సందేహం:
A) ప్రసూతి(Maternity Leave)లో ఉండే వారికి సెలవు జీతం వీధుల్లో చేరిన తరువాత ఇస్తారా?ప్రతినెలా ఇవ్వవచ్చునా?
🌹సందేహం:
B) ఒక ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవు వాడుకున్న తరువాత ఏప్రిల్-16 న విధుల్లో చేరింది?ఆఁ క్యాలెండర్ సం!!లో ఎన్ని CLs వాడుకోవచ్చు?
సమాధానం:
A)ఫండమెంటల్ రూల్ 74(a) సబ్ రూల్ 32 లో ఇలా వుంది."Leave salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా సెలవు జీతం చెల్లించవచ్చు.
🌹సమాధానం:
B)ఈ విషయంలో నైష్పత్తికంగా వాడుకోవాలని ఎక్కడా లేదు.అందుచేత సరైన కారణాలతో అన్ని CLs వాడుకోవచ్చు.
****************************************************************************************************************************************
సందేహం:
వేసవి సెలవులలో ఇతర పనులు చేసినందుకు సంపాదిత సెలవులను ఏ పద్దతిలో జమచేస్తారు.దీనికి ప్రాతిపదిక ఏమిటి?
✳సమాధానం:
🔆G.O.Ms.No.151 తేది:14-11-2000
🔆G.O.Ms.No.174 తేది:19-12-2000
🔆G.O.Ms.No.114 తేది:28-4-2005
🔆C&DSE Rc.No.362/E1-1/2013 తేది:16-11-2013
🔆FR-82(b) కి అనుగుణంగా
(365 x1/11)-27వెకేషన్ వాడుకున్న రోజులు/మొత్తం వెకేషన్ రోజులు-6)
అనే పద్దతి ద్వారా లెక్కించి అదనపు సెలవులు జమచేస్తారు.అయితే వేసవి సెలవులలో పనిచేసినందుకు ఎటువంటి అదనపు TA/DA/ రెమ్యూనరేషన్ చెల్లించబడి ఉండకూడదు. ఆ సంవత్సరానికి అన్నీ కలిపి మొత్తం సంపాదిత సెలవులు 30కి మించరాదు. ముందుగా కాంపిటెంట్ ఆధారిటీ వేసవి సెలవులలో ఫలనా పని చేయాలని ఉత్తర్వులు జారీ చేసియుండాలి. ఎన్నికల విషయంలో మాత్రం ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు జమచేయండని ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తారు. ఎన్నికలలో TA/DA/రెమ్యూనరేషన్ చెల్లించబడినప్పటికీ అదనపు సెలవులు జమఅవుతాయి. మిగిలిన అన్ని సందర్భాలలోనూ దామాషా పద్దతిలోనే జమఅవుతాయి.
****************************************************************************************************************************************
సందేహం:
ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?
🌈సమాధానం:
వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ Cir.Memo.No.10445/
ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)
**********************************************************************************************************************************
👁🗨 సందేహం:
దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?
🃏సమాధానం:
FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
****************************************************************************************************************************************
🏖సందేహం:
లోకల్ బాడీ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు 'ఫారెస్ట్ డిపార్టుమెంటులో' ఆఫీసర్ గా ఎంపిక కాబడ్డాడు.కొత్తపోస్ట్ కనిష్ట వేతనం ప్రస్తుత వేతనం కన్నా తక్కువగా ఉంది. నాకు వేతన రక్షణ (Pay Protection ) వర్తిస్తుందా?
🏝సమాధానం:
వేతన రక్షణ వర్తిస్తుంది. G.O.Ms.No.105 Fin(FR-II) Dept Dated:2-6-2011 ప్రకారం FR-22(a) (iv) ప్రయోజనాలు లోకల్ బాడీ ఉద్యోగులకు కూడా వర్తింపచేయబడ్డాయి.
****************************************************************************************************************************************
💠సందేహం:
ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?
💠సమాధానం:
ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.
👉�SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.
👉�SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.
💥పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.
****************************************************************************************************************************************
🌈సందేహం:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే ఎంత సర్వీసు పూర్తి చేసుండాలి.వివరాలు తెలుపగలరు?
🌷సమాధానం:
1980 రివైజ్డ్ పెన్షన్ రూల్ 43,సబ్ రూల్ 3 of FR-56 మరియు G.O.Ms.No.350, తేది:7-10-1991 ప్రకారం 20సం!! అర్హదాయక సర్వీసు తరువాత 3 నెలల ముందు నోటీసు అందజేసి స్వచ్ఛందoగా వాలంటరీ రిటైర్మెంట్ అనుమతి పొందవచ్చు.అయితే ఆరోగ్యంగా ఉన్నట్లు డ్యూటీ చేయుటకు అర్హత కలిగియున్నట్లు ఇద్దరు వైద్యులచే సర్టిఫికెట్ సమర్పించాలి.
****************************************************************************************************************************************