Villages in Jangaon Mandal
Jangaon
జనగాం
city
Location in Telangana, India
Jangaon
• Type
• Body
• MLA
• Member of Parliament
• Total
Elevation
• Total
• Rank
• Density
Jangaon is well connected with rail and road. National highway 165, and state highway 16 passes through the town. It is about 85 km from the state capital, Hyderabad, and 60 km from district headquarters Warangal city.
Jangaon Railway Station nameboard
Air : Nearest air port is Rajiv Gandhi International Airport, Shamshabad, which is about 90 km.
Rail : Jangaon train station is on Secunderabad Kazipet trunk route. Hence, the town is well connected with major cities in India. The station hosts frequent train service to Secunderabad and Kazipet and to other long distance running trains. A Local Train service From Falauknauma to Jangaon is running daily. The station has Reservation facility as well
.
Road : The state's bus service provider TSRTC holds a bus depot in Jangaon with 120+ buses. It hosts very frequent services to Hanamkonda, Hyderabad, Siddipet and Suryapet and other long distance services to Bangalore, Anantapur, Hubli, Vijayawada, Kodad, Karimnagar, Nizamabad, Mahabubnagar, Kurnool, Adilabad, Guntur, Khammam, Bhadrachalam , Basara , Mysore , Wanaparthy and many other places.
PLACES OF INTEREST:
Jeedikal: Jeedikal is a holy place where devotees worship Shri Ram, Laxman, Sitha and Hanuman. Devotees believe Shri Ram passed through Jeedikal in search of Golden Deer (Mareecha). Jeedikal Jatara is a biennial event. People from all over Telangana region visit this temple to attend the holy events.
Kolanupaka: Kolanupaka was the second capital of the Kalyani Chalukyas during the 11th Century AD. During this period the village was the center of the Jains as well as the Saivites. According to literary evidence, it is the birthplace of 'Renukacharya', the great 'Veera Saiva' saint, believed to be born from the 'Svayambaghu Linga' at this village and absorbed into it after preaching Veera Saivam. The place lost its glory after it changed hands from Chalukyas to Cholas and later to Kakatiyas. Besides the Jain temple, other temples at Kulpak are the Shree Veeranarayan temple, and the Shree Someshwara temple.
Pembarthi: Pembarthi, located 6 km from Jangaon, is world famous for brass artifacts. The craftsmen at Pembarthi follow the method of embossing on brass and copper sheets. All the buses going to Hyderabad pass through Pembarthi.
Komaravelli: Komaravelli is a holy place where devotees worship Komaravelli Mallanna Swamy. Komaravelli is situated a little less than 10 km from Siddipet while going from Hyderabad/Secundrabad. There is frequent bus service from Jangaon.
Yadagirigutta: Yadagirigutta is a popular Hindu temple of Narasimha Swamy situated on a hillock, located about 35 km from Jangaon. There is frequent bus service from Jangaon.
Shirdi Sai Mandir: Towards Hyderabad a well organized Sai mandir located at a peaceful place away from town. Constructed and maintaining by Sri Palakurthy Lakshmi Nrusimha Sharma Garu.
Champak Hills: Champak hills is good place to visit. Panoramic view of the picturesque green hills attracts visitors around this region. There is an Aurobindo ashram over one of the hills. The government is proposing an IT park here and it is in very initial stages.
Banapuram: It is a place in Jangaon with greenery and an old Hanuman temple, temple of Lord Venkateshwara and Ayyappa . At the time of Bathukamma festival ladies of Jangaon play bathukamma here .
Khilashapur: It is the capital of "Sardar Sarvay Papanna", who fought against Doras of the area. He built a fort in the village. Former DGP Pervaram Ramulu, his famous Telugu scholar brother Pervaram Jagannadham, and AP's Major Irrigation Minister Ponnala Laxmaiah are from this village.
