Empowering Deserving Lives - BNR Foundation:  
Dr. Beechu Naresh Kumar Reddy established the BNR Foundation in 2019 in memory of his father, the Late Sri Beechu Nageswara Reddy, to support the underprivileged. The foundation provides food, clothing, free medical camps, and financial assistance to those in need. During the 2020 COVID-19 lockdown, they delivered essential supplies and meals to struggling families and frontline workers. Every second Monday, with the blessings of Nageswara Swamy, the foundation organizes a food donation program at Kadapa RIMS General Hospital, continuing its mission to uplift the poor.  This ongoing effort reflects the foundation's deep commitment to serving humanity and spreading kindness in memory of a cherished father.

Key Initiatives and Impact of BNR Foundation:

The Spirit of BNR Foundation
Rooted in kindness and inclusivity, the foundation creates a legacy of compassion through every meal served and every life touched. Its mission, "Empowering Deserving Lives," inspires hope and transforms communities with unwavering dedication.





మనలోనే ఒకరు...ఆపదలో ఆదుకుంటారు!

సమాజ సేవలో భాగంగా పేద ప్రజలను ఆదుకోవడంలో తమ వంతుగా భాగస్వామ్యం అవ్వాలని డాక్టర్ బీచు నరేష్ కుమార్ రెడ్డి మిత్రులు ఎం. శ్రీనివాసులురెడ్డి, వై. హరి నారాయణ రావు, వి. సుబ్బరాయుడు, సి. రాజశేఖర్, ఎం. లక్ష్మీ నరసింహులు సభ్యులుగా తండ్రి పేరు (దివంగత శ్రీ బీచు నాగేశ్వర రెడ్డి) తో 2019లో (Regd No: 90/2019) బియన్ఆర్ ఫౌండేషన్‌ను నిరుపేదల కోసం స్థాపించి సమాజానికి సేవలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  ఈ ఫౌండేషన్ పేదలకు అన్నం పెట్టడం, బట్టలు పంపిణి చేయడం, నిరుపేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆర్థిక సాయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. తండ్రి ఆశయ సాధన కోసం 2019లో ఫౌండేషన్‌ను స్థాపించి, పేదల ఉన్నతికి అవసరమైన చేయూత అందిస్తుంది. 2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసింది. లాక్డౌన్ సమయంలో పారిశుద్య కార్మికులకు కూడా నిత్యావసర వస్తువులు అందించి, ఐసోలేషన్‌లో ఉన్న వారి ఇంటికి రెండు పూటల భోజన ప్యాకెట్లు అందజేశారు. బాటసారులు, యాచకులకు భోజనాలు పంపిణీ చేశారు. 


"అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న" అనే భావంతో ప్రతి నెల రెండవ సోమవారం కడప రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో బీచు నరేష్ కుమార్ రెడ్డి, వాలంటీర్ల సహకారంతో, నాగేశ్వర స్వామి ఆశీసులతో బియన్ఆర్ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.