Site‎ > ‎Site Updates‎ > ‎

సామవేద పురుషుడి కిరీటము - 'సద్విద్య' article added

posted 5 May 2016, 21:59 by Shashi-Kiran Rao S   [ updated 5 May 2016, 21:59 ]


 సామవేద అంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని ఒక భాగమైన 'సద్విద్య' గురించి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భగవద్గీతలో తన విభూతిని వివరించే పదవ అధ్యాయంలో తనను గురించి తాను చెబుతూ, "వేదానామ్ సామ వేదోస్మి", తాను సామ వేదాన్ని అని సూచించాడు. కారణం అది వినడానికి శ్రావ్యముగా గాన రూపమై ఉంటుంది. జ్ఞానం ఉండాలి అనే నియమం లేదు, చెట్లు సైతం గానాన్ని ఆస్వాదిస్తాయి అనేది మనకు తెలిసిన విషయం. గానానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటుంటారు. ఆ వేదానికి ఆయోగ్యత తాను అధిష్టించి ఉండటం చేత ఏర్పడింది. "మమ తేజోంశ సంభవమ్ అవగశ్చ", ప్రపంచంలో ఏది ప్రకాశిస్తున్నా అది తన అంశాంశ చేరి ఉండటం చేత. 


Comments