Leave Not Due

🌱 *సంపాదించని సెలవు*

*(LEAVE NOT DUE):* 🌱

🥗 AP Leave Rules 1933 మరియు 15C,18C మరియు 25 ను అనుసరించి ప్రోబేషన్ కాలము సంతృప్తికరంగా పూర్తిచేసిన సుపీరియరు మరియు నాల్గవ తరగతి సర్వీసులకు చెందిన ఉద్యోగులందరూ ఈ సెలవు పొందుటకు అర్హులు .

🥗 సంపాదించని సెలవు మెడికల్ సర్టిఫికెట్ పై మాత్రమే,సగం జీతం సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భవిష్యత్ లో ఆర్జించిబోవు సగం జీతపు సెలవును వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేయవచ్చును.

*[Rule 15(c) & 18(c)]*

*(G.O.Ms.No.543 F&P Dt:07-12-1977)*

🥗 మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేయవచ్చును. ఈ విధంగా మంజూరైన సంపాదించని సెలవు సగం జీతం సెలవు ఖాతాలో (-) గా నమోదుచేయాలి.

🥗 భవిష్యత్తు లో ఆ ఉద్యోగి సంపాదించుకోగలిగిన సగం జీతం సెలవుకు మించి ఇట్టి సెలవును మంజూరు చేయకూడదు.

🥗 ఉద్యోగి భవిష్యత్తు లో సగం జీతం సెలవు సంపాదించుకొగలడని, అంతేకాకుండా మంజూరైన సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని విశ్వసించినపుడు మాత్రమే సెలవు మంజూరు చేయాలి.

🥗 ఒకవేళ సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగి ఏ కారణం చేతనైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలచుకున్న అంతకు ముందు మంజూరు చేసిన సెలవు ఉత్తర్వులను రద్దుపరచాలి.అట్టి సందర్భాలలో సెలవు ఎప్పటినుండి ప్రారంభమయ్యిoదో అప్పటి నుండి స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వస్తుంది.

🥗 అనారోగ్య కారణంగా ఉద్యోగంలో కొనసాగుటకు అశక్తుడై పదవీ విరమణ చేసినా గాని,క్రమశిక్షణా చర్యల ప్రకారం నిర్భంద పదవీ విరమణ చేయబడినా గాని,లేక మరణించినా గాని ఆ ఉద్యోగికిచ్చిన సంపాదించని సెలవు జీతాన్ని వసూలు

చేయనవసరం లేదు.

*(G.O.Ms.No.290 F&P Dt:19-11-1981)*

🥗 సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతం సెలవులో పొందే సెలవు జీతం మరియు భత్యo చెల్లిస్తారు.