పత్రికా ప్రకటన
చిత్తూరు జిల్లా పోలీస్…
చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెల 02వ తేది నుండి 07వ తేది వరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి యందు వైద్య పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా, 05-09-2025న వైద్య పరీక్షకు హాజరుకావలసిన పురుష అభ్యర్థులు (సివిల్ & ఎపిఎస్పీ) Regd.No. 4094065 నుండి 4174863 వరకు వారి వైద్య పరీక్ష తేదీని 08-09-2025కు మార్చడమైనది.
అదేవిధంగా, 07-09-2025న వైద్య పరీక్షకు కేటాయించబడిన పురుష అభ్యర్థులలో Regd.No. 4254681 నుండి 4344024 వరకు అభ్యర్థుల వైద్య పరీక్ష తేదీని 09-09-2025కు మరియు Regd.No. 4347758 నుండి 4504895 వరకు అభ్యర్థుల వైద్య పరీక్ష తేదీని 10-09-2025కు మార్చడమైనది. ఈ మార్పును అభ్యర్థులు గమనించగలరని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.
వైద్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమవెంట హాల్ టికెట్లు, ఆధార్ కార్డ్ మరియు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (02) తీసుకురావలసిందిగా కోరడమైనది.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
చిత్తూరు