Dalitha Shakthi Monthly Magazine - +91 94401 54273, dalithashakthi@gmail.com
Dalitha Shakthi Monthly Magazine - +91 94401 54273, dalithashakthi@gmail.com
దళితశక్తి మాసపత్రిక 6వ తేదిన సంచికను పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. పత్రిక రాని వారు 15 తేది తర్వాత ఫోన్ లేదా వాట్సాఫ్ ద్వారా సంప్రదించగలరని విజ్ఞప్తి.
సంపాదకీయం
బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ మై ఫ్యాషన్
భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ బహుముఖ ప్రాభవాన్ని చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. ఆయన జీవితం, అభిప్రాయాలు, పోరాటాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు. ఆయన ఆశయాలు సమాజానికి వెలుగు, నాకు దిశానిర్దేశం. అంబేడ్కర్ చూపిన మార్గమే మాకు స్ఫూర్తి, మా ప్రతి అడుగులో ఆయనే ప్రేరణ. న్యాయం, సమానత్వం, స్వతంత్రత కోసం ఆయన నిరంతరం పోరాటం చేసిన తీరు ప్రతి యువతకు ఆదర్శప్రాయంగా మారింది. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు నేడు కూడా సమాజానికి పునరుజ్జీవాన్ని అందిస్తున్నాయి, అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
బాల్యం నుంచే అంబేడ్కర్ కులవివక్షలను ఎదుర్కొన్నారు. అంటరానితనం వల్ల ఆయనకు చదువు కూడా సులభంగా లభించలేదు. పాఠశాలలో నీటిని తాగే సమయంలోనూ ఎదురైన అవమానాలు ఆయనకు జీవిత పాఠాలుగా మారాయి. ఆ అవమానాలనే ప్రేరణగా మార్చుకుని, నైతిక ధైర్యంతో ప్రపంచంలో అత్యధిక విద్యను పొందిన వ్యక్తిగా నిలిచారు. అమెరికాలో కోలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్లు సంపాదించిన అంబేడ్కర్ విద్యార్హతలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
సామాజిక సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన పోరాటాలు భారతదేశానికి అపూర్వమైన మైలురాళ్లు. కులవివక్ష నిర్మూలనకు ఆయన చేసిన ప్రయత్నాలు సామాజిక న్యాయం వైపు దేశాన్ని నడిపించాయి. మహారాష్ట్రలోని చవ్దార్ తాలాబ్ వద్ద నీటిని త్రాగే హక్కు కోసం నిర్వహించిన పోరాటం, మనువు ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా కాల్చి కులవివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విధానం ఆయన స్పష్టమైన ధక్పథాన్ని సూచిస్తాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
భారతదేశాన్ని స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన సూచించిన పధకాలు భారత ఆర్థిక చరిత్రలో కీలకమైనవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ఏర్పాటు ఆయన ఆర్థిక ప్రతిభకు నిదర్శనం. శ్రామికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఆయన రూపొందించిన విధానాలు నేటికీ ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి.అందుకే ఆయన మాకు ఫ్యాషన్. అంబేడ్కర్ చేసిన విశ్లేషణలు ప్రతీ రంగాన్ని ప్రభావితం చేశాయి. కార్మికుల హక్కులను పరిరక్షించడానికి 12 గంటల పని వ్యవస్థను 8 గంటలకు కుదించడంలో ఆయన పాత్ర అమూల్యమైనది. సామాజిక సమానత్వానికి, ఆర్థిక న్యాయానికి ఆయన చేర్చిన మార్గదర్శక సూత్రాలు నేటికీ సమాజంలో ప్రాధాన్యతను కలిగిస్తున్నాయి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చట్టసభల్లో సమాన హక్కులు కల్పించడమే అంబేడ్కర్ లక్ష్యం. ఆయన రూపొందించిన హక్కుల సంరక్షణతో ప్రజాస్వామ్యానికి స్థిరత్వం ఏర్పడింది. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
అంతర్లీనంగా హిందూ మతం సష్టించిన కులవ్యవస్థను నిర్ధారించడానికి, సమానత్వం పునరుద్ధరించడానికి, బౌద్ధమతంలోకి మారిన అంబేడ్కర్, సమాజానికి నిజమైన మార్గదర్శిగా నిలిచారు. తన అనుచరులకు కూడా అదే మార్గాన్ని సూచించి సమాజంలో సమానత్వానికి ప్రాధాన్యతను చూపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మహానీయులను అవమానిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పి, మంత్రిపదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు భారతదేశంలోని 95% బడుగు బలహీన వర్గాల మనస్సులో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శనం. భారత రాజ్యాంగం ప్రతి భారతీయునికి మార్గదర్శనం చేస్తున్నట్లే, ప్రతి సమస్యకు, ప్రతి పోరాటానికి అంబేడ్కర్ ఆశయాలు మార్గదర్శనం. సమానత్వం, స్వతంత్రం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చూపిన దారిలో నడవడమే నేటి యువతకు ఫ్యాషన్.
