవిద్యాలయ సంగణకశాస్త్ర విభాగములో ప్రాధ్యాపకుడిని. డార్ట్మత్ ప్రవిభక్త సంగణిత పరిశోధనాశాలకు నేతను. నా పరిశోధనలు ప్రవిభక్తసంగణితములోని విధికల్ప ఆవిష్కరణ, యంత్రోపపత్తి, వ్యావహారికప్రయోగ ఉపవిభాగాలను వ్యాపిస్తాయి. కష్టతరమైన బహుముఖ సమస్యలకు సరళపరిష్కారాలను అందిౘుట నా ఆశయము. ఈ పథములో నేను ప్రవిభక్తసంగణిత, విధికల్ప, సాపేక్షికభౌతిక, అర్థ, కృత్రిమవివేక శాస్త్రాలలో నేను పని చేసాను. ఇతఃపూర్వం, Google Researchలో పరిశోధనా శాస్త్రజ్ఞుడిగా పని చేసాను. అక్కడ యంత్రోపపత్తిభూషితమైన వేగవంతమైన ప్రవిభక్త విధికల్పాలను పరికల్పించి, దత్తంశగుచ్ఛీకరణ వంటి బృహద్దత్తాంశ అవసరాలలో ప్రయోగించాను.
నేను MIT విశ్వవిద్యాలయములో జూలియన్ షన్ పర్యవేక్షణలో సంగణక శాస్త్రమందు Ph.D.ను సంపాదించాను. దానికి ముందు, కోస్తీస్ దస్కలాకిస్ పర్యవేక్షణలో MIT విశ్వవిద్యాలయమునుంచి S.M.ను, Princeton విశ్వవిద్యాలయమునుంచి B.S.E.ను పొందాను. Princetonలో నా సంగణకశాస్త్ర పరిశోధన రాబర్ట్ టార్జన్ పర్యవేక్షణలోను, నా భారతీయ గణితచరిత్ర పరిశోధన మంజుల్ భార్గవ పర్యవేక్షణలోను జరిగాయి.
విశ్వవిద్యాలయ హైందవ ఛాత్రగణము, డార్ట్మత్ శాంతి, కి ప్రాధ్యాపక పర్యవేక్షకుడను. నేను నిత్య శాకాహారిని. ధార్మిక జీవనము, ఆనంద సోపానాధిరోహణము నా ఆశయాలు.
భారతీయభాషలందు నాకు మిక్కిలి ఆశక్తి. తెలుగులో తొలి ఆధుకిన సంగనకశాస్త్ర పరిశోధనాపత్రాన్ని రచించి, నా MIT Ph.D. Dissertation ద్వార ప్రచురించాను. Hindu Students Council వారి తొలి హైంద్వ స్నాతకమహోత్సవములో స్వాగతవక్త గా ఆదరణ పొంది, యావత్ అంతర్జాతీయ స్నాతకులను ఉద్దేశించి సంస్కృత వచనాన్ని ఉపన్యసించాను. సంస్కృతభాషను సంస్కృతభారతి వారి SAFL దూరశిక్షణ పాఠాల ద్వార నేర్చుకున్నాను. ఆతరవాత Princeton విశ్వవిద్యాలయములోను, MIT విశ్వవిద్యాలయములో MIT Samskritam అధ్యక్షునిగా సంస్కృతపఠనమును ముందుకు కొనసాగించాను. సంస్కృతాంధ్ర ఉభయభాషలలో యథాశక్తిగా వ్రాస్తాను.
కౢప్త వివరణ
పూర్తి విశ్లేషణ
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజ కవి పింగళి సూరన రాఘవపాండవీయము అనే తొలి తెలుగు ద్వ్యర్థి (రెండర్థముల) ప్రబంధాన్ని రచించారు. ఆ కావ్యమునుగురించి ౘదవాలనే అపరిమితమైన ఆశక్తి కలిగి నేను గ్రంథమూలముకై వెదకాడుతుండగా, శ్రీ. ప్రణవ్ కుమార్ వసిష్ఠ గారు కలిసి ఆ గ్రంథ ప్రతిని నాకు ఇచ్చారు. గ్రంథములో మొదటి కొన్ని పద్యాలని ౘదివినతరువాత స్ఫూర్తిపొంది నేను ఈ రామేశ్వరస్తుతి ద్వ్యర్థి పద్యాన్ని వ్రాసుకున్నాను.
