Gajwel Toopran Road, Dharmareddy palli, Near komatibanda
Ph no 9848347334,8341321900
సుఖాసనంలో... హాయిగా.... కూర్చుని... చేతులు రెండు కలిపి... కళ్ళు రెండూ మూసుకుని ప్రకృతిసహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే... ఏకధారగా... గమనిస్తూ వుండాలి! ఏ దేవతా రూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు! ఏ దైవనామస్మరణ వుండరాదు! మామూలుగా జరుగుతూ ఉన్న ఉచ్వాసనిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ వుండాలి. మధ్య మధ్యలో అనేకానేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు 'కట్' చేస్తూ... మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే... ధ్యాసను మరల్చుతూ వుంటే... క్రమక్రమంగా.. ఆలోచనా రహితస్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం, పరిశూన్యం అయిపోతుంది.. ఇదే ధ్యానస్థితి. ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, ఆత్మానుభావాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపలవున్న విశ్వమయ ప్రాణశక్తి, అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. మరి ఎవరి వయస్సు ఎంత వుంటుందో.. కనీసం అన్ని నిమిషాలు.. తప్పనిసరిగా.. రోజుకి రెండుసార్లుగా.. ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.
చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వ్యాధి నిరోధకశక్తి అద్భుతంగా పెరుగుతుంది మానసిక ఆందోళనలు, ఒత్తిడులు తొలగి, చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అపూర్వమైన ప్రగతి ఉంటుంది. వైవాహిక జీవితానందాన్ని పొందే శక్తిసామర్థ్యాలు మరియు ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివి, ప్రతిభ అభివృద్ధి చెందుతాయి. మనకు అనేక జన్మలున్నాయని తెలుస్తుంది. దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది. నేను దేహం కాదు ఆత్మను అని తెలుస్తుంది.
MAHALAYA PYRAMID TRUST, GAJWEL
Reg. no. 10/2012,
For more details Cell no; 9848347334,8341321900