అభిప్రాయకదంబం 03

  Vol 01 / Issue 034                                                                                                                 05 - 04 - 2012  

1 ) మీ శిరాకదంబం చాలా బాగుంటోంది .రకరకాల శీర్షికలు..బాగున్నాయి.

మా కంప్యుటర్లో టెక్నికల్ సమస్య రావడంతో కొన్ని మిస్ అయాను.

-          రాజీవ .

 

 2 ) I read Srii Ramana's story long time ago Thanks for reminding me. News of a movie by Bharani and its trailer indicate still some future to Telugu cinema.

-          Vvs Sarma

 

3 ) శిరా కదంబం అత్యంత ఆసక్తి కరంగా తీర్చి దిద్దుతున్నందుకు మీకు  నా అభినందనలు!
 శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.

4 ) ఒక ప్రత్యక్ష  అనుభూతి ....

పరమేశ్వరి రాగంలో సింధుభైరవి మిశ్రమ రాగంగా అద్భుత సంగీత సృష్టి 'ఒక పాట పుట్టింది'

కార్యక్రమంలో 'తిరునాళ్ళకు..పాట స్వరబద్ధం చేసి రికార్డు చెయ్యటం విని అపూర్వ సంతోషానికి లోనయ్యాము.

ఇది నిజంగా పాట పుట్టుక గురించిన మొదటి కార్యక్రమం..కనీసం నేను విన్నది.

శ్రీరంగం వంటి గాయనీమణులు,విజయరాఘవ రావు గారి వంటి ఉద్దండులు స్వరపరచే విధానం 

చాలా అవగాహనాపూర్వకంగా ఉన్నది.

ఆకాశవాణి ఆవరణలో నిలబడి 'చూస్తూ' వింటూ ఉన్నట్లు ప్రత్యాక్షానుభవం కలిగించింది! 

ఈ కార్యక్రమాన్ని నిరుపమానంగా మలిచిన  ఎస్. బి. శ్రీరామమూర్తి గారి నిర్వహణా సామర్ధ్యాల గురించి ఎంత

చెప్పినా తక్కువే.ఎక్కడా కృత్రిమత్వం లేకుండా సాగిన సంభాషణలు,వివరణలూ కార్యక్రమానికి చక్కటి సహజత్వాన్ని

ఆపాదించాయి.

అయ్యగారి జయలక్ష్మి గారికి,ఆలిండియా రేడియోకి వందనాలు,ధన్యవాదాలు.

శిరారావు గారూ,మీకు సరే,యధాప్రకార ధన్యవాదాలు!

శ్రీదేవీ మురళీధర్ 

 5 ) ఆలిండియా రేడియో, హైదరాబాదుకి తరచుగా వెళ్ళడం వలన, కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల పాట పుట్టే ప్రక్రియ గురించి కొంత అవగాహన ఉన్నా....అదంతా శ్రోతలకు అర్థమయ్యే విధంగా మలచిన తీరు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. ఎస్బీ శ్రీరామమూర్తిగారి స్వరం, వాక్ప్రవాహం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కరుణగారు నాటకాలలో పాల్గొంటారేమో...మాటల్లో ఒద్దిక తెలుస్తోంది. శ్రీరంగం గారి కచ్చేరీలు చూసినా ఆమె పాడిన లలిత సంగీతం వినలేదు. ఆమె "లలిత" గాత్రం విని ఆనందించాను. పరమేశ్వరి రాగం గురించి మొదటిసారి తెలుసుకున్నాను. విజయరాఘవరావుగారు ఎంత బాగా మాట్లాడేరో.....పాట సంగతి చెప్పే అర్హత నాకు లేదు. తేటతెలుగు లలిత గీతాలు నాకెప్పుడూ హాయిగొలుపుతాయి...ఈ పాటలాగే.

 

-          మాధురీకృష్ణ

 

6 ) నమస్తే సిరా గారూ,
మీ ప్రయత్నం చాలా బావుంది.
ఇలాగే కొనసాగించండి.
- కొండేపూడి నిర్మల

  Vol 01 / Issue 035                                                                                                                 12 - 04 - 2012  

1. కళ్యాణ వైభోగమే..! ( పెండ్లి పాటలు ) - అయ్యగారి జయలక్ష్మీ  గురించి......

thanks sira garu....maa intlo pellillallo tappakundaa untayi ii paatalyu....naaku moodu rojulavaraku bhojanam akkaraledu...recent gaa oka samvatsaram krinda maa cousin pelliki gauri kalyana ni apoorva kalyana vaibhogame...aditya kalyana vaibhogame...ani...viyyamerugani....ivvanni naa favourite.... naaku maa intlo oo pelli choostunnatte undi.…. thanks....

 

Gomati Ravi

 

2. chala bagundi ee article.manchi patalato pelli ki vellivachinattu undi.

 

Lalitha Srujana Vadlamudi

 

3. సంగీత పరికరాలు 03 - మోర్సింగ్ - మాధురీకృష్ణ   గురించి .........

శ్రీ రావు గారు

ఘంటసాల గారి మొర్సింగ్ అత్యద్భుతము. మొదటిసారి ఈ వాయిద్యాన్ని వివరంగా విన్నాను. పేరు కూడా 

ఇదే మొదలు వినడం.

సాధారణంగా మృదంగం,ఇతర వాయిద్యాల పట్ల ముఖ్య కళాకారులకు ఉదాసీనత చూస్తాం(ముఖ్యంగా బాలమురళి)

ఇతరుల నైపుణ్యం ప్రోత్సహించరు వాళ్ళు.

ధన్యవాదాలు

శ్రీదేవి 

 

4. Sanchika chaala baagundi rao garu, hats off to you..

 

Naga Lakshmi Rayavarapu

 

 

5. శిరా కదంబం -శ్రీ రామ నవమి  ప్రత్యేక సంచిక  నిజం గా ప్రత్యేకమే !- శ్రీరామనవమి పర్వ దినాన -  శ్రీ సీతారాముల కల్యాణం జరిగిన చలువ పందిరిలో - పంచిపెట్టిన  ప్రసాదం --( వడపప్పు, పానకం , కొబ్బరి ముక్కలు) అంత  పవిత్రం గా- తీయగా -   కొత్త తాటిఆకుల విసినకర్ర తో విసురుకుంటే వచ్చే చల్లటి గాలి  సోకినంత మధురం గా ఉంది -  మిత్రులు శ్రీ   రామచంద్ర రావు గారు  నిర్వహించిన    'కళ్యాణం  కమనీయం.'.ఇందులో పాలు పంచుకున్న  సోదర రచయితలు, రచయిత్రులు, చిత్రకారులు , సంగీత కారులు-  ప్రతి ఒక్కరికీ  పేరు పేరునా  నా  అభినందనలు

 

v subba rao Voleti

 

6. భక్త రామదాసు గోష్టి గానం 11 గురించి..........

ayyababoi..emiti maa meeeda inta kanikaram..mundu pelli paatalu....ippudu ramadasu keertanalu...okasari modalettarnate agakoodadu....anchanaalu ekkuvaipotayi......mee meeda maaku...:)

 

Gomati Ravi

 

7. నచ్చని కోడలు వచ్చింది ( కార్టూన్ కథ ) - శ్రీదేవి మురళీధర్ ; బొమ్మలు : సరసి గురించి.......

BAAGUNDI.. STORY ANDEE..

 

Sai Padma


  Vol 01 / Issue 036                                                                                                                 19 - 04 - 2012  

' శిరాకదంబం ' గురించి............  

నెల నెలా శిరాకదంబం పత్రికని రెగ్యులర్ గా పంపిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు ! పత్రిక బాగుంది. దేశ విదేశాల్లో ఉన్న నా స్నేహితులకు పంపిస్తున్నా! అందరూ చాలా బాగుంటుందంటున్నారు.
- శివలక్ష్మి.

Dear Sir,
Your articles really very nice thanks
Regards
- N L Srinivas

Sir...
Website chaala baagundi...
I wil reach u later with lot of " Mucchatlu"
..................
- Gangadhar Veerla
Journalist cum Artist( Painting anfd cartooning)

sira kadambam nu baaga teesuku vastunnaaru.. abhinandanalu..
- Ravi Sangeveni


నమస్కారం ! శ్రీ రావు గారు మీ (మన) శిరాకదంబం మాల సువాసనలని ఆగ్రాణిస్తున్నాం.

ఎప్పటికప్పుడు రాయాలని ప్రయత్నం కాని ఏదో ఒక ఆటంకం రావడం తో

రాయడానికి ఏకాగ్రత కుదరటం లేదు.

- Manimurthy Vadlamani


చిలకమర్తి వారి ' గణపతి ' - అయ్యగారి జయలక్ష్మి  గురించి........


  1. గణపతి పుస్తకం నేను మా కాలేజీ లైబ్రరీ నుంచీ కొట్టేసి నా దగ్గరే అట్టి పెట్టుకున్న పుస్తకం!

ఒక సారి మా బాంకు కి ఈ గ్రంధ కర్త మనుమడు వచ్చారు. ఆయనతో నేను గణపతి పుస్తకం పేరు ప్రస్తావిస్తే ఎంతో ఆనందించారు. ఆ ఇంటి పేరు ఎక్కడ చెప్పినా గణపతి నవలనే గుర్తు చేసుకుంటారు అని చెప్పి ఎంతో మురిసి పోయారు!

ఈ ఆడియో నాటకం కోసం నేను ఎప్పటి నుంచో వెదుకుతున్నాను! అందించినందుకు జయలక్ష్మి గారికి ధన్యవాదాలు !


- Lalitha Sravanthi

 

  1. superu...naaku nachina o manchi pustakam. Nenu 7th lo unnappudu ante around 84-85 lo chadivaanu...eppudaina manasu kalatha chendite ..naku mandu Ganapathi and Maya Bazar.

       -  Gomati Ravi

 

రేడియో జ్ఞాపకాలు - ఓలేటి వెంకట సుబ్బారావు గురించి.......... 


  1. వోలేటి గారి రేడియో ఙ్ఞాపకాలు చాలా బాగున్నాయి. పల్లెటూరి సహజ వాతావరణం, ప్రేమా ఆప్యాయతలు కళ్ళతో చూస్తున్నట్టుగా ఉంది. వోలేటి గారి వయసు ఇంతని ఇప్పటిదాకా తెలియదు. ఆయన రాసే విధానంలో ఉత్సాహం, చురుకుదనం ఉండడమే అందుకు కారణం. తనలోని అద్భుత రసాన్ని సజీవంగా ఉంచగలిగినందుకు ఆయనకి హార్దికాభినందనలు. అప్పటి రేడియో కార్యక్రమాల నాణ్యత ఎక్కువని విన్నాను. కోణార్క- శిల్పకళావైశిష్ట్యం ఇప్పటికీ ఉన్నట్టైతే శిరాకదంబంలో వినిపించగలరు. వినాలని ఆసక్తిగా ఉంది.

            madhuri Krishna

2.      గౌరవనీయులు మురళీధర్ గార్కి, ఓలేటి వెంకట సుబ్బారావు గార్కి,

 సహస్రాభివందనాలు. రేడియోలో ఉన్న సౌకర్యం, సౌకుమార్యం రుచులు ఇప్పటి వారికి కూడ తెలిసొస్తోంది అనుకుంటున్నాను. ఈమధ్య వచ్చిన జోష్ ఆన్ లాన్ రేడియోకి మంచి స్పందనే ఉంది. మా స్నేహితులు చింతా రామ కృష్ణా రావు గారు (http://andhraamrutham.blogspot.com/) వలన తెలిసింది. రేడియోలో వినడం, పుస్తకం చదవడం లో ఉన్న సౌకర్యం మన మీద, మన ఊహల మీద దాడి ఉండదు వారు చెప్పేది అంగీకరిస్తోనే మన ఇష్టం వచ్చినట్టు తర్కించుకోవచ్చు. ఇక సౌకుమార్యాదుల విషయం మీ లాంటి హేమాహేమీలముందు చెప్పడానికి నేనెంతవాడిని.


- ఊ. సాంబశివరావు,
- భాగవతగణనాధ్యాయి
- http://pothana-telugu-bhagavatham.blogspot.in/

 

  1. Respected Sri Voleti Venkata Subba Rao garu,

    Pranams. I had gratefully received the marvelous Article you had written on All India Radio. I cannot express in sufficient words the astonishment I had felt for your ability to recall so many facts at one go and the mesmeric vividness of so many beautiful memories you had filled yourself with. The mention of my name at the end had left me speechless for it is I who is indebted to you in every which way and not the reversal.

    Immediately on receiving your Article I had forwarded it to a few of my esteemed friends for their kind perusal and possible response. I am forwarding to you one such one from Sri Bhandaru Srinivasa Rao garu, an inspired Radio News Reader, Editor (at AIR and Door Darshan) and now an influential writer and a renowned commentator on current affairs. You too must have heard of him and watched him over Tv many times. You can access his Blog at http://bhandarusrinivasarao.blogspot.com
    .

    Today I have some problem with the Indic Scripts option in my computer. I shall write to you again after reinstalling the same my detailed response in appreciation of your beautiful writing. Like Sri Srinivasa Rao garu had rightfully mentioned - you had brought to life these enduring memories at a time when Radio is becoming an unheard term to the present generation. 

    With warm regards,

    Sincerely,
    Elchuri Muralidhara Rao

 

  1. రేడియో గురించి ఇంకా ఇంకా రాయాలని ఉంది భండారు శ్రీనివాసరావు
     
    రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలనన్నీ రేడియో గురించి రాసిన వ్యాసంపై వచ్చిన  అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీరాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం లో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.
     
    ఆకాశవాణి న్యూస్ రీడర్లను పరిచయం చేసే క్రమంలో  శ్రీ శ్రీ ప్రసక్తి వచ్చిన సందర్భంలో సుజాత గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. 90 దశకం పూర్వార్ధంలో కన్నుమూసిన సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయం లో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏల్చూరి విజయ రాఘవ రావు గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని ఫిలిమ్స్ డివిజన్ లో చాలాకాలం మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు శ్రీధర్ న్యూఢిల్లీ లో ప్రొఫెసర్ గా వున్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలాకాలం మద్రాసులో సోవియట్ భూమి తెలుగు విభాగం లో పనిచేశారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు, శెట్టి ఈశ్వర రావు గారు, తాపీ మోహన రావు గారు (తాపీ ధర్మారావు గారి తనయుడు) ఆయనకు సహచరులు. శ్రీ శ్రీ, ఝరుఖ్ శాస్త్రి గార్లకు సుబ్రహ్మణ్యం గారు సన్నిహిత మిత్రులు. వారి నడుమ సంభాషణలు కవితాత్మకంగా, కొండొకచో రసాత్మకంగా వుండేవని చెప్పుకునేవారు. ఒకసారి శ్రీ శ్రీ  సుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతూ ప్రాసక్రీడల్లో అనుకుంటాను
     
                                    ఏ సోడా! ఏ నీళ్ళూ
                                     వీసం కూడా కలపక
                                    సౌనాయాసంగా విస్కీ సేవించే ఏసుకు ...”  అని ఆశువుగా ఆలపించారు. ఇక్కడ  సౌనాయాసంగా అంటే సునాయాసంగా ఏసు అంటే ఏల్చూరి సుబ్రహ్మణ్యం. అలా వుండేదన్న మాట మహాకవితో ఆయనగారికున్న సాన్నిహిత్యం.
     
    సుబ్రహ్మణ్యం గారు మద్రాసులో వున్నప్పుడు రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు పాస్ పోర్ట్ పనిమీద అనుకుంటాను అక్కడికి వెళ్లారు. తదనంతర కాలంలో రచయిత, గ్రంధకర్త, విమర్శకుడు అయిన రాల్లభండి వెంకటేశ్వర రావు గారు (ఆర్వీయార్) మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలాకాలం పనిచేశారు. మాస్కోలో చదువు కోవడానికి వచ్చే పిల్లలందరికీ ఆయనే అక్కడ పెద్దదిక్కు. మా కుటుంబం మాస్కోలో వున్నప్పుడు కూడా వారి ఇంటికి రాకపోకలు ఎక్కువ. సరే, ఆయన మద్రాసు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారిని  కలిసారు. పక్కన వున్న శెట్టి ఈశ్వర రావుగారు జగమెరిగిన బ్రాహ్మణుడు అంటూ సుబ్రహ్మణ్యం గారిని ఆర్వీయార్ గారికి పరిచయం చేయబోయారు. అదేమిటండీ అలా అంటారు చొక్కా లోపలనుంచి జంధ్యం అలా కనబడుతుంటేనూ అని ఆర్వీయార్ గారు తన సహజ శైలిలో అనేసారుట -  జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా?” అన్న నానుడిని గుర్తు చేస్తూ.
     
    సుబ్రహ్మణ్యం గారి వియ్యంకులు ధనికొండ హనుమంతరావు గారికి మద్రాసులో తెలుగు ముద్రణాలయం వుండేది. ఎవరయినా రచయిత పుస్తకం అచ్చుపని ఎప్పుడు పూర్తవుతుందని అడిగితె ఆయనకు చర్రున మండుకొచ్చేదిట. ఏమిటయ్యా హడావిడి. బట్టలు ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కట్టుకోవాలి కాని ఇలా వెంటపడితే ఎలా అనేవారని ఆర్వీయార్ గారు చెప్పారు.
     
    అన్నట్టు, ఆర్వీయార్ గారు కూడా మాస్కో రేడియోలో ఆపద్ధర్మంగా వార్తలు చదివేవారు. రష్యన్-తెలుగు డిక్షనరీ కూడా తయారు చేసారు. పనులమీదా, ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ) ఆహ్వానం మీదా సోవియట్ యూనియన్ సందర్శించే తెలుగువారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా వుండేది.

 

  1. subbaaraavu gaaroo:

    Trust that you and your family are doing well.
    I saw the link yesterday in your Facebook status yesterday and read the article.
    It reminded me of my younger days with radio. Thank you.

    Regards  -- V Chowdary Jampala

 

  1. My dear Sri Subbarao garu: Namaste!  I am delighted to read about your first Radio talk , Congratulations on that. Double congratulations because you got the cheque on the day of recording itself. Now they take not less than a month to post it!

 Trust you are keeping good health.

 Warm regards

 Narasimhacharya


ఏది నిజం ? ఏది సత్యం ? - టి. వి. యస్. శాస్త్రి - గురించి...........

  1. నేటి యువత మదిని తొలిచే ప్రశ్న...

-          అరుణ రేఖ కూచిభొట్ల

  1. కుల గోత్ర ప్రాంతీయ భాషా వయస్సు లింగ భేదాలు లేని పెళ్ళిళ్ళు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. ఇంకా మనకి సగోత్ర/సపిండ విషయాల గురించి చర్చించే సమయం వుందంటే కూసింత సంతొషించ తగ్గ విషయమే నండోయ్..

-          Nagamani Pagadala


  Vol 01 / Issue 037                                                                                                                 26 - 04 - 2012  

శిరాకదంబం ' గురించి............ 


* శ్రీ రావు గారికి 

        శిరా కదంబం ఏప్రియల్ సంచిక చూసేను చాలా బాగుంది ముఖ్యంగా ఓలేటి సుబ్బారావు గారి రేడియో జ్జ్ఞాపకాలు చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చాయి అలాగే ఎర్రమిల్లి శారద గారి కాళిదాసు శాకుంతలం చదవాలనే చిరకాల వాంఛ నేరవేరుతోంది. డాక్టర్ ఇవటూరి శ్రీనివాసరావు గారి అక్షయ తృతీ, చందనోత్సవం శంకరజయంతి, డాక్టర్ గోలి  ఆంజనేయులు గారి గీతా కదంబం బాగున్నాయి. అయ్యగారి జయలక్ష్మి గారి చిలకమర్తి వారి గణపతి నాటకం, గొల్లపూడి వారి వ్యాఖ్యానం అద్భుతం. అలాగే అన్ని చాలా బాగున్నాయి ఇంత మంచి శీర్షికలు అందిస్తున్న మీకు ధన్యవాదములు. 

                                                                                                       -   కొండేపూడి వెంకట జోగన్న, రామచంద్రపురం

 

 

* గౌరవనీయులైన రావు గారు

పత్రిక చూస్తున్నాను. చాలా బావుంటోంది.

మీరు చేస్తున్న కృషిని చూసి చాలా గొప్పగా అనిపిస్తోంది నాకు.

తెలుగు భాషా సంస్కృతులు మీ వంటి వారి వల్లనే నిలుస్తున్నై.

కృతజ్ఞతలతో 

సదా మీ 

వాడ్రేవు సుందర్రావు


'నిర్వాణషట్కం - టి. వి. యస్. శాస్త్రి గురించి ........

శ్రీ శాస్త్రి  గారికి,

 మీ శంకర భగవత్పాద రచన వివరణ  చదివాను చక్కగావుంది ఆనందించాను .

రమాపతి రావు .


రేడియో జ్ఞాపకాలు - ఓలేటి వెంకట సుబ్బారావు గురించి..........

మాన్యతల్లజులు శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారి అందమైన రేడియో జ్ఞాపకాలను చదువుతుంటే మా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ నాళ్ళలో ఇంటి డ్రాయింగు రూములో రేడియో చుట్టూ కవరు తొడిగి, పైన ఫ్లవరువాజును అలంకరించి అందరం చుట్టూ కొలువుతీరి, ఆ సువర్ణశ్రవ్యప్రపంచాన్ని సవర్ణదృశ్యప్రపంచంగా కళ్ళల్లో నిలుపుకొన్న రోజులన్నీ మనసారా గుర్తుకు వచ్చాయి. పోస్టాఫీసుకు వెళ్ళి రేడియోకు లైసెన్సు కట్టి రావటం, ఆంగ్లంలో హవల్దార్ వార్తలు వింటే చాలు ఇంగ్లీషు వచ్చినట్లే అని చెప్పుకోవటం జ్ఞాపకానికి వచ్చింది. మద్రాసు రేడియో స్టేషన్లో మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారి విచిత్ర గాత్రాన్ని విని విస్తుపోవటం, ఆయన ప్రోత్సాహంతో రేడియో కార్యక్రమాల్లో పాల్గొనటం, బాలల కార్యక్రమం అయిన తర్వాత ఆయన పేరుపేరున ఒక్కొక్కరినీ మర్యాదచేస్తూ అందరికీ క్యాంటీనులో ఇడ్లీ వడ చట్నీ, దోసె సాంబారు ఇప్పించటం ఆ ఆతిథ్యవైభవం రేడియోలో ఆయనతోనే అంతరించినట్లుంది. ఆయన చారిత్రిక మహాపురుషులు శ్రీ సోమశేఖరశర్మ గారి సోదరులని,డిగ్రీలు లేని పాండిత్యంబు వెన్నెకు రాని పాడు కాలాన పుట్టివంటి ఆంధ్రప్రశస్తి అంకితం పద్యాల ప్రత్యక్షశ్రోత అని తెలిసి - దూరంనుంచే చేయెత్తి నమస్కరించేవారము. మద్రాసు, హైదరాబాదు, విజయవాడ, ఢిల్లీ రేడియో కార్యక్రమాలను ఆకర్ణించటం, ఆ మాధుర్యధారావశంగతత్వాన్ని ఆత్మీయతతో ఆత్మీకరించుకోవటం ఒక్కొక్క దృశ్యమే కళ్ళముందు మెదలాయి. ఒక్కొక్కరిపైన ఒక్కొక్క విపులాగ్రంథమంత సమాచారాన్ని క్రోడీకరింపదగిన మహనీయుల పేర్లను మనఃపర్వంగా స్మరించారు. ఈ వ్యాసాన్ని అధికరించి వేఱొక వ్యాసాన్ని అనుబంధింపదగినంత విషయావిశేషాన్ని ప్రోదిపరిచారు.

 

మళ్ళీ ఒకసారి శిరాకదంబంపాఠకులందర్నీ జ్ఞాపకాల కాలయంత్రంలో కూర్చుండబెట్టి కమ్మని మాటలతో ఇన్ని బొమ్మలు కట్టిన మాన్యులు శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారికి, సంపాదకవర్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు.

 

సర్వశుభాకాంక్షలతో,

ఏల్చూరి మురళీధరరావు








Comments