- బి.గంగాధర్, ఎడిటర్
లోక్‌సభ ఎన్నికలలో ప్రజాస్వామ్యం అతిపెద్ద విజేతగా నిలిచింది. తాము ప్రజాస్వామ్యానికీ రాజ్యాంగానికీ ఎంత విలువ ఇస్తామో ఈ తీర్పు ద్వారా ప్రజలు చాటి చెప్పారు. 2014లోనూ 2019లోనూ పరిపూర్ణ ఆధిక్యత తెచ్చుకున్న బిజెపికి ఈ సారి ప్రజలు ఆ అవకాశం నిరాకరించారు. జూన్ 4న ప్రకటించిన ఫలితాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని భిన్నత్వాన్ని నొక్కి చెప్పాయి. 64.2 కోట్లమంది ఓటర్ల నుంచి అధికార పార్టీ బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనేది స్పష్టం. గత రెండు నెలలుగా నిరంతరాయంగా చేపట్టిన ప్రధానమంత్రి ప్రచారంలో ఎన్డీఏ నిక్కచ్చిగా 400 సీట్లు సాధిస్తుందని, అందులో బీజేపీ లక్ష్యం 370సీట్లుగా ఘనప్రచారం చేశారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో ఇది ఖాయమని దేశవ్యాప్తంగా హౌరెత్తించారు. అయితే ఎట్టకేలకు అతి కష్టంగా 303 స్థానాలున్న బిజెపి సీట్ల సంఖ్య ఈసారి 240కి పడిపోయింది. అంటే 21 శాతం తగ్గింది. ఎన్.డి.ఏ కు 292, 'ఇండియా' వేదికకు 234 స్థానాలు వచ్చాయి.
మోడీ పదేళ్ల పాలన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ పాలన మొత్తం లక్షణం నియంతత్వ పోకడలతో హిందూత్వ మతతత్వ ఎజెండాను అమలు జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి అంగమూ దిగ్బంధానికి గురైంది. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకోవడానికి దారితీసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జైళ్ల పాలైనారు. రాజకీయ పక్షాలపై కక్ష సాధింపు సాగింది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్షానికి సమాన అవకాశం లేకుండా పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలలో ముస్లింలపై విషం కక్కుతున్నా హద్దు ఆపూ లేకపోయింది. ఈ కీలక రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతకు విఘాతమేర్పడింది. కార్పొరేట్ మీడియావరణాన్ని పూర్తిగా బిజెపి గుత్తాధిపత్యంలోకి తెచ్చేసుకుంది. సోషల్ మీడియాలోనూ భారీ వనరులు గుమ్మరించింది. ప్రచారంలోనూ ఓటర్లకు పంచిపెట్టడం కోసమూ వేల కోట్లు వెచ్చించింది. ఏమైనా నిరంతరం అప్రమత్తంగా వుండటం ఇప్పటికీ అవసరమే. ఎందుకంటే నిరంకుశ హిందూత్వ లక్షణాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ కూటమి జన్యుధాతువుల్లోనే వున్నాయి. తమ ఎజెండాను ముందుకు నెట్టడానికి ప్రత్యక్షంగా కాకపోతే రహస్యంగా మార్గాలు నిరంతరం వారు అన్వేషిస్తూనే వుంటారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వానికి కట్టుబాట్లు సూత్రాలుగా పని చేయాలి. నిరంకుశ మతతత్వ ప్రమాదంపై పోరాటం ఎంత మాత్రం ముగియలేదు.
భారతదేశ న్యాయ చరిత్రలో నూతన అధ్యాయం జులై 1 న మొదలుకానుంది. కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటీషర్లు అమల్లోకి తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) అమల్లోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసులు, ఫిర్యాదులు నమోద వుతాయి. ఈ నూతన నేర, న్యాయచట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
ఆలోచన అనేది మానవుల బుద్ధికి సంబంధించిన ఒక విశేష లక్షణం. ఇది మెదడుతో ముడిపడి ఉంటుంది మరియు మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. భూమిపై ప్రతి మనిషి ఆలోచనా విధానం అనేది ప్రత్యేకం. ఒక మనిషి ఆలోచనలు మరొక మనిషి ఆలోచనలకు పూర్తిగా సరిపోతాయని చెప్పడం కష్టం. ప్రతి వ్యక్తి తన ఆలోచనలను బట్టి మంచి లేదా చెడు పనులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఈ ఆలోచనలను ఆధారం చేసుకుని, కొన్ని సంస్థలు మరియు వ్యక్తులు కులం, మతం, జెండర్ వంటి అంశాల్లో తప్పుడు సంప్రదాయాలను కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి తప్పుడు పద్దతులను అడ్డుకోవడంలో, ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్ బి.విజయ భారతి గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బి.విజయ భారతి పేరు తెలియని వారు చాలా తక్కువ. రచయితగా తన ఆలోచనలను పుస్తకాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేశారు. ముఖ్యంగా స్త్రీల అంశాలపై ఆమె కృషి మరువలేనిది. బానిస సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీల అణచివేత, అసమానతలపై ఆమె రచనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఉన్న కులం, మతం, జెండర్ అంశాలపై ఆమె అనేక పరిశోధన పత్రాలు రాశారు మరియు పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
తన ఆలోచనల్లో వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను డాక్టర్ బి.విజయ భారతి గారు 'దళితశక్తి' మాసపత్రికలో ప్రచురించడం ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఆమె కృషి మానవ సమాజంలో సమానత్వం మరియు న్యాయసంస్థలను బలపరచడంలో కీలకంగా ఉంది. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడంలో, సాంఘిక న్యాయం సాధించడంలో ఆమె పాత్ర అత్యంత ముఖ్యమైనది.
