My తెలుగు Poems

వదిన:

మా ఇంటికొచ్చింది ఓ మల్లెపువ్వు,

ఘుమఘుమలు తెచ్చింది నీ చిరునవ్వు,

లోపాల్ని ఎంచకు ఏనాడు నువ్వు,

మరెన్నటికీ ఉండాలిలా మా అందరి లవ్వు.

అన్నయ్య (పెళ్ళి రోజు):

ఎరుగుదువా కల్యాణ మర్మములను,

చదివితివా వాత్సాయన సూత్రములను,

చేసెదవా పూల నాట్యములను,

ఇచ్చెదవా భారత రత్నములను.

నాన్న:

శాంతమూర్తి, మహా తపస్వి,

విఙ్ఞానమూర్తి, ఙ్ఞాన పిపాసి,

సాక్షాత్ విష్నుమూర్తి, తేజస్వి,

సిరులెంచనిమూర్తి, యశస్వి.

కవిత:

కవితా ఓ కవితా, హితాహిత మార్గదర్శికా

కవితా ఓ కవితా, మానవ చరిత సంపుటికగా 

కవితా ఓ కవితా, మార్గము చూపు గురువుగా

కవితా ఓ కవితా, ఒంటరితనపు తోడుగా

కవితా ఓ కవితా, మది సోయగాల పాటగా 

కవితా ఓ కవితా, శ్రుంగార గీతికా

కవితా ఓ కవితా, కడవరకూ తోడుగా 

కవితా ఓ కవితా, అమరముగా నీ చరిత