Vol. 07 Pub. 008‎ > ‎

అభిప్రాయకదంబం


అభినందన కదంబం


RRao Sistla
- Sep 23, 2011 12:41 AM - Remove

పత్రిక బాగుంది. వీలైతే క్యాలెండరులో ఆయా వారములలో వచ్చే పర్వదినములను ఒక పట్టికలో చూపిస్తే బాగుంటుంది... శిరాకదంబం పత్రిక ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయము, మరియు ఆధ్యాత్మికతా సుగంధములను వెదజల్లుతుంది. కనుక సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి కళలకు సంబంధించిన ఫోటోలు,న్యూస్ కు కూడా పత్రికలో స్థానం కల్పిస్తే బాగుంటుంది. అలాగే భక్తి కవితలు చిన్న చిన్న వాటికి కూడా అవకాశం ఉంటే మరింతమంది ఇందులో పాల్గొనగలుగుతారు, చదవగలుగుతారు. 1,2 చోట్ల చిన్న చిన్నగా పెద్దల సుభాషితాలు ! ( స్వామి వివేకానంద, శ్రీ రమణ మహర్షి ...ఇలా ) కూడా ఉంటే బాగంటుంది ...వీటిలో మీకు నచ్చిన అంశాలు పరిశీలించగలరు.. ఇప్పుడైనా ఈ పత్రిక చాలా బాగుంది.....ధన్యవాదములతో .......ఉషావినోద్

RRao Sistla - Oct 3, 2011 11:24 AM - Remove

ఎంతో చక్కని దేవి కీర్తనను ప్రేక్షకులు చదివి పాడుకునే అవకాశం, విజయవాడ లోని శ్రీ మరకత రాజ రాజేశ్వరి దేవిని దర్శింపజేసే అవకాశం కల్పించిన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.మీరు గతంలోకి అని కూడా వేస్తున్నందుకు మిస్ అయిన వారికి మంచి ఉపయోగకరం...అందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను! - ...ఉషావినోద్

RRao Sistla - Oct 3, 2011 11:46 AM - Remove

మన సంచిక - దసరా సంచిక- అమ్మ వారి ప్రసాదమంత మధురం గా ఉంది.
దసరా ప్రత్యేక సంచికలో ఇతర శీర్షికలు కూడా చాలా 'పవిత్రం' గా వున్నాయి. వాటిని పంపి సహకరించిన ప్రతి ఒక్కరికి- అంతే కాకుండా వాటిని సుందరం గా అలంకరించిన మీకు అభినందనలు.దసరా శుభాకాంక్షలు.
- వోలేటి వెంకట సుబ్బారావు

RRao Sistla - Oct 15, 2011 9:33 PM - Remove

very good articles....sir....

- B Venkata Prasad

RRao Sistla - Oct 15, 2011 9:52 PM - Remove

రావు గారికి ,
నమస్కారములు. మీ శిరాకదంబం వెబ్ పత్రిక ని చదివాను. ఆర్టికల్స్ బాగున్నాయి. ఆధ్యాత్మిక పరంగా ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది. కొన్ని మంచి కథలు నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉండేవి కూడా ప్రచురించగలరు. అలాగే కొన్ని జోక్స్ కూడా వుంటే బావుంటుంది. ఇంకా కొన్ని ప్రపంచం లో జరుగుతున్న అరుదైన విషయాలు కూడా చేర్చవచ్చు. మీ ప్రయత్నం అభినందించ దగ్గది.
శుభాభినందనలతో
సోదరి
ఇ. వి. లక్ష్మి .

RRao Sistla - Oct 27, 2011 9:10 PM - Remove

తాజా సంచికకు ( 24 - 10 - 2011 ) తమ రచనల ద్వారా అందచందాలనుదిద్దిన శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఉష , శ్రీమతి జ్ఞాన ప్రసూన గారు - వీరికి- నా శుభాభినందనలు.