Palakurthi: It is famous for its Shiva temple which is about 30 km from Jangaon
జనగామా చరిత్ర : జనగామా జిల్లా ఒక డిమాండ్
జనగామాకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది.ఇదొక పూచిన పాదు.ఆద్యాత్మిక పరిమళాలు వీస్తూనే ఉన్నై.విప్లవాత్మక భావాలకు పిల్ల మడి.తర తరాలుగా ప్రత్యేక సోయితో మెలుగుతున్నది. నాలుగు పట్టణాలకు,ఐదు రాష్ట్రాలకు ఇదే చౌరాస్తా.నిజానికిఈ బౌగోళిక ప్రాంతమే తెలంగాణాకు ఒక స్ట్రీట్ లైట్.జనగామా మొదట్లో నల్గొండ జిల్లాలో ఉన్నది.ఆ తరువాత వరంగల్ జిల్లాలో కలిపిండ్రు.ఈ రెండు జిల్లా కేంద్రాలకు బహు దూరమే.ఏం ఫాయిదా లేకుండ పోయింది.ఇప్పుడు సిద్దిపేటలో కలుపుతమని వార్తలు వెలువడుతున్నయి. శాస్త్రీయంగా జిల్లా విభజన జరపకపోతే జనగామా అస్తిత్వమే ప్రమాదములో పడుతుంది.ఈ సంకేతాలు జనగామా ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నది.ఇక్కడి సహజ సిద్ధ భొగోళిక,సామాజిక,ఆర్థిక,రాజకీయ వనరులు,ముఖ్యంగా ఇక్కడి మానవ జీవన వికాసము తెలంగాణకే ప్రత్యేకం.ఆ చరిత్రను తెలుసుకునే సందర్భం ఇవాల మన ముందున్నది.* జైనగాం..జనగామా పూర్వపు పేరు.
__________________________________
" పార్శ్వనాథ శిల్పకళా సిద్ధెంకిలో కొలువుండా
శివాలయపు తంతెలుగా శాసనాల నిడిగొండ
కల్లెం భైరాన్ పల్లి స్తంబాలా గుడి అండా
కొలనుపాక కేంద్రంగా జనగామా పెద్ద కొండా "
( జయహో జనగామా...ఆర్క్యూబ్)
అనే పాటలో తెలుస్తున్నది.జనగామా ప్రక్కనున్న నెల్లుట్ల ప్రస్తావన కొలనుపాక లోని
ఓ శాసనములో కనిపిస్తుంది.సిద్దెంకి,నిడిగొండ,కల్లెం మొదలైన చోట్ల చరిత్ర కెక్కని జైన
శాసనాలున్నాయి.అవి గనుక పరిష్కరించబడినట్లైతే కొత్త చరిత్ర వెలుగులోకి వస్తుంది.
* జనగామాలో కాకతీయ ప్రాభవం
___________________________
జనగామా నతవాడి రుద్రుడు అనే కాకతీయ సామంత రాజు ఏలుబడిలో ఉంది.గణపతి దేవుని సోదరి కుందమాంబ(కుందాంభిక)నిచ్చి పెండ్లి చేసినందుకు కాకతీయులకు కృతజ్ఞతగా , కుందవరము(కుందారం)లో ఒక చెరువును నిర్మించాడు. ఒక శాసనం వేయించాడు. గుట్టపై ఉన్న అనంత పద్మ నాబ దేవాలయం ఎంతో అపురూపమైనది.మన గత ప్రభుత్వం క్వారీకిచ్చింది.మన పురావస్తు శాక వారు కొన్ని విగ్రహాలను జిల్లా మ్యూజియంలో ఉంచారు. నిడిగొండలో 500ల స్థంబాల గుడి(త్రికూటాలయం) ని అద్భుత శిల్ప సంపదతో నిర్మించాడు. చూడ రెండు కళ్ళూ చాలవు.ఇప్పుడు చూస్తే ఎంతకూ దుక్కమాగదు.
* ఆది మానవునవులకు చిరునామా-మన జనగామ
_________________________________________
ఈ డివిజన్ లోని ప్రతొక్క ఊరు అంటే ప్రతీ ఒక్క ఊరూ అని.అతిశయోక్తి లేదని.అన్ని ఊళ్ళ లోనూ ఆది మానవుల ఆధారాలున్నాయి.కొన్ని జనగామాకే ప్రత్యేకమైనవి చూద్దాం.వరంగల్ జిల్లాలో ఉన్న ఏకైక రాళ్ళ తోట "కొడవటూర్(బచ్చన్నపేట)లో ఉంది.మధ్య శిలాయుగపు గుహా చిత్రాలు గోపరాజు పల్లి(జనగామ)లో ఉన్నై.పట్టణ జనగామాలోనే కప్ప్యూల్స్ తో ఏర్పడ్డ పిరమిడ్స్ ఉన్నయి.రాతి మంచం వలె కనిపించే అతి పెద్ద డాల్మెన్ సమాధి గబ్బెట(రఘునాథ్ పల్లి)లో ఉంది.మానవాకృత నిలువు రాళ్ళు,అత్యాధింక శిల్ప కళను పోలినట్టుగ ఉన్న త్రీ డైమెన్సన్ నిలువు రాళ్ళు వడ్లకొండ(జనగామ) లో ఉన్నయి.గోవర్ధనగిరి (రఘునాథ్ పల్లి)గుట్టపై రోళ్ళ మదిరె(అడుగడుగున ఉన్న రాతి గొడ్డళ్ళు నూరుకున్న గురుతులు)చరిత్ర ప్రేమికులు చూడ వలసిందే
అశ్వరావు పల్లి శివార్లలో ఉన్న బలపాల గుట్టపై ఆదిమానవుల గృహ సమాధులు మరీ విశేషంగా ఆకట్టుకుంటై . 10 ఆకులున్న బుద్దుని ధర్మ చక్రం వలె ఉన్న ముద్ర తో పాటు,సూక్మ రాతి పనిముట్లు కొన్నె(బచ్చన్న పేట)లో దొరికినయి.ఇనుప రాతి యుగం ఎంతగా విలసిల్లిందో తెలిపే శిక్కం రాళ్ళ దిబ్బ మాదారం(రఘునాథ్ పల్లి)ఉంది.నవీన శిలాయుగపు పొట్టేలు బొమ్మ(కళ్ళెం),ఏనుగు బొమ్మ(కొన్నె)రాతితో చేసిన ఎద్దు బొమ్మ(చిట కోడూరు),నాట్యం చేస్తున్న టెర్ర కోట స్త్రీ బొమ్మ (చిట కోడూఋ)లో లభించినయి. ..ఇలా ఎంతైనా చెప్పచ్చు.
* సాయుధ పోరాట చరిత్ర
" ఐలమ్మ కొమురయ్య గబ్బెట గోపాల రెడ్డి
ఆరుట్ల దంపతులా కథలు వింటూ లేవండి
ఏసిరెడ్డి,నరసిం హులు బెబ్బులోలే గర్జించగ
ఎనకమర్ల ఉరకలేదా రజాకార్లు తోక ముడిచి "
జనగామా పోరాటాలకు విశ్వ విద్యాలయం .ఇక్కడి నుంచే హైదరాబాద్ స్టేట్ తొట్ట తొలి కమ్యూనిస్ట్ గబ్బెట గోపాల రెడ్డి వచ్చిండు.మొదటి ఎన్ కొంటర్ గంగసాని తిర్మల్ రెడ్డి(గబ్బెట)పైనే జరిగింది.ఏసిరెడ్డి ఇక్కడి వాడే.ఆరుట్ల రామ చంద్రా రెడ్డి,కమలమ్మ దంపతులు(ఆలేరు) ; నల్లా నరసిమ్హులు వజ్రమ్మ దంపతులు (జనగామా) ఇక్కడివారే.వీర వనిత చాకలి ఐలమ్మ(పాలకుర్తి)అమరుడు దొడ్డి కొమురయ్య(కడివెండి) ముత్తడి బుచ్చిరెడ్డి,పెంటయ్యలు పట్టణ జనగామా వారే..షేక్ బందగి (కామారెడ్డి) దిక్కార స్వరం ఇంకా వినబడుతూనే ఉంటుంది.వీర బైరాన్ పల్లి,కడివెండి..ఇక్కడి ఊళ్ళకు ఊళ్ళే సాయుధ పోరాట చరిత్రలో అధ్యయాలు అధ్యయాలుగా చెప్పుకోవచ్చు.
* వీర వనితల పుట్టినిల్లు
_____________________________
స్త్రీల యుద్దానంతర విజయోత్సవ శిల్ప తోరణం గురిజకుంట(చేర్యాల)వాగొడ్డుకున్నది.అతి పొడవాటి స్త్రీ వీరగల్లు ఇదే.స్త్రీ ఆత్మాహుతి చేసుకుంటున్న అత్యంత అరుదైన వీరగల్లు వనపర్తి(లంగాల ఘణపురం) లో ఉన్నది.వీరి తరువాతే కాకతీయ రుద్రమదేవి.ఇక సాయుధ పోరాటములో చాకలి ఐలమ్మ,ఆరుట్ల కమలా దేవి,నల్ల వజ్రమ్మ లతో పాటుగా చరిత్రకెక్కని వారెందరో..* జనగామా జిల్లా కావలిసిందే ..అని ఎలా చెప్పగలం ?
____________________________________________
ఒకప్పుడు సమితి కేంద్రం.పాత తాలూకా కూడా.వరంగల్ జిల్లాలో రెండో పెద్ద మున్సిపాలిటి.
1 )రవాణా : 2 జాతీయ రహదారులు,బ్రిటిష్ కాలం లోనే ఉన్న రైల్వే లైన్ ఉన్నై. గూడ్స్ వ్యాగన్ పాయింట్ జనగామా రల్వే స్టేషనుకు ప్రత్యేకం.మధ్యప్రదేశ్,కర్నాటక,మహారాష్ట్ర,చత్తీస్ ఘడ్,ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలను కలిపుతాయివి.
2 )భూమి : కల్లెం లోనే 300 ఎకరాలు,చంపక్ హిల్ల్స్ లో సుమారుగా 1000 ఎకరాల భూమి ఉన్నది.
3 ) నీళ్ళు : చిటకోడూర్ ,తపాస్ పల్లి,అశ్వరావు పల్లి ల గుట్టలను కలుపుకొని నిర్మించబడ్డ సహజ సిద్ధ జలాశయాలున్నయి
4 )విద్యుత్తు : చమపక్ హిల్ల్స్ లో 400 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణములో ఉన్నది. వరంగల్ జిల్లాలో ఇంతకన్నా పెద్దది మరొకటి లేదు.
5 )విద్యా సంస్థలు : ఒక్క మెడికల్ కళాశాల తప్ప అన్నీ ఉన్నై.బ్రిటిష్ కాలం నుండే ఇక్కడ విద్యా సంస్థలు పురుడు పోసుకున్నయి.
6 )ఆసుపత్రులు : రెండు ప్రభుత్వ దవాఖానాలు(ఒకటి 100 పడకల ఆసుపత్రి),రక్తనిధి కేంద్రం
ఉన్నయి.మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
7 )ప్రభుత్వ కార్యాలయాలు : ఒక్క కలెక్టర్ కార్యాలయం తప్ప అన్ని కార్యాలయాలు నైజాం కాలం నించే ఉన్నాయి.వాటి స్థానములో ఆధునిక నిర్మాణాలు కూడా సిద్ధంగా ఉన్నాయి
8 ) దేవాలయాలు : కొమురవెళ్ళి,కొలనుపాక,జీడికల్ రామాలయం,పాలకుర్తి సోమన్న దేవాలయం,సిల్పూర్ దేవాలయం,కొడవటూర్ దేవాలయం,నిడిగొండ త్రికూటాలయం చుట్టూ దేవాలయలే..యాదగిరి గుట్టా మనకు సమీపమే.
9) పర్యాటక ప్రాంతాలు : ఇక్కడి గుట్టలన్నీ గొప్ప పర్యాటక ప్రాంతాలైతయి.రిజర్వార్లు మూడూ గుట్టల నడుమనే ఉన్నయి.ఆది మానవుల ఆవాసాలు ,నిలువురాళ్ళు ఈ గుట్టలల్లనే ఉన్నయి.గబ్బెట మంచం గుట్ట మనం పైన పేర్కొన్నం కదా.బతుకమ్మ కుంట (పట్టణ జనగామ)పార్క్ నిర్మాణములో ఉన్నది.
10 )రెవెన్యూ : ఆదాయములో ముందు వరుసలలోనే ఉన్నది.
11 ) వ్యాపార కేంద్రం : ఒకప్పుడు ఇటు సిద్దిపేట,అటు సూర్యాపేట,ఇటు స్టేషన్ ఘన్ పూర్ అటు భువనగిర దాకా ఏదైనా కొనాలన్న అమ్మాలన్నా జనగామాకే వచ్చేవారు.గతములో ఎంత ఉజ్జ్వలంగా వెలిగేదో ఈ ఉదాహరణలు చాలనుకుంటా.
12 ) చేతి వృత్తులు,కళా రంగాలు : పెంబర్తి బ్రాస్ వర్క్ కి,చేర్యాల నకాసి చిత్ర కలకు పేరెన్నిక గలవి.
13 ) మత సామరస్యం : అన్ని మతాలవారున్నప్పటికీ మత సహనం ఉన్నది.సాయుధ పోరాట చరిత్ర ఉన్నా ఎంతో సహనం ఇక్కడి ప్రజల్లో ఉన్నది.ఇక్కడి బొడ్రాయి వద్దే పీరీలు కొలువు దీరుతై.
ఇప్పుడు చెప్పండి.జనగామా జిల్లా ఎందుకు కాదో.