శ్రీమతే నారాయణాయ నమః                                                                                                                 శ్రీమతే రామానుజాయ నమః

ధ్యేయసదా సవిత్రుమండల మధ్యవర్తి
నారాయణ సరసిజానన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ
హిరణ్మయవపు దృత శంఖచక్రః ||

ఈ జగత్తును ప్రకాశింపజేసే సూర్యుడు, ఆ గోళంలోంచి వచ్చే తేజస్సు వల్ల అన్ని ప్రకాశిస్తున్నాయి అంటే కారణం పరమాత్మ. సూర్యుడికి కూడా కాంతినిచ్చేవాడు ఆ భగవంతుడే కదా. భగవద్గీతలో భగవంతుడు ఇదే చెప్పాడు.

య ఆదిత్య గతం తేజః జగత్ బాసయతేఖిలం |
య చంద్ర మసియజాగ్నోవ్ తత్ తేజో విద్ది మామకం ||


ఉపనిషత్ కూడా ఈ విషయమే చెబుతుంది.
 
నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం
నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిః
తమేవ భాంతమనుభాసితర్వం
తస్య భాస సర్వమిదం విభాసి


మాఘమాసం - రథసప్తమి