అభ్యాస వేదికకు స్వాగతం!


         ఈ అభ్యాస వేదిక పూర్తిగా SCERT తెలంగాణ సిలబస్ ఆధారంగా రూపొందించబడుతుంది . ముఖ్యంగా  అన్ని subjects ఉపాధ్యాయులకు ఒక సమర్థవంతమైన బోధనా ఉపకరణంగా (Teaching Tool) ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దాలన్న ఆశయం తో రూపొందించడం జరుగుతుంది.

                 ఈ వేదికలో, గణిత కృత్యాలకు అనువైన మ్యాథ్స్ AI మోడల్స్ ఎప్పటికప్పుడు నవీకరించబడతాయి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అవసరమైన గణిత కృత్యాల మోడల్స్‌ దశలవారీగా జోడించబడును. ప్రత్యేకించి, 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభ్యాస దీపికలోని అన్ని subjects అధ్యాయాల ప్రశ్నలకు ఇక్కడ క్రమ క్రమంగా సమాధానాలు  అందించబడతాయి.

గణితంతో పాటు, త్వరలో సాంఘిక శాస్త్రం (Social Studies) మరియు భౌతిక శాస్త్రం (Physical Science), జీవ శాస్త్రం విద్యార్థులకు ఉపయోగపడే వీలైనన్ని మోడల్స్‌ను కూడా అభివృద్ధి చేయబడును.

"గణిత వేదిక" అనే ఉప శీర్షికలో 6 నుండి 10వ తరగతి వరకు అభ్యసన ఫలితాలు (Learning Outcomes) పొందుపరచబడతాయి. అంతేకాక, గణితంలోని వివిధ భాగాలు మరియు ఉప భాగాలలో విద్యార్థులు ఎదుర్కొనే సాధారణ ఇబ్బందులు (Common Difficulties), వాటిని అధిగమించడానికి అవసరమైన సమర్థవంతమైన బోధనా పద్ధతులు (Effective Teaching Strategies) కూడా ఇక్కడ చర్చించబడతాయి. 

ఈ వేదికలోని "ఇతరాలు" (Others) విభాగంలో  విద్యార్థులను ప్రభావితం చేయడానికి రచించిన కథలు, కవితలు, వ్యాసాలు  ఉంటాయి. 

"Websites for Teachers" విభాగంలో ఉపాధ్యాయులకు బోధనలో ఉపయోగపడే ముఖ్యమైన వెబ్‌సైట్ లింకులు అందుబాటులో ఉంటాయి.


          ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులం కోసం  "అభ్యాస దీపికలు " అన్ని subjects కొరకు   English & తెలుగు మీడియం మెటీరియల్ అందించే ప్రయత్నం జరుగుతుంది.