posted 21 Apr 2016, 21:52 by Shashi-Kiran Rao S
మనిషికి తెలివిని దానికి అనుగుణమైన ఆచరణని అందించింది వేదం. పొందాల్సిన వాటిల్లో ఏది అన్నింటికంటే గొప్పదో దానిని పొందించే సాధనము కూడా వేదమే. 'విదుల్ లాభే' అనే మరొక ధాతువు ద్వారా కూడా వేదం అనే పదం ఏర్పడింది. అంటే లభించాల్సిన వాటిల్లో అతి విలువైనవేవో వాటిని తెలుపుతుంది వేదం. విలువైనవి అంటే ఏవి ఆనందాన్ని ఇవ్వగలవో అవి విలువైనవి. ఆ ఇచ్చే ఆనందం తాత్కాలికమై కాకుండా ధీర్ఘకాలికమై ఉంటే అది గొప్పది. ఆ ఆనందం నశించకుండా ఉంటే అది మరింత గొప్పది. అలాంటి దాన్ని ఎట్లా పొందాలి అనే విషయాల్ని తెలుపుతుంది వేదం.
|
|