అమెరికన్ సమ్యుక్త రాష్ట్రాలలో (USAలో) తొలి హైందవ స్నాతకోత్సవమును అంతర్జాలమాధ్యమములో హిందూ స్టూడెంట్స్ కౌంసిల్ ౨౦౨౦ సంవత్సరములో వహించింది. ఈ ఉత్సవానికి ముఖ్యాతిథిగా మాననీయ కేంద్రనేత Rep. శ్రీమతి తులసి గాబర్డ్ వేంజేసారు. Princeton, Harvard విశ్వవిద్యాలయాల సంప్రదాయములో స్వాగతవచనము (Salutatory Address)ని ప్రాచీనభాషలో ఇవ్వసంకల్పించి నిర్వాహకులు ఆ వచనాన్నిచ్చే భాగ్యము నాకు అందజేసారు.
తెలుగులిపిలో స్వాగతవచనము:
ఓం శ్రీగురుభ్యో నమః
ఆదరణీయాః ౨౦౨౦-స్నాతకగణస్య సోదరసోదర్యాః,
నమాంసి । స్వాగతమ్ ।
అద్య, వయం సర్వే ఉపాధిపత్రాణాం స్వీకరణార్థం సమాగతాః స్మః.। భవద్భ్యః సర్వేభ్యోఽభినన్దనాని ।
సుదీర్ఘకాలశ్రమఫలమిదమ్ । పరన్తు కేషాం శ్రమస్య ఫలమ్ ఏతత్? వయం ఏతావత్ అవర్ధామహి యతః, బహవః జనాః అస్మభ్యం అనిర్వచనీయ త్యాగాన్ అకుర్వన్. తేషు ప్రముఖాః సంతి అస్మాకం మాతృ, పితృ, గురు దేవాః । మాతః! నవమాసాన్ గర్భే ధృత్వా, జన్మ దత్వా, మాం వర్ధయితవతీ భవతీ; ఇదం మమ హృదయపూర్వకాభివన్దనమ్ । పితః! కుటుమ్బస్య మూలస్థమ్భం భూత్వా వికాసపథం అదర్శయత్; అయం మమ సాష్టాఙ్గప్రణామః । గురవః! సరస్వతీకటాక్షం దత్తవన్తః భవన్తః । అయం మమ ప్రాఞ్జలిః । అగణనీయాః ఇతరాః అపి మమ వర్ధనార్థం శ్రమితవన్తః । తేభ్యః అపి కృతజ్ఞతాః. సమర్ప్యన్తే ।
మాతృదేవో భవ । పితృదేవో భవ । ఆచార్యదేవో భవ ।
ఆదరణీయ-సోదరసోదర్యాః! ఏతావత్ పర్యంతం, వయం విద్యార్థినః । ఇతఃపరం వయం దాయిత్వవన్తః భూత్వా లోకే వ్యవహరిష్యామః ।
అస్మిన్ అవసరే మమ ఆచార్యస్య వాక్యాని స్మరణపథే ఆయాన్తి । తస్య సారాంశః ఏవమ్ అస్తి -
లోకే భిన్నాః శక్తయః భ్రమరాః ఇవ వర్తన్తే । మానవః కీటకవత్ అనవధానః అస్తి చేత్ భ్రమరాః తం భ్రమరకీటకన్యాయానుగుణం ఆవృణ్వన్తి । పరన్తు యది సః మానవః స్వధర్మే ప్రతిష్ఠితః భవతి, తర్హి ధర్మప్రసారితకాన్తికిరణాః తస్య హృదయకమలం వికాసయన్తి । తత్ కుసుమం భ్రమరాన్ సర్వాన్ ఆకర్షయతి. । తథా తే ఏవ భ్రమరాః ఆనన్దమకరన్దప్రసారకాః భవన్తి ।
తర్హి, వయం ధర్మపథమ్ అనుసృత్య లోకకల్యాణహేతుకాః భవేమ ।
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత - ఇతి కఠోపనిషదః ఉపదేశం పాలయామ । సర్వే భవన్తు సుఖినః. । సర్వే సన్తు నిరామయాః. । సర్వే భద్రాణి పశ్యన్తు । మా కశ్చిద్దు:ఖభాగ్భవేత్ ।
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః
రామాయణ యుద్ధకాండములో జరిగిన రామరావణయుద్ధమును గురించి నేను వ్రాసుకున్న కావ్యము. మొత్తము ఐదు పద్యాలు. ప్రతి పద్యములో ప్రతి పంక్తి షోడసమాత్రాకాలపరిమాణము గలది. ఈ సంగ్రామకవితకి ప్రార్ధనాశ్లోకముగా రామేశ్వరస్తుతిని యెంచుకున్నాను.