Jamshed ji Tata

జంషెడ్ జీ టాటా

పేరు------------షెడ్ జీ టాటా
తండ్రి పేరు------సెర్ వాంజీ టాటా
తల్లి పేరు-------తెలియదు)
పుట్టిన తేది-----3-3-1839.
పుట్టిన ప్రదేశం--గుజరాత్‌లోని బరోడా దగ్గరున్న నవ్‌సారి పట్టణంలో జన్మించాడు
చదివిన ప్రదేశం--బొంబాయి
చదువు--------(తెలియదు)
గొప్పదనం-------బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించి విదేశాల్లోని అనేక యూనివర్శిటీలలో "టాటా" అవార్డులను ప్రకటించాడు.
స్వర్గస్తుడైన తేది--ఆయన 1909 మే 19న స్వర్గస్థుడయ్యాడు.
   
భారతదేశం నేడు పారిశ్రామిక రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఇంకా వేగంగా మున్ముదుకు వెళ్తోంది. అయితే ఈ పురోభివృద్దికి కారకులైన మహనీయుల్ని మనం మరచిపోకూడదు. ఒకప్పుడు మన భారతదేశం ఆంగ్లేయుల దాస్యశృంఖాలలో వున్నప్పుడు మన దేశంలో లభించే సహజ జల, లోహ వనరులను వారు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ లాభాలు చేసుకుంటూ పారిశ్రామికంగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టక ఎంతో స్వార్ధంతో వ్యవహరించేవారు. భారతదేశం రత్నగర్భ, సిరిసంపదలకు నిలయం. మేధావులకూ, మానవతా వాదులకూ చోటులేని కర్మభూమి కావడంవల్ల ఆంగ్లేయులు ఎటువంటి కుట్రలు పన్నినప్పటికీ, కొందరు మహనీయులు, ప్రజ్ఞావంతులు, మేధావులు అహరినిశలూ కృషిచేసినందువలన మన దేశం పారశ్రామిక రంగంలోనూ, విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ ఎంతో ప్రగతిని సాధించింది. పారిశ్రామిక రంగంలోనూజ్, విద్యారంగంలోనూ అనితర సాధ్యమైన కృషి సల్పిన మహనీయుడైన జమ్షెడ్ జీ టాటా జీవిత చరిత్ర ఈ సందర్భంలో మనం తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశం పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేయటానికి ఆయన తీసుకున్న శ్రద్ద, చొరవ మిక్కిలి శ్లాఘనీయం.

జమ్షెడ్ జీ టాటా గుజరాత్‌లోని బరోడా దగ్గరున్న నవ్‌సారి అనే చిన్న పట్టణంలో 1839 మార్చి మూడవ తేదీన జన్మించారు. తండ్రి నసెర్ వాంజీ టాటా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తుండేవాడు. టాటా వంశీకులు పార్శీ మతానికీ చెందినవారు. ఎనిమిదవ శతాబ్దంలో వారు భారతదేశానికి వలసవచ్చి వ్యాపారం చేసుకుంటూ భారతీయ సంస్కృతికి అలవాటుపడిపోయి భారతీయులుగా స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో వారికి ఇంటిపేరు ఉండేదికాదు. వారు చేసే వ్యాపారాలను బట్టి వారి ఇంటి పేరు ఉండేది. ఉదాహరణకు "ఇంజనీర్" అనీ, డాక్టరు అని, "బాటిల్ వాలా" అని ఉండేది. ఆ ప్రకారంగానే జిమ్షెడ్ జీ వంశీకులకు టాటా అనే పేరు వచ్చింది. నసెర్ వాంజీ టాటా భారతదేశంలో పండే పత్తిని హాంకాంగ్, చైనా దేశాలకు ఎగుమతులు చేస్తూ అక్కడ లభ్యమయ్యే బట్టలను దిగుమతి చేసుకునే వ్యాపారంలో ఉండేవారు.

జంషెడ్ జీకి చిన్నతనం నుంచీ-బాగా చదువుకోవాలనీ, చదివి తన దేశానికి సేవ చేయాలనీ అనుకుంటుండేవాడు. అతనికి పదమూడు సంవత్సరాలు వచ్చేవరకూ నవ్‌సాసారిలోనే వుంటూ-అక్కడి గురువులు నేర్పించింది చదువుకున్నాడు. విద్యారంగంలో ఆ రోజుల్లో అంతగా అభివృద్ది లేకపోవడం వలన వారి కుటుంబం బొంబాయి నగరానికి తరలింది. కొంతకాలంపాటు అక్కడ ప్రయివేటుగా చదువుకుని జంషెడ్ జీ "ఎల్సిన్ స్టోన్ కాలేజి" లో చేరడానికి ఎంట్రెన్స్ పరీక్షకు వెళ్ళాడు. ఆ పరీక్ష అందరినీ ఆశ్చర్యపరిచింది. కారణమేమిటంటే మేధావంతులైన ఆంగ్లేయుల పిల్లలు, బాగా చదువుకున్న ధనవంతుల పిల్లలు ఇంతమంది రాసిన పరీక్షలో ఒక పల్లెటూరి నుంచి వచ్చి రాసిన జంషెడ్ జీ ప్రధముడిగా వచ్చాడు. ఆ కాలేజీలోని లెక్చరర్లు కూడా అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. బూన్ అనే ఆంగ్లేయ దొర జంషెడ్ జీని ఇంటికి ఆహ్వానించి ఎంతో మెచ్చుకుని ప్రతిరోజూ ఇంటికి వచ్చి తన కుమారుడికి చదువు చెప్పమని, దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని కోరాడు. జంషెడ్ జీ ఆ అహ్వానాన్ని వినయంగా తిరస్కరించి భక్తిశ్రద్దలతో తన చదువు పైన దృష్టి కేంద్రీకరించాడు.

ఆ రోజుల్లో మన దేశంలో సుస్థిర నాయకత్వం లేకపోవడంవల్ల జాతీయ జీవితంలో భద్రత సుఖశాంతులు లేని జీవన విదానం, ఆర్ధిక విద్యా సాంస్కృతిక పారిశ్రామిక రంగాలలో స్థబ్దత, యువకుడైన జంషెడ్ జీని ఎంతగానో కలవర పరిచాయి. భారతదేశంలోని ముఖ్య పట్టణమైన బొంబాయి నగరానికి సరయిన పాలన లేకపోవటంవల్ల ఎంతో అధ్వాన్నంగా ఉండేది. రోడ్లమీద గుంటలు, మురికి కాలువలు, క్రమ పద్దతిలో లేని ఇళ్ళు, డ్రైనేజీలు లేకపోవటంవల్ల ఇళ్ళముందే పారే అపరిశుభ్రమైన నీరు, అనారోగ్యాన్ని కలిగించే దోమలు, ఈగలు స్వయంవిహారం చేస్తున్న ఆ వాతావరణం చూసి జంషెడ్‌జీ ఎంతో బాధపడేవాడు పెద్దవాడయ్యాక, మొట్టమొదట బొంబాయి నగరాన్ని బాగుచేయాలనీ, అందరికీ విద్యాదానం చేయాలనీ, భారతదేశంలో లభ్యమయ్యే పత్తి, ఇనుము, జలవనరులను, భారతదేశ అభివృద్ది కొరకే వినియోగించడానికి పాటుపడాలని కంకణం కట్టుకున్నాడు. ఒకనాడు కాలేజీనుంచి వస్తుండగా దారిలో ఒక పిల్లవాడు ఆడుకుంటూ పక్కనే వున్న మురికి కాలువలో పడటం జంషెడ్ జీ గమనించాడు. అతన్ని రక్షిద్దామని అనుకున్నంతలోనే ఆ కాలువ పెద్ద ఊబి కావడంవలన అతను క్షణాలలో మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు జంషెడ్ జీని గమనించాడు. అతన్ని రక్షిద్దామని అనుకున్నంతలోనే ఒక అంగలో అక్కడికి ఉరికాడు, కానీ ఆ కుర్రవాడు పడిన మురికి నీటి కాలువ పెద్ద ఊబి కావడంవలన అతను క్షణాలలో మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు జంషెడ్ జీని వారిస్తూ "బాబూ అందులోకి వెళ్ళి బయటకు వచ్చినవారు ఇంతవరకు ఎవరూలేరు.

ఆ కుర్రవాడు ఈ పాటికి మరణించే ఉంటాడు. ఈ భయంకరమైన ఊబి ఇంతవరకు ఇలా కనీసం పదిమందినైనా బలి తీసుకుంది. మేము ఎన్ని విన్నపాలు చేసుకున్నా ప్రభుత్వం మా గోడు పట్టించుకోవడంలేదు. చేయగలిగిందేమీ లేక మా కర్మ అని సరిపుచ్చుకుంటున్నాము" అని చెప్పారు. ఆ విషాద సంఘటన జంషెడ్ జీని ఎంతో కలవరపరిచింది.

