పరీక్షా విధానంలో సంస్కరణలు:
GO.82 లోని ముఖ్యాంశాలు:
1) 2015-16 విద్యా సంవత్సరం నుండి 6,7,8,9 తరగతుల వరకు CCE అంతర్గత మరియు బహిర్గత రూపాలలో అమలు చేయబడుతుంది.
2) 2016-17 సంవత్సరం నుండి 10వ తరగతిలో CCE అమలు చేయబడుతుంది.
3) 2015 మార్చి లో జరిగిన మాదిరిగానే 2016 మార్చిలో SSC పరీక్షలు జరుగుతాయి. అనగా ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులేదు.
6,7,8 తరగతులకు ఇప్పుడున్నట్లుగానే పరీక్ష పేపర్లు ఉంటాయి. కానీ 80 మార్కులకే ఉంటాయి.
9,10 తరగతులకు మొత్తం 11 పేపర్లు ఉంటాయి.
హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్లు, ఒక్కో పేపరుకు 40 మార్కులకు ఉంటుంది.
హిందీ 80 మార్కులకు ఉంటుంది.
మిగిలిన 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం అనగా 4 FA లు మరియు 2 SA లలో వచ్చిన మార్కులకు లెక్కించబడుతుంది.
కేవలం విద్యార్ధి చివరి పరీక్షలలో చూపే ప్రతిభ కాకుండా పాఠశాలలో మొదటి నుండి వివిధ అంశాలలో చూపే ప్రతిభ ఆధారంగా 20% మార్కులు పొందును.
అన్ని పేపర్లకు పరీక్షా సమయం 2.30 గంటలు మరియు ప్రశ్నాపత్రం చదువుటకు 15 నిమిషాలు మొత్తంగా 2.45 గంటలు ఇవ్వబడుతుంది.
9వ తరగతి లో ఈ సంవత్సరము నుండే ఈ మార్పులు అమలు అవుతాయి. SA లలో 11 పేపర్ల విధానం అమలు అవుతుంద
పాఠ్యాంశాల-మూల్యాంకనం (GO.82 ప్రకారం )
1) నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Assessment):
ఈ మూల్యాంకనం ఇప్పటికే అమలు చేస్తున్న మాదిరిగా 6,8 తరగతులలో సంవత్సరంలో 4 సార్లు చేయాలి.
FA లలో 50 మార్కులకు గాను 18 మార్కులు పాస్ మార్క్ గా పరిగణించబడుతుంది.
ప్తస్తుతం ఉన్న గ్రేడింగ్ కూడా మారుతుంది.
భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం లలో విడివిడిగా FA నిర్వహించినా రెండింటినీ కలిపి 50 మార్కులకు తగ్గించి సైన్స్ సబ్జెక్ట్ కింద నమోదు చేయాలి.
2) సంగ్రహణాత్మక మూల్యాంకనం(Summative Assessment):
6 నుండి 10 తరగతులకు 3 SA లు నిర్వహించబడతాయి.
10 వ తరగతికి 3వ SA కు బదులుగా పబ్లిక్ పరీక్ష నిర్వహించబడుతుంది.
SA-1 మరియు SA-2 ప్రశ్నా పత్రాలను DCEB తయారు చేయించాలి.
6,7,8 తరగతులకు SA 80 మార్కులకు మరియు 9,10 తరగతులకు ఒక్కొక్క పేపరు 40 మార్కులకు, హిందీ మాత్రం 80 మార్కులకు ఇవ్వబడుతుంది.
SA-3 ప్రశ్నా పత్రాలను (6 నుండి 9 తరగతులకు) SCERT రూపకల్పన చేసి DEO లకు మెయిల్ చేస్తుంది.
SA-3 లో 20 మార్కులను 4 FA లు, 2 SA లలో వచ్చిన మార్కులనుండి తీసుకోవాలి.
అనగా 4 FA ల మొత్తం = 200
2 SA ల మొత్తం(80+80) = 160
(4FA+2SA) = 360.
పాస్:
ప్రతీ సబ్జెక్ట్ నందు 35% రావాలి(హిందీ కూడా).
అనగా 80 మార్కులకు గాను 28(GOలో 27 అని ఇచ్చారు) SA-3 లో తప్పకుండా రావాలి.
మిగిలిన 7 మార్కులు(GOలో 8 అని ఇచ్చారు) అంతర్గత మూల్యాంకనం నుండి రావాలి.
అంతర్గత మూల్యాంకనం నందు పాస్ మార్క్ లేదు.
కానీ SA-3 మరియు అంతర్గత మార్కులు కలిపితే 35 మార్కులు తప్పకుండా రావాలి.