శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమద్ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వాములవారి ఆశీస్సులతో జరుగుతున్న

2వ అంతర్జాతీయ

భాగవత జయంత్యుత్సవాలకు

ఆహ్వానం


- తెలుగు భాగవత ప్రచార సమితి

అందరూ ఆహ్వానితులే!

Krishna - 8299 1385 | Mamata - 9147 4290 | Namrata - 9028 5901 | Ravi - 9889 7203 | Vidya - 9148 7240

అంతర్జాలంలోని తెలుగువారందరికీ మన భాష, సంస్కృతుల మీద, ప్రత్యేకించి ఆ కృష్ణభగవానుని లీలల మీద ఆసక్తి పెంచేందుకు ప్రతి సంవత్సరం ఈ భాగవత జయంత్యుత్సవం నిర్వహిస్తున్నాము. తెలుగు భాగవత ప్రచార సమితి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో పాల్గొని తెలుగు వెలుగులను మరింత విస్తరింపచేయమని ఇదే మా ఆహ్వానం.

2018 ఉత్సవాలలో రెండు ముఖ్య కార్యక్రమాలు కలవు. ఈ కార్యక్రమాలలో వేటికీ ఫీజు లేదు. ఆసక్తి ఉంటే చాలు.

1. కథలు, బొమ్మల పోటీలు

6 నించి 15 సంవత్సరాల లోపు పిల్లలకు

ప్రపంచంలో ఎక్కడినుండైనా పాల్గొన వచ్చు : నమోదు, పోటీ నిర్వహణ, విజేతల ప్రకటన, జయపత్ర ప్రదానం అన్నీ అంతర్జాలం ద్వారానే

విజేతలకు బహుమతులు మరియు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమద్ అమృతానంద సరస్వతీ సంయమీన్ద్ర మహాస్వాములవారిచే అనుగ్రహించబడిన జయపత్రములు.

పోటీ వివరాలు

  • జులై 1 - జులై 22 : అభ్యర్థుల వివరాలు నమోదు (https://goo.gl/forms/wFPd2JcwrY7XKhPk1)
  • జులై 22 : పోటీ నియమాలు, కృష్ణుని బొమ్మలు మరియు కథల విడుదల
  • జులై 22 - ఆగష్టు 5 : నిర్వాహకులు ఇచ్చిన బొమ్మలు / కథలనుండి ఒకటి ఎంచుకుని పిల్లల అలంకరణతో ఇమేజ్ (బొమ్మల పోటీ) లేదా కథ (ఆడియో కథల పోటీ) నిర్వాహకులకు పంపించాలి
  • Sep 2 (కృష్ణాష్టమి) : విజేతల ప్రకటన. జయపత్ర ప్రదానం .
  • సింగపూర్ లో ఉండే వారికి, ఆనాటి కార్యక్రమంలో జయపత్రాలు అందుకునే, సభలో కథ చదివే అవకాశం.

2. సింగపూర్ లో జయంత్యుత్సవ కార్యక్రమం

సింగపూర్ లో తెలుగు వారందరూ కలసి భాగవత జయంతిలో పాలు పంచుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. పిల్లల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భాగవతగోష్టి, బాలల బొమ్మల / కథల పోటీ విజేతల ప్రకటన వంటి వేడుకలతో పిల్లలకు పెద్దలకు కూడా అనువైనటువంటి కార్యక్రమం.

హాలు పరిమితుల దృష్ట్యా ముందుగా నమోదు చేసుకున్నవారినే అనుమతిస్తాము.

Date : సెప్టెంబర్ 2 (ఆదివారం) నాటి సాయంత్రం

Venue : పి.జి.పి. హాల్, శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో జరుగుతున్నది.

సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకులో July 21 లోపు నమోదు చేసుకో ప్రార్థన.

Please Register as "Activity Participant : SG" ticket.

https://tinyurl.com/y8smwcxd

శ్రోతగా పాల్గొనే ఆసక్తి ఉన్నవారు దయచేసి కింది లింకు లో నమోదు చేసుకో ప్రార్థన.

Please Register as "General Admission" ticket

https://tinyurl.com/y939e7ct