తాటి కల్లు
తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి కల్లు కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కల్లును నీరా అంటారు.