Site‎ > ‎Site Updates‎ > ‎

జగత్కారణ తత్త్వం ఒకటే - అది విశిష్ట అద్వైతము(2వ ఖండము - 1వ మంత్రము) article added

posted 12 Jun 2016, 23:07 by Shashi-Kiran Rao S


ప్రమిదను చూస్తే దాంట్లో మట్టి మారలేదు, మట్టి యొక్క ఆకృతి మారింది. దాని అవస్థ మారింది. రూపాంతరం చెందింది. రూపం మారగానే పేరు మారింది. దానితో చేసే పని మారింది. కొత్త ద్రవ్యము ఏర్పడలేదు కేవలం అవస్థ మారింది- 'అవస్థ అంతర ఆపత్తి' అంటారు. అందుకే ఈ ప్రపంచం ఈవేళ ఇన్ని రూపాల్లో ఉన్నా ఇన్ని పేర్లతో ఉన్నా వీటన్నింటికీ కారణం ఒకటే 'సత్'. మరి దానికీ బహుత్వం ఉన్నదా ? అంటే 'ఏకమేవ' ఏకావస్థనే పొంది ఉన్నది. మనం విడదీసి ఈ రూపం దీనిది, ఈ పని దీనిది, ఈ పేరు దీనిది అని చెప్పే అవకాశం లేని దశలో ఉన్నది. నామ రూప విభాగానికి అర్హము కానిదై ఉన్నది. 

read more 

Comments