- ఓలేటి వెంకట సుబ్బారావు


సంపుటి : 001 / సంచిక : 012                                                                                                     31-10-2011


తాజా కదంబం చూసాను.సౌందర్య-సువాసనాభరితంగా ఉంది. అభినందనలు.
జ్ఞాన ప్రసూన గారి రచన -పించను- ఇతివృత్తం -కధనం బాగున్నాయి. 'హరి కధా కళాకారుల గురించిన  పరిచయం మాధురీ కృష్ణ  గారి  మంచి రచన .సోదరీమణులు శాంతి నిభా, ఎర్రమిల్లి శారద  గారు -సోదరులు శ్రీనివాసరావు  గారు తమ రచనలతో పత్రిక ను సుసంపన్నం చేశారు.నాటి ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత  శ్రీ వి . శాంతారాం  గారి గురించిన  వ్యాసం లో తెలుగు పాటల హిందీ చిత్రం -విశేషాలు  బాగున్నాయి..రచయితలకు- రచయిత్రులకూ-అభినందనలు.

                                                                                                                                 - ఓలేటి వెంకట సుబ్బారావుసంపుటి : 001 / సంచిక : 013                                                                                                     07-11-2011


సిరాకదంబం నచ్చింది. నేర్చుకోవలసిన సత్యాలు పిల్లలకి కావసిన సుభాషితాలు వోలేటి వారి సినీ కదావళి బాగా నచ్చాయి. 
                                                                                                                     - సీతాపతి, Sitapati Pantulaసంపుటి : 001 / సంచిక : 014                                                                                                    14-11-2011
 
                                                                                                    
డియర్ సర్,
మీరు పంపే సిరా కదంబం పత్రిక చాలా చాలా బావుంది.
చాలా చాలా ధన్యవాదాలు.
- hasini 

chala manchi prayathnamu... prasthutha samajaniki chala avasaramu kooda... hats off to you all for the trials..... thanks to you sir...

-
Manikyalarao Vadrevu


సంపుటి : 001 / సంచిక : 015                                                                                                     21-11-2011

Rama chandra Rao gariki Namaste...Munmunduga okokkariki pratyeka pegee create chesina mimmulanu abhinandinchaka pothe chala thappu chesina vaallamauthaamu.anduku mimmalni yenthagaano abhinandisthunnaanu.ika ventane... munduga  Maadhuree Krishna gaariki Hanuman manthram start chesinanduku prathyaka krithajgnathalu telupukuntunnaanu.Jayalakshmi gaari Jaabilli Tejas ku naa aaseessulu!Nee daya raadaa kirthana chala baagundi.Prasuna gari peddallo-chinnathanam  aalochanaathmakam ga undi..Maadhuri gaari Ghantasaala padaalaku...vaari kodalu paadaarchana Superb!Aa mahaanubhaavuniki manamemi ichinaa thakkuve...Mallaadi vaari invitation Narayana theerdha tarangam chudagaane....nenu ,maa amma nerpina haarathi paata prathi shanivaara pooja lo Sri Venkateshwara rupaana unna Sri Krishnuni pai paade "MAngalam Rukminee RAmanaaya Sreemate...Mangalam Ramaneeya murthaye...Te....ani ventane gurthu vachindi....Shaarada gaari subhaashithaalu,oleti gari Pancha bhuthaalu chala baavunnaayi...veelaithe ee pancha bhutha thathvam pai veluvadina Grandhamula perlu vaaru ivvagalarani marintha vivaram ga telusukona galamani bhaavisthunnaanu.vaariki na kruthagnathalu.Alaage...Saalagraamaalu intlo evaro iste pettinappudu pooja lu entha nishta ga cheyaali?Asalu intlo poojalu sreshtamaa? Gullo unduta sarva sresthamaa?vaaru vivarinchithe...baguntundi anukuntunnaanuIka Chinnaari shruthini emani pogadanu?Aa pushpamu mana teluguthallikentha ishtamai undavacho...uhinchalemu kadaa....Andari Aseessulu aameku kalagaali....Mee Pathrika Dwara Eppati maa naanna ,Amma la Gnaapakaalano erchi kurchi andariki andinche veelu kaluguthunnanduku ,Sarvadaa kruthagnuraalini.ee vele Amma gaaru Na kalalo kanipinchi, matlaadaaru!karthika maasam Pitrudevathala nu thalachukone maasam....lechaka Shiraa kadambam chusi Ammanu Photo lo chusaanu!Raama chandra Rao Garu! meeru Dhanyulu...Punyaathmulu..idi Satyam,Satyam....Ushavinod,superintendent


