William Gascoigne (scientist)-విలియం గేస్కోయిన్


 

William Gascoigne (scientist)-   విలియం గేస్కోయిన్


   విలియం గేస్కోయిన్ 1612లో లీడ్స్‌లోని మిడిల్‌టన్‌లో జన్మించారు. మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్  విద్యాభ్యాసం ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగింది.     

శాస్త్ర జీవితం : విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు. దాన్ని ఓ సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల సహాయంతో చంద్రుడు, ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు.       గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ ఆ తర్వాత మరింత మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్  హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు.  జేన్ లారెంట్ పామర్ ఆ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి,  ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు.  దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు.
               
 గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు. 1644 జులై 2న యార్క్‌షైర్ మార్‌స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు.

Comments