''ఆలోచన'' పేరుతో డాక్టర్ బి.విజయ భారతి గారు రచించిన వ్యాసాలను తీసుకువస్తున్నాం.
''మొదట్లో, మా అమ్మ బతికి ఉన్నన్నాళ్లూ ఆమే నాకు జన్మనిచ్చిందేమో అనుకునేవాడిని. అమ్మ వెళ్లిపోయిన తర్వాత, నా మొత్తం అనుభవాలనూ కలిపి చూస్తే నాకు నిశ్చయంగా ఓ విషయం అర్థమయింది. నన్ను ఆ పరమాత్ముడే ఈ లోకానికి పంపించాడు. ఈ శక్తి ఒక భౌతికమైన శరీరంతో వచ్చింది కాదు. ఈ శక్తి ఏదో ఒక పనికోసం ఈశ్వరుడు నాకు ఇచ్చింది. నాకు ఈ జీవితమే కాదు, దయా, ప్రేరణా అన్నీ ఆయనే ఇచ్చాడు. పురుషార్థం సాధించే ఈ సామర్థ్యమూ ఆయనే ఇస్తున్నాడు. నిజానికి నేనేమీ కాను. నేను ఒక పనిముట్టును. నా రూపం ద్వారా ఈశ్వరుడు ఏమి చేయదలచుకున్నాడో అవి చేస్తున్నాడు. అందుకే నేనేమైనా చేస్తున్నానంటే బహుశా ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడని అనుకుంటాను'' విలేకరి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా అన్న మాటలివి. జ్ఞానం మనిషి పుట్టుక పరిణామాన్నీ శాస్త్రీయంగా నిర్దారించినప్పటికీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలీ. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే పిచ్చి ముదిరి పాకాన పడింది అనుకుంటాం. శాస్త్రీయంగా ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి వ్యాఖాలు చేయరు, మతోన్మాదులు మాత్రమే ఇలాంటి చేస్తారు. మరి నరేంద్ర మోడీని ఏమనాలి?
నరేంద్ర మోడీ ద్వారా దేశం లౌకికవాదం వర్థిలుతుందా? దేవుడి పరిపాలనలోని వారు భౌతికవాదం, శాస్త్ర, సాంకేతికను ఎలా ముందుకు తీసుకుపోతారు. దేశం వెలిగిపోతుంది నుండి దేవుడి పాలన మారింది. ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని సరియైన మార్గంలో నడిపిస్తాడని భౌతికవాదులు, శాస్త్రీయంగా సాంకేతికను ఎలా ముందుకు నడిపిస్తారు? దేశంలో నూతన విద్యావిధానం నరేంద్ర మోడీ అందుకే ప్రవేశపెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాల నుండి సాంకేతిక విద్యా సంస్థలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు. దేవుడే మార్చాలా? ప్రభుత్వం నిధులు కేటాయించి, విద్యార్థుల కనీస అవసరాలు తీరుస్తుందా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది.
ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల భారం మోయలేక పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటీవల కాలంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు పంపలేని దుస్థితి నేలకోల్పారు. పేదలను విద్యాకు దూరం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రపంచంలో భారతదేశం ఏవిధంగా వెలిగిపోతుందో సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ, సాంకేతికత, శాస్త్రీయత ముందుకు తీసుకెళ్లడంలో తీసుకుంటున్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలి.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తమ విధానాలను మరింతగా అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించలేని స్థితికి తీసుకువస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ఎంతగా వెలిగిపోతుందనేది విద్య, సాంకేతికత, మరియు సమాన అవకాశాల కల్పనపై ఆధారపడి ఉంటుంది.