సంపుటి : 001 / సంచిక : 016                                                                                                     28-11-2011

    ముందుగా నేను పంపగా మీరు ప్రచురించిన  విశ్వరూపం ఈ మార్గశీర్ష మాసానికి ప్రతిరూపంగా నిలచింది ! Dr.ఇవటూరిగారు ఈ మాసం గురించి చక్కని విషయాలు చెప్పారు. శివ ప్రాత:స్మరణ స్తోత్రం దివ్యానందం కలిగించింది. సందేహాలు అనే శీర్షిక మొదలు పెట్టడం ముదావహం. నమామి సూర్యనారాయణం అనే కీర్తన శ్రవణం, ఈ శిశిరంలో అత్యావశ్యకం. ఆరోగ్యం భాస్కరాదిచేత్ అన్నారు కదా ! మాధురి గారి వ్యాసం ద్వారా కీ బోర్డు లో కూడా గమకాలు పలికించే చిన్ని బాలుని గురించి తెలుసుకున్నాం. అతనికి మా ఆశీస్సులు. భర్త్రుహరి  సుభాషితము ఈ సారి శిరాకదంబమునకే హైలైట్ ! ఈ సుభాషితం ప్రతి ఒక్కరు మననం చేసుకుంటే... అసలు సమాజంలో స్వార్థచింతన కొంత మేరకు తగ్గవచ్చు. పెంపుడు జంతువుల పెంపకం గురించిన వ్యాసం బాగుంది. LV ప్రసాద్ గారి నటనా స్పూర్తి గురించి కొత్త విషయం తెలుసుకున్నాము ! పత్రిక ఇలాగే జయప్రదంగా చిత్రవర్ణ శోభితం గా ఎల్లప్పుడూ వెలుగొందాలని సర్వదా అభిలషిస్తూ

....భవదీయ
ఉషావినోద్, సూపెరింటెండెంట్, అటవీశాఖ


డియర్ సర్,
శిరా కదంబం మీరు పంపినవి చదివాను చాలా బావున్నాయి. మార్గ శీర్షం - డా.ఇవుటూరి గారి ప్రసంగం విన్నాను. చాలా చక్కగా విశ్లేషించారు. ఆయనకు మా ధన్యవాదాలు. విశ్వరూపం- ఉషా వినోద్ గారి చిత్రం చాలా చాలా బావుంది. గతం లోకి వెళ్లి ఉదయభానుడి పేజి, ఉషావినోద్ గారి పేజి కూడా చదివాను. ఉష వినోద్ గారి దేవి మూర్తుల చిత్రాలు చాలా చాలా నచ్చాయి. నాకు ఆర్ట్ అంటే చాలా యిష్టం. ఉష వినోద్ గారికి నా ప్రత్యెక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియచేయగలరు. సందేహాలు సమాధానాలు కూడా చదివాను. చాలా క్లుప్తం గా వివరిచారు. మాస శివరాత్రికి- శివరాత్రికి ఉన్న భేదాన్ని. మీరు పత్రికలో వివరిస్తున్న విషయాలు చాలా ముఖ్యమైనవి. దాదాపు ఈ విషయాలు తెలియని వారు చాలా మంది ఉంటారు. కనుక యింత మంచి విషయాలు ప్రచురిస్తున్నందుకు  మీ పత్రికలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

పోయిన ఒక సంచికలో అభిప్రాయ కదంబం లో నా రిప్లై ఉన్నందుకు చాలా సంతోషించాను. అందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు.