చదువు తరువాత తండ్రి ఆదేశానుసారం జంషెడ్ జీ వ్యాపారంలో చేరాడు. కేవలం లాభాన్ని సంపాదించడానికి కాకుండా తన తోటి పౌరులకు సహాయం చెయ్యాలనే దృఢ సంకల్పంతో అతను వ్యాపార నిమిత్తం చైనా వెళ్ళి అక్కడ సంపాదించిన లాభంతో పద్దెనిమిదిసైకిల్ రిక్షాలు వరకు ఎద్దు బళ్ళు, గుర్రంబళ్ళు, మనుషులు ఈడ్చుకెళ్ళే బళ్ళ స్థానంలో సైకిల్ రిక్షాలు వచ్చాయి. తన స్నేహితులను ఉత్సాహపరిచి మరికొన్ని రిక్షాలు తయారుచేయించి వాటిని సరఫరా చేయించాడు.

మన దేశంలో పుష్కలంగా పండుతున్న పత్తిని ఇతర దేశాలకు పంపించి అక్కడి మంచి బట్టలు, నూలు దిగుమతి చేసుకోవడం జంషెడ్ జీకి రుచించలేదు. భారతదేశంలో కాటన్ మిల్లులను స్థాపించాలని కంకణం కట్టుకుని చైనా, జపాన్, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు పర్యటించి ఆయాదేశాలలో జరుగుతున్న పారిశ్రామిక కృషిని గమనించి వీలయినంత సమాచారం సేకరించి భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చినా తరువాత తన శ్రేయోభిలాషుల సహకారంతో ఏడు మిల్లులను వేరు వేరు ప్రాంతాలలో స్థాపించే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆంగ్లేయుల సహాయాన్ని ఆశించకుండా ఒక భారతీయుడు ఎంతో ముమ్మరంగా పరిశ్రమల కార్యక్రమాన్ని చేపట్టడం భరించలేని బ్రిటీషు ప్రభుత్వం అతనీ ప్రయత్నాలకు ఎన్నో అడ్డంకులు కలిగించడం ప్రారంభించింది. జంషెడ్ జీ జంకక, బ్రిటీషు రాణిని కలిసి సహాయం అర్ధించి, భారతదేశంలోని కర్మాగారానికి ఆమె పేరు పెడతానని ప్రమాణం చేసి అధికారులను సహాయ పడేలా ఆదేశాలు జారీ చెయ్యమని కోరాడు.

ఒక యువకుడు ఎంతో ఉత్సాహంతో పారిశ్రామిక పురోభివృద్దికి పాటుపడుతున్నాడని ముచ్చటపడి, ఆమె ఆదేశాలు జారీచేసింది. భారత దేశంలో అప్పటినుంచి ఊహించలేనంత వేగంతో పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.

అనంతరం జంషెడ్ జీ దృష్టి భారతదేశంలో లభించే ఇనుముమీద పడింది. ఇక్కడ లభించే ఇనుమును విదేశాలకు పంపి అక్కడి నుంచి యంత్రాలు దిగుమతి చేసుకోవడంకన్నా ఇక్కడి ఇనుము వనరులను ఇక్కడే ఇనుముగా మార్చి ఆ యంత్రాలను ఇక్కడే చేసుకోవచ్చుననే అభిప్రాయం ఏర్పడి ఆ కార్యక్రమంపై పనిచేస్తూ ఇతర దేశాలు పర్యటించసాగాడు. అదే సమయంలో బొంబాయి నగరంలో తాజ్‌మహల్ హొటల్ స్థాపించాడు. ఆ రోజులలో ఆసియా ఖండంలో కల్లా మొట్టమొదటి పెద్ద హొటల్ అదే అంతే కాకుండా మనదేశంలో లభించే జలవనరులను సద్వినియోగం చేసుకోవాలని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎంతో కృషిచేశాడు.

పారిశ్రామికంగానే కాకుండా విద్యారంగంలో కూడా జంషెడ్ జీ ఎంతో కృషిచేసి తనవంతు బాధ్యతలను నిర్వహించాడు. బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించి విదేశాల్లోని అనేక యూనివర్శిటీలలో "టా టా" అవార్డులను ప్రకటించాడు. ఆయన 1909 మే 19న స్వర్గస్థుడయ్యాడు.

జంషెడ్ జీ కుమారులు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి అనేక రంగాలలో ప్రావీణ్యం పొంది "టాటా" అనే పేరు ద్వారా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అనేక వస్తువులను తయారుచేస్తున్నారు.

జంషెడ్ జీ టాటా కలలుగన్న స్టీలు ఫ్యాక్టరీకి టాటా స్టీలు ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు. ఆ నగరానికి జమ్షెడ్‌పూరు అని పేరు పెట్టారు.

మూలం: జాతిరత్నాలు, బి.వి, పట్టాభిరాం, శ్రీమహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్
Subpages (1): Jaroslav Heyrovsky
Comments