నోస్ట్రడామస్ , Nostradamus


కాలజ్ఞాని--నోస్ట్రడామస్

14 డిసెంబరు 1503 - 2 జులై 1566

‘యుద్ధం ముగిశాక స్పందన నిరుపయోగం’

మనిషికి జ్ఞానం వచ్చి కొన్నివేల సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆసక్తి కోల్పోని అంశం మాత్రం ఒక్కటే.. భవిష్యత్తు.
500 సంవత్సరాలు గడిచినా కూడా... నోస్ట్రడామస్‌ను మరిచిపోలేకపోవడానికి కారణం కూడా ఆ ఒక్కటే. నోస్ట్రడామస్ గురించి ఒక్కమాటలో సూటిగా చెప్పాలంటే.. ఆయన పశ్చిమ దేశాలకు చెందిన బ్రహ్మంగారు. ఫ్రాన్స్‌కు చెందిన నోస్ట్రడామస్ అనేక దేశాలు పర్యటించాడు. ప్లేగు నుంచి రక్షించుకోవడానికి ‘రోజ్‌పిల్’ అనే మందు కనిపెట్టాడు.

వ్యక్తిగత జ్యోతిష్యాలు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈయన ‘ప్రాఫెసీస్’ పేరుతో ప్రపంచానికే జ్యోతిష్యం చెప్పాడు. హిట్లర్, నెపోలియన్ ఆవిర్భావం, కింగ్ హెన్రీ-2, యువరాణి డయానా, జాన్.ఎఫ్.కెనడీల మరణం గురించి ముందుగానే చెప్పాడు. తన సమాధిని మళ్లీ తెరుస్తారని ఆ తేదీ కూడా రాశారట! విచిత్రంగా అదేరోజు ఆయన సమాధిని తెరిచారని కూడా ప్రచారంలో ఉంది.

అయితే, నోస్ట్రడామస్ కాలజ్ఞానం ఏమీ చెప్పలేదనీ, తన జ్ఞానంతో ఏం జరగుతుందో ఊహించగలిగాడనీ, దానికి రకరకాల వ్యాఖ్యానాలు జోడించి ఆయన వర్గం ప్రచారం చేసిందనీ విమర్శలున్నాయి.

Comments