బాధ్యతారాహిత్యం
రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఏప్రిల్ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలు పార్టీలు, అనేక ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు, మేధావులు కూడా ఆ మాటల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. చిన్నస్థాయి నాయకులు స్థాయికి దిగజారి సాక్షాత్తూ నరేంద్రీమోదీయే ఇంతటి తీవ్రంగా మాట్లాడడం ఆయన అభిమానులకు, బీజేపీ శ్రేణులకు కూడా జీర్ణం కావడం లేదు. దేశానికి, భారత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఇట్లా మాట్లాడి, తమ గౌరవాన్ని తగ్గించుకోవడం, దేశప్రతిష్ఠను దిగజార్చడం అన్యాయమని మేధావులు, పౌరసమాజం ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అది సంపదనంతా ముస్లిములకు పంచిపెడుతుందని మోదీ అన్నారు. పిల్లలెక్కువగా కనేవాళ్ళు, చొరబాటుదార్లు, అని కూడా ముస్లింలను దష్టిలో పెట్టుకుని మోదీ వ్యాఖ్యానించారు. సంపదను ముస్లింలకు పంచిపెట్టడమనే వాదనకు మూలం, ప్రస్తుత ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్నదేమో అనుకుంటే పొరపాటు. ఎప్పుడో పద్ధెనిమిది సంవత్సరాల కిందట అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయాభివద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యలను విచిత్రంగా అన్వయించి, మోదీ తన వాదనకు ఉపయోగించుకున్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, మైనారిటీలు, స్త్రీలు, పిల్లలు, ఈ శ్రేణుల అభివద్ధి కోసం చేయవలసిన ప్రణాళికారచన గురించి, మౌలికసదుపాయాల కల్పన గురించి ప్రస్తావిస్తూ, మన్మోహన్ సింగ్, అభివద్ధి ఫలాలలో మైనారిటీలు న్యాయమైన భాగం పొందడానికి సజనాత్మకంగా పథకరచన చేయాలని అన్నారు. వనరులను ప్రాధాన్య ప్రాతిపదికన పొందే హక్కు వారికి ఉండాలని కూడా అన్నారు. ఆ మాటలనే ఇప్పుడు తన తీవ్ర వ్యాఖ్యలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారు. మన్మోహన్ మాటలకూ, మోదీ వ్యాఖ్యానానికీ ఏమైనా పొంతన ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది. తరువాత రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర ఉన్న ఆస్తులను, బంగారాన్ని, నగలను ఆ పార్టీ లాగేసుకుంటుందని, దానిది మావోయిస్టు తరహా అని స్త్రీలను భయభ్రాంతులను చేసే విధంగా నిందించారు.
సమాజంలోని ఒక వర్గం మీద తక్కిన ప్రజలకు ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచే వ్యాఖ్యలను ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. ఎన్నికలప్రచారంలో భాగంగా అసలే చేయకూడదు. ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్ 123(3), 123(3ఎ) ప్రకారం మతం, జాతి, కులం, భాష తదితర ప్రాతిపదికలమీద ఓటు వేయమని కానీ, వేయవద్దని కానీ చెప్పడం నేరం, పౌరులలో ద్వేషభావాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం శిక్షార్హం. నేరం నిరూపణ జరిగితే, ఎన్నికలలో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించే నమూనా ప్రవర్తనా నియమావళి ప్రకారం కూడా, ప్రజలలో ఇప్పటికే ఉన్న వైషమ్యాలను పెంచడం కానీ, కొత్తవి కల్పించడం కానీ అనైతికం. చట్టాన్ని, నియమావళిని కూడా ఉల్లంఘించిన ఆరోపణలను స్వయంగా ప్రధానమంత్రి ఎదుర్కొనవలసిరావడం విచారకరం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎన్నికల సంఘం స్పందన కర్తవ్యనిష్ఠకు తగినట్టుగా కనిపించడం లేదు. మునుముందు ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. దేశవ్యాప్తంగా ఈ వివాదం మీద వ్యక్తమవుతున్న ఆందోళనను గమనిస్తే, న్యాయవ్యవస్థ కూడా కల్పించుకోవలసిన పరిస్థితి రావచ్చుననిపిస్తుంది.
మొదటి దశ పోలింగ్ తీరు నిరాశ కలిగించిందా? మొత్తంగా ఉత్తరాదిలో, ప్రజాస్పందన గత ఎన్నికలకు భిన్నంగా కనిపించిందా? ఓటింగ్ శాతాలు తక్కువగా ఉండడం బీజేపీకి అనుకూల సంకేతాలా? అనుకూల ఓటర్ల నిరాసక్తతా? ఈ ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. నిన్నటి దాకా 400 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడినవారు, ఇప్పుడు అకస్మాత్తుగా అంచనాలలో ఏమి మార్పు వచ్చింది? ఒకవేళ, కొంత ఎదురుగాలి వీస్తున్నట్టు అనిపించినా, భయాందోళనలతో చివరి నిమిషంలో బాధ్యతారహితమైన ప్రచారాలకు ఒడిగట్టడం, పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ స్థాయికి తగినది కాదు.
