Site‎ > ‎

Site Updates


Site Updates and Events

 • ఆండాళ్ తల్లి మనకు నేర్పినదేమి ? article added ఎలా పాడాలో, ఎట్లా పాడాలో, నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ.  ప్రేమతో చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవ్వరికి నచ్చదు. "ప్రకటం విధాతుమ్", అందుకోసమే బుజ్జగించి అందరికి ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ. చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి. మనిషి పాటలో పరవసిస్తాడు. ఇలా చేయండి అని ఆండాళ ...
  Posted 23 Nov 2016, 15:14 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వం ఒకటే - అది విశిష్ట అద్వైతము(2వ ఖండము - 1వ మంత్రము) article added ప్రమిదను చూస్తే దాంట్లో మట్టి మారలేదు, మట్టి యొక్క ఆకృతి మారింది. దాని అవస్థ మారింది. రూపాంతరం చెందింది. రూపం మారగానే పేరు మారింది. దానితో చేసే పని మారింది. కొత్త ద్రవ్యము ఏర్పడలేదు కేవలం అవస్థ మారింది- 'అవస్థ అంతర ఆపత్తి' అంటారు. అందుకే ఈ ప్రపంచం ఈవేళ ఇన్ని రూపాల్లో ఉన్నా ఇన్ని పేర్లతో ఉన్నా వీటన్నింటికీ కారణం ఒకటే 'సత్'. మరి దానికీ బహుత ...
  Posted 12 Jun 2016, 23:07 by Shashi-Kiran Rao S
 • ఈ ప్రపంచం శూన్యం నుండి ఏర్పడలేదు(2వ ఖండము - 1వ మంత్రము) article added     'ఇదమ్',ఈ కనిపించే ప్రపంచం అంతా, 'అగ్ర' పూర్వ దశలో  'సత్-ఏవ'  ఉండే ఉన్నది. మొదట చెప్పుకున్నట్లు మట్టి ఎలాగైతో కుండలుగా, ప్రమిదలుగా ఇలా రకరకాల ఎట్లా అయితే మారుతూ వచ్చిందో, అట్లానే ఈ కనిపించే ప్రపంచం ఇలా ఈ రూపం తీర్చి దిద్దుకోవడానికి ముందు 'సత్' అయి ఉన్నది. అంటే శూన్యం నుండి ఏర్పడలేదు ఈ ప్రపంచం. 'అస్తి ఇది సత్', అంటే శూన్యం నుండి ఇదేది రాలేదు, ఇదివరకు కూడ ...
  Posted 10 Jun 2016, 20:33 by Shashi-Kiran Rao S
 • 'సత్' యొక్క విస్తరించిన రూపమే ఈ ప్రపంచం(2వ ఖండము - 1వ మంత్రము) article added             ఈ చూసే ప్రపంచం లేని శూన్యం నుండి వచ్చేది కాదు అనేది వైదిక సిద్ధాంతం. మిరప గింజ వేస్తే మిరప చెట్టేకదా వస్తుంది, మరొక చెట్టు రావడం లేదు కదా! లేనివి ఏవో కొత్త తొత్తవి రావడం లేదