WELCOME TO THE WEBSITE OF
WELCOME TO THE WEBSITE OF
తెలంగాణ రాష్ట్ర శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులకు నమస్కరిస్తూ
మూర్తి త్రయ భక్తుల ఆత్మీయ ఆకాంక్ష మేరకు, “రామకృష్ణ – వివేకానంద భావప్రచార పరిషత్, తెలంగాణ – ఆంధ్ర సంయుక్త భక్త సమ్మేళనం” ఈ సంవత్సరం అనంతపురంలో నవంబర్ 28, 29, 30 (శుక్రవారం, శనివారం, ఆదివారం) తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది.
ఈ మహోత్సవ సందర్భంలో “రామకృష్ణ గురుదేవుల విశ్వజనీన దేవాలయ ప్రారంభోత్సవం” కూడా అత్యంత భక్తి, శ్రద్ధ, ఉత్సాహములతో జరుపబడును.
ఈ భక్త సమ్మేళనంలో రామకృష్ణ మిషన్ యొక్క వరిష్ట స్వామీజీలు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహం అందించనున్నారు.
కావున మన తెలంగాణ ప్రాంతంలోని ప్రతి సమితి నుండి కనీసం 20 మంది భక్తులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నించవలసినదిగా కోరుచున్నాము.
అలాగే ఈ సంయుక్త భక్త సమ్మేళన విజయవంతమైన నిర్వహణకై ప్రతి సమితి తమ వంతు విరాళమును సమర్పించవలసిందిగా సాదరముగా ప్రార్థన.
హైదరాబాద్ నుండి వందమంది భక్తులు ఇప్పటికే తమ రైల్ రిజర్వేషన్ అనంతపురానికి చేసుకోవడమైనది
ఇట్లు,
కన్వీనర్
దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ
9440708907