బాధ్యాతారాహిత్యం
ఓటు హక్కే మన భవిష్యత్
ఓటు హక్కు - ప్రాధాన్యత
ఓటు విలువ తెలుసుకోండి
నేతల భావ దారిద్య్రం.. ఓటర్ల ఉదాసీనత
ప్రస్తుత ఎన్నికల వార్
భారత కార్మిక నాయకుడు అంబేడ్కర్ - మేడే స్పెషల్
మేడే నా ప్రియకాల స్వప్నమా! వర్థిల్లు
సరైన ప్లాన్‌తో... లక్ష్యం వైపు అడుగులు
ఇదో నిప్పుల వర్షం...
అభివృద్ధి వెనక అసమానతల కూపం
మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?
మనకు విజ్ఞానం ఉన్నట్టా?
పరాన్నజీవి
కవర్ పేజీ - భారతదేశ ఎన్నికల చిత్రపఠం
ప్రజల ఆక్రందన - సంపాదకీయం
మోగింది ఎన్నికల భేరి - కవర్‌స్టోరీ
బాబాసాహెబ్ అంబేడ్కర్ - కవిత
భారత్ వికసిస్తోంది..? ఏదీ, ఎక్కడీ
అప్పుల ఊబిలో దేశం
దళితశక్తి ప్రతినిధిపై దాడి
చదువులు విలువలు నేర్పాలి
ఒక్క శాతం మంది చేతిలో 40శాతం సంపద
కాలయాపనకు చెల్లుచీటీ మధ్యమర్తిత్వం
నిరుద్యోగం రూపుమపడం... సాధ్యమా?
దేశంలో పేదరికం తుగ్గుతుందంటా...?
పరాన్నజీవి
మనస్సును శుద్ధిచేయు ధర్మం
సామాన్యుల పొట్టనిండితే ఎంత? నిండకపోతే ఎంత? భజనలు చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుందంటూ మోడీ మందిరాలు ప్రారంభిస్తూ, ప్రవచనాలు వల్లిస్తూ, కాలయాపన చేస్తున్నారేతప్ప ప్రజల బాధలను ముఖ్యంగా అన్నదాతల ఆక్రందనలను చల్లార్చే తరుణోపాయాలను అన్వేషించడం లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగ నియమాకాల విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. అదేవిధంగా దేశంలో నిరుపేదలు అత్యంత నిరుపేదలుగానే, పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులుగా తయారు అవుతున్నారు. ''చిత్తశుద్ధిలేని శివపూజలేలా..'' అన్నట్టు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనే లేకుండా చర్చలు జరిపే మొక్కుబడి కార్యక్రమంగా అది మారిపోతే ఫలితం శూన్యమే కదా.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. మూడవసారి అధికారం కోసం మోదీ నేతృత్వంలో బిజెపి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 'ఇండియా' కూటమి పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఈ ఎన్నికలల్లో గెలవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మూడవసారి అధికారం కోసం బిజెపి వివిధ రాజకీయ పార్టీలను తన దారి తెంచుకోవడానికి సిబిఐ, ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు దేశ భవిష్యత్‌ను మారుస్తాయా? సామాన్య ప్రజలకు న్యాయం దక్కుందా? మనం వేచి చూడాల్సిందే...
జూలియన్ అసాంజే, ఎడ్వార్డ్ స్నోడెన్ వంటి సామాజ్య్రవాద దాష్టీకానికి బలౌతున్న స్థితి నేడు మనం చూస్తున్నాం. అయినా గన్నులకు పెన్నులు వణకవని, వెనక్కి తగ్గవని రుజువవుతూనే ఉంది. రుజువు చేయడమే జర్నలిస్టు కర్తవ్యం. కర్తవ్య నిర్వహాణలో కలంవీరులపై జరిగిన/జరుగుతున్న భౌతిక దాడుల వెనుక అధికారం ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే, అయినా అధికార పక్షంలో ఉన్నప్పుడు దాడులు, అధికారం చేజారిన వెంబటే సానుభూతి ప్రయత్నాలు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొనసాగుతున్నది. 'యుద్ధ రంగంలో నిలబడి/ కవిత్వం రాయడం గొప్ప ఆనందా న్నిస్తుంది' అంటాడో కవి. నిరంకుశత్వం పెరిగేకొద్దీ జర్నలిస్టు కలం, కెమెరా కూడా తన వాడి పెంచుతుందే తప్ప వెనక్కి తగ్గదు.
సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ చెప్పినట్లు సులభతర న్యాయం దేశప్రజల హక్కు. వాస్తవంలో దానికి సరైన మన్నన దక్కుతోందా అంటే, లేదన్నదే కొన్నేళ్లుగా జవాబు. సుప్రీంకోర్టులోనే పెండింగ్ కేసుల సంఖ్య 80వేలకు పైబడి ఉన్నావు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో దాదాపు 50 లక్షలు, జిల్లా, తాలూకా కోర్టుల్లోనైతే సుమారు 4.3కోట్లకు చేరింది. గత రెండున్నర దశాబ్దాల తరువాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మధ్యవర్తిత్వ చట్టం, భవిష్యత్తులో చేపట్టనున్న ఇంకొన్ని చర్యల ద్వారా కోర్టులపై పనిభారం తగ్గుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వెలి బుచ్చుతున్నా- దేశ వ్యాప్తంగా అసంఖ్యాక కక్షిదారులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. దిగువస్థాయి న్యాయస్థానాల్లోనే 30 ఏళ్లకు పైబడి మోక్షానికి నోచని వ్యాజ్యాలు లక్షకు మించిపోయాయి. సంస్కరణలు ఖాళీల భర్తీ, మౌలిక వసతుల పరికల్పనతో మొదలై డిజిటలీకరణతో ఊపందుకోవాలి. వాయిదాల సంస్కతిని దుంపనాశనం చేయాలన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సూచన సహర్షంగా స్వాగతించదగినది. సరళమైన ప్రాంతీయ భాషలో తీర్పులివ్వాలి. జిల్లాస్థాయి వరకు అన్ని కోర్టుల్లోనూ జనం భాషలోనే కార్యకలాపాలు సాగించాలన్న ప్రతిపాదనలకూ సత్వరం దక్కుతుంది. తీర్పులివ్వడంలో జడ్జీలకు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనుంచి స్వేఛ్ఛ లభిస్తే కక్షిదారుల్లో న్యాయస్థానాల పట్ల నమ్మకం ఇనుమడిస్తుంది. రాజ్యాంగ విలువల గీటురాయిపై శాసనాల చెల్లుబాటును తీర్మానించే సుప్రీంకోర్టు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశీద్దాం.
దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళితశక్తి ఎడిటర్ బి.గంగాధర్, ఆంధ్రప్రదేశ్ సబ్ఎడిటర్స్ నీలం పుల్లయ్య, కళింగ లక్ష్మణరావు, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్ ప్రకాశం జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. పెత్తందార్లు యామర్తి అంజనేయులుపై చేసిన దాడిని దళిత, ప్రజాసంఘాలు, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులు ఖండించారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు.
దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు మాట్లాడుతూ ప్రకాశం ఎస్పీతో నివేదిక తెప్పించి నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం శిక్షించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, కెవిపిఎస్ అధ్యక్షులు అండ్ర మాల్యాద్రి, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్, బిఎస్పి నాయకులు పెగ్గం ప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు మర్రి సోహన్‌లాల్, లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మంద ప్రసాద్, ఆహా రాష్ట్ర అధ్యక్షులు మెండం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో అధికారం మార్పు?
బర్రెలక్క (శిరీష) తెగువతో... ప్రజాస్వామ్యంలో నూతనాధ్యాయం
మనుసాహిత్యాన్ని చీల్చి చెండాడిన.. ప్రపంచ సాహితీవేత్త బాబాసాహెబ్
అసమానతలు తొలగినప్పుడే... అసలైన అభివృద్ధి
అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన... సంక్షేమం ప్రజల హక్కుగా మారాలి
కులగణనతో అసమానతలపై కొత్త పోరు
భ్రమలో బతుకుతున్న మనిషి
వైద్యం... అందరికీ దక్కని భాగ్యం
ఉద్యమకారుడి పాలనలో...ఆకాంక్షలు-అణచివేతతో గాడి తప్పిన పాలన
కొత్త చట్టాలు.. కొత్త సమస్యలు
అఖిల భారత న్యాయసేవ అవసరం
ఈ మట్టిని గౌరవిద్దాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మూడవసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,26,18,205 మంది ఓటర్లలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల వారిగా అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ 119, బిజెపి 111, బిఎస్పీ 107, ఎంఐఎం 9, సిపియం 19, జనసేన 8, సిపిఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఏమ్మెల్సీలతోపాటు 1,779 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, 1 ట్రాన్స్‌జెండర్ ఈ ఎన్నికల బరిలో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో దివ్యాంగుల కోసం 120, మహిళల కోసం 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644 ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638, భద్రాచలం నియోజకవర్గంలో అతితక్కువగా 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలను, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ుదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేసింది. దాదాపు 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రింయను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షింస్తుంది. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉంగా భద్రాచలంలో 1,48,713 మంది మాత్రమే ఉన్నారు. ఎబ్బీనగర్ నియోజనవర్గంలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు, బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో అతితక్కువగా ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 నియోజకవర్గాల్లో రెండు, 10 నియోజకవర్గాల్లో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్స్ వినియోగిస్తున్నారు.
ముచ్చటగా మూడో ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడ్డాక హౌరాహౌరీగా సాగుతున్న తొలి త్రిముఖ పోరులో అధికార భారాసకు విపక్ష కాంగ్రెస్, భాజపాలు తీవ్ర పోటీనిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఐదురాష్ట్రాల అసెంబ్లీల సమరాంగణంలో ఇదే చివరి పోరు...! రాష్ట్రం సాధించి, తొమ్మిదిన్నరేళ్లుగా ఎంతో అభివద్ధి చేశామంటున్న అధికార పార్టీ ఒకవైపు, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, ఒక్కసారి ఆదరించాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ మరోవైపు, డబుల్ ఇంజిన్ సర్కారుకు మద్దతివ్వాలంటున్న కేంద్రంలోని అధికార పార్టీ ఇంకోవైపు. ఇలా ద్విముఖ, త్రిముఖ పోటీలో తమ తీర్పును ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేస్తున్న రోజు ఇది. చైతన్యానికి మారుపేరుగా నిల్చిన తెలంగాణ ఓటర్లు ఉన్న ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? మార్పును కోరుకుంటారా? లేక త్రిశంకును తీర్మానిస్తారా? ... ఫలితం ఏదైనా ఆదివారం దాకా వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఓటున్న ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి కాలు కదిల్చి... ఈవీఎంలపై వేలు మీటే విద్యుక్త ధర్మం నెరవేర్చాల్సిందే! మరి పదండి పోలింగ్‌కు...
అసెంబ్లీ నియోజకవర్గాలు
జాతి తరరాతను మార్చేది.. ఓటు
ఆత్మగౌరవ పాలన ఎక్కడీ
నీవే లేకుంటే...
ఎన్నికల సందడి
ఓటరు... తస్మాత్ జాగ్రత్త
భయంకరంగా నిరుద్యోగ సమస్య
కులగణన సామాజిక అవసరం
మనిషి చుట్టూ ముసురుకుంటున్న అజ్ఞానం
బౌద్ధ తాత్విక పత్రం
ఊరికొకరు కావాలి
దేశ ప్రగతికి విఘాతం
ప్రజల ఆరోగ్యం ఏమయ్యేట్టు?
వారు గొప్పోళ్ళు...
నవంబర్ 2023 l సంపాదకీయం
ఓటుహక్కుపై దేశవ్యాప్తంగా యువజనులకు సరైన అవగాహన ఉండటం లేదు. 'పద్దెనిమిదేళ్లు వచ్చాక మారుతున్నవారిలో ప్రజాస్వామ్య చైతన్యం పెద్దగా కనపడటం ఎందుకు ఓటేయాలి? ఎవరికి ఓటేయాలి? వంటి విషయాల్లో వారు మానసికంగా సిద్ధం కావడం లేదు' అన్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవకుమార్ తాజా వ్యాఖ్యలు అక్షరసత్యాలు. అర్హులు అందరికీ ఓటుహక్కు కల్పించి, వారిని పోలింగు కేంద్రాలకు రప్పించడంలో ఈసీ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటు విలువను విద్యార్థులకు తెలియజెప్పేందుకు తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామ్య పాఠాల బోధనకు సంసిద్ధమవుతున్నట్లు సీఈసీ ప్రకటించారు. అది యధారీతిన మూసపద్ధతిలోనే చెబితే ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర ఏమిటో నవతరానికి బోధపడదు. మంచివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం- చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందన్నది. మాజీ సీఈసీ శేషన్ హెచ్చరిక. భావితరానికి అది అవగతమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలి. నిర్దేశిత వయసులో ఓటర్లుగా నమోదు కావడం, ఓటుహక్కును విచక్షణాయుతంగా వినియోగించుకోవడం... ఇలా అన్ని అంశాలనూ ఆసక్తికర శైలిలో విద్యార్థులకు విడమరచాలి. అప్పుడే ఎన్నికల సంఘం ఆకాంక్ష వాస్తవ రూపం దాలుస్తుంది.
లోక్‌సభకు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు (1951-52 దేశీయంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. 2023 ఫిబ్రవరి నాటికి అది 94.50కోట్లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనాభాకు తగినట్లు కాలక్రమంలో ఓటర్లు అధికమైనా, పోలింగ్ శాతంలో పెరుగుదల మాత్రం మరీ ఎక్కువగా ఏమీలేదు. తొలి సార్వత్రిక సమరంలో 45.67శాతం ఓటింగ్ జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అది 67.40శాతంగా లెక్కతేలింది. ఈసీ పరిశీలన ప్రకారమే- అర్హులైన వారిలో 30కోట్ల మంది ముఖ్యంగా పట్టణ ప్రాంతీయులు, యువత, వలస కార్మికులు గత సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. పొట్ట చేతపట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళ్ళే శ్రమజీవుల హక్కులను పరిరక్షించడంలో వ్యవస్థాగత వైఫల్యాలు ఒకపక్క వెక్కిరిస్తున్నాయి. మరోవైపు ఉన్నత విద్యావంతులు, అధికాదాయ వర్గాల నిరాసక్తత కారణంగా నగరాల్లో పోలింగ్ శాతాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అవగాహన రాహిత్యంతో పాటు తామొక్కరం ఓటు వేయకపోతే కొంపలేమి మునిగిపోతాయన్న అలక్ష్యంతో పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని యువతీయువకులూ గణనీయంగానే ఉంటున్నారు. అవతలి వ్యక్తుల కంటే ఒక్క ఓటు అదనంగా పొందగలిగితే చాలు, వారినే విజేతలుగా నెత్తిన పెట్టుకునే ఎన్నికల వ్యవస్థ మనది. కాబట్టి ఓటింగ్‌కు ఏ కొందరు గైర్హాజరైనా అభ్యర్థుల జాతకాలే తలకిందులవుతాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హెచ్చరించినట్లు, ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు అజ్ఞానం- మిగిలిన వారందరి భద్రతనూ ప్రమాదంలో పడేస్తుంది. యువత దీన్ని అర్ధం చేసుకోవాలి. తమ భవితను తామే నిర్దేశించుకోవాలంటే ప్రజాస్వామ్య యజ్ఞంలో వారు పాలుపంచుకుని తీరాలి. వెగటు పుట్టిస్తున్న ధన, రౌడీ రాజకీయాలతో పరువుమాస్తున్న ఎన్నికల ప్రక్రియను ఏవగించుకునే వారూ లేకపోలేదు. జనాన్ని ముందుండి నడిపించిన జాతినేతల దేశభక్తే భారతావనికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టింది. అదేవిధంగా అవినీతి అక్రమాల చెరలోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించగలిగే ప్రజా ఉద్యమానికి యువతే నేడెందుకు నేతత్వం వహించకూడదు? ప్రజాసంక్షేమానికి పాటుపడని నేతలను నిగ్గదీయడమే కాదు. అటువంటి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే శక్తిని తమకు సమకూర్చేది ఓటుహక్కేనని యువత గుర్తించాలి. దేశం తలరాతను మార్చిరాసే విధాతలుగా వారు అవతరించాలి?
నీవే గనుక లేకుంటే
మా బతుకులు ఇప్పటికీ
తెల్లారేవే కావు!
మూతికి ముంత, ముడ్డికి ఆకు
అలానే వ్రేళ్ళాడుతుండేవి!
తలలు పంకించి, చేతులు ముడుచుకుని
దిక్కులు వెతుక్కుంటూ ఉండేవాళ్ళం!
ఇప్పటికి కొంకొణ ప్రాంత రైతులు
బిత్తర బిత్తరగా బ్రతికే వారు!
కార్మికులు యంత్ర బాహువులకి చిక్కి
నలిగి బూడిదయ్యేవారు!
ఓటు మొగమే చూసే వారం కాదు.
బడి గడప తొక్కేవాళ్ళమే కాదు!
నీవే గనుక లేకుంటే
గుక్కెడు నీళ్ళ కోసం
అలమటించాల్సి వచ్చేది!
గుప్పెడు మెతుకుల కోసం
అల్లాడాల్సి వచ్చేది!
మహద్ సత్యాగ్రహం చేసి
మా బతుకుల్లో వెలుగు పంచావు!
మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టి
మాలో ఆత్మ విశ్వాసం నింపావు!
నీవే గనుక లేకుంటే
దేవాలయాల గడప తొక్కనిచ్చేవారే కాదు!
పతనార్ల జీవితాల్లో
సంతోషం వెల్లువిరిసేదే కాదు!
శ్రామికుల బతుకుల్లో
నవ్వులు విరబూసేవే కాదు!
నీవే గనుక లేకుంటే
ఈ దేశానికి రాజ్యాంగం
ఎవరు రాయగలిగేవారు?
అంత పెద్ద బాధ్యతను
ఎవరు తలకెత్తుకొనగలిగేవారు
ఈ దేశంలో బౌద్ధాన్ని
ఎవరు పునరుద్ధరించగలిగే వారు?
నీవు పుట్టి ఉండకపోతే
నిమ్నజాతుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేది
అస్పశ్యుల వెతలు
ఆరని కాష్టంలా రగులుతూ ఉండేవి!
దళిత బాంధవా! బాబాసాహెబా!
నీ నుంచి స్వాభిమానం అబ్బింది
నీ నుంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నాం!
ధైర్యస్థైర్యాలను, ఆత్మ విశ్వాసాన్ని
నీ నుంచే చేజిక్కించుకున్నాం!!
అసలు నువ్వు లేకుండా ఉంటే?
ఈ ప్రశ్న అవసరం లేదు!
నువ్వు మా కోసం పుట్టావ్!
నీ జన్మ యుగధర్మానిధి!
నువ్వు మా యుగపురుషుడివి!
నువ్వు కారణజన్ముడివి!!
-డా|| గూటం స్వామి