“శ్రీకృష్ణ సహిత పంచ పాండవ పిరమిడ్ ధ్యాన మందిరాలు”
అత్యంత శక్తి, సంపన్నులైన పంచపాండవులు మరియు వారికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రీ కృష్ణ పరమాత్మలకు ప్రతీకగా, బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ ఆదేశానుసారం గజ్వేల్ పట్టణానికి తూప్రాన్ రోడ్డులో 6 కి.మీ. ల దూరంలో ‘ధర్మారెడ్డిపల్లి’ గ్రామ శివారులోని ‘కోమటిబండ’ గ్రామ సమీపం వద్ద, ఆహ్లాదకరమైన, ప్రకృతివనంలో, పంచవృక్ష మరియు వనస్పతిమొక్కల సమూదాయంలో ‘నాచారంగుట్ట’కు 12 కి.మీ. ల దూరంలో 18’×18’ సైజులో ఐదు అత్యద్భుతమైన పిరమిడ్ లను, ఒకేసారి 500 ల మంది ధ్యానులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా (క్రాప్ సర్కిల్ ప్లాన్ ప్రకారం మరియు మద్యలో శ్రీ కృష్ణ పిరమిడ్ 36’×36’ నిర్మించడానికి “మహాలయ పిరమిడ్ ట్రస్ట్(గజ్వేల్)” వారు సంకల్పించారు.
రాబోయే సత్యయుగంలో ఓజోన్ పొరను కాపాడడంలో, భూమిని, ప్రకృతిని, ఎటువంటి వైపరిత్యాల నుండైనా రక్షణ కల్పించడంలో, విశ్వకళ్యాణం కొరకు, ఆరోగ్యం మరియు ఆనందం కల్గించడంలో పిరమిడ్ ల పాత్ర అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది.ఈ అద్భుత నిర్మాణం గజ్వేల్ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలలో అతి గొప్ప ధ్యాన పిరమిడ్ ల సమూదయంగా మన్ననలను పొందబోతోంది
ట్రస్టు నిర్మాణ కార్యక్రమాలు:
1.ఐదు పంచపాండవ పిరమిడ్ ధ్యాన మందిరాలు,
2. ప్రకృతి వనస్పతి మొక్కల పెంపకం
3..గోశాల,
4.ప్రకృతి వ్యవసాయ సాగు శిక్షణా కేంద్రం,
పిరమిడ్స్ వలన ఎన్నో ఉపయోగాలు
పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు శరీరం లో “విద్యుత్ అయస్కాంత జీవ రసాయనిక చర్యలు “జరిగి దేహంలోని ప్రతికణం శుభ్రపరచబడుతుంది. బ్రెయిన్లోని “సెల్స్” ఉద్దీపనం చేయబడి, మనోశక్తి ప్రబలమౌతుంది. అఖండమైన మానసిక వికాసం కలుగుతుంది. పిరమిడ్ లో పదార్ధాలను ఎంతకాలం వుంచినా, వాటి మౌలికమైన ధర్మాలలో ఎలాంటి మార్పు ఉండదు. పిరమిడ్ శక్తి వలన శరీరం లోని అన్ని అవయవాల కణజాలం సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా అనారోగ్యాన్ని అధిగమించగలం. విద్యార్ధులు పిరమిడ్ టోపీ పెట్టుకుని చదవడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది. పిరమిడ్ శక్తి వల్ల రంధ్రం పడిన “ఓజోన్పోర “ మళ్లీ పూడుకొని విశ్వానికి నూతన శక్తిని అందజేస్తుంది. ఈ విషయాన్నీ అమెరికా,రష్యా దేశాల సైంటిస్టులు ఉపగ్రహం అందించిన ఛాయాచిత్రాల ద్వారా ఇటీవల ధ్రువీకరించారు. ఇటీవల పొలిసుశాఖ వారు నాగపూర్ జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో కొన్నిచోట్ల రోడ్డు పైన పిరమిడ్ లను ప్రతిష్ఠించిన తర్వాత గడచిన సంవత్సర కాలంలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదని నిరూపించబడినది. కనుక ప్రతి ఊరులోను, ప్రతి ఇంటి పైన పిరమిడ్ ల నిర్మాణం జరిగినట్లయితే ప్రకృతి వైపరీత్యాల బారి నుండి మనం తప్పక రక్షించబడతాము.