- హాసిని

మార్గశీర్షం
చాలా బావుంది శిరా గారు ...!
- గోమతి రవి    సంపుటి : 001 / సంచిక : 017   
                                                                                                 05-12-2011          


శిరాకదంబంలో రేడియో అన్నయ్య, అక్కయ్య గూర్చి తెలిపినందుకు సంతోషం
    ముళ్ళపూడి -అక్కయ్యని మళ్ళీ వచేమని చెప్పడం ఇదివరకు నేను చదవలేదు
    చదివించినందుకు సంతోషం
    ఘంటసాల గూర్చి వారి అమ్మాయి నుంచి వెలువడిన వ్యాసం బాగుంది.
    అసలు.. అన్నీ బాగున్నాయ్ ..అన్నిటి గూర్చి ఎలా వ్రాయను
   
- పంతుల సీతాపతి రావు

ee vela Shiraakadambam patrika raavatam,ee veve Geetha jayanthi kaavatam naaku amithaanandaanni kaliginchindi.manamu aadhyaathmikamaina aalochanalu kaligi undatam venuka aa bhagavaanuni visesha krupaanugrahame unnadi ani mummaatiki nammuchunnaanu.ee vela prathi okkaru,Srimadbhagavadgitha loni okka adhyaayamainanu(kaneesam20 slokaalu gala athi chinna adhyyayam,bhakthiyogam,Srikrishnunaku atyantha priyamainadi  aina12 va adhyaayam anusandhinchukonte bahu punyam ani manavi chesthunnaanu,ee vela shiraakadambam lo palgonna prathi rachayithri/rachayitha ku na hrudayapoorvaka shubhaakaankshalu teliyajesukuntunnaanu..patrika aadyantham inthabaga theerchi diddina meeku marokkasaari na abhinandanalu telupukuntunnaanu....

-  Ushavinod

శిరాకదంబానికి
 హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పత్రిక తరచు చూస్తున్నాను. వైవిధ్యభరితంగా ఉన్నది.
ఒక సాహితీ పత్రిక అని చెప్పవచ్చు.

- శ్రీదేవీ మురళీధర్


    సంపుటి : 001 / సంచిక : 018  
                                                                                                 12-12-2011          నమస్కారం రామచంద్ర రావు గారు,
డా. ఇవటూరి గారి వ్యాఖ్యానాలు చాలా
బాగున్నాయి. ఇవి పంపినందుకు మీకు నా ధన్యవాదాలు.
మీ తదుపరి మెయిల్స్ కోసం ఎదురుచూస్తూ,
మీ
వెంకట్.

Ramachandra Rao gariki, namaskaramulu! krindhatisaari Hasini gari abhipraayam (28.11.11)chadivaanu. chala santoshamainadi. Hasini gariki na pratyeka kruthagnathalu Shiraa kadhambam dwara telupukunnaanu....
na kadhanika  mariyu chitramunaku mana shiraa kadhambamu lo chusukuni entho murisipoyaanu...chala chakkaga Title nu teerchidhidhinaru! chala santhoshamu.
Bhavadeeya  Ushavinod

    సంపుటి : 001 / సంచిక : 019                                                                                                   19-12-2011          

తొలి భారతీయ ఆంగ్ల చిత్రం గురించి చదివి సంభ్రమాశ్చర్యాలకూ ఆనందానికీ లోనయ్యాను. ఇది మా స్నేహితులందరికీ పంపించాను. థాంక్సండీ!
- pattem siva


    సంపుటి : 001 / సంచిక : 020                                                                                                  26-12-2011        

 Tiruppavai by Shri. Ivaturi garu is very good.
- Venkat Nemana

    సంపుటి : 001 / సంచిక : 021                                                                                                  02-01-2012         

రావు గారికి
నమస్సులు
    సంచిక   అందింది.     చదవడానికి  హాయిగావుంది.    CD  లు  పెట్టడంలో  కొత్తదనం  వచ్చింది.

- జ్ఞాన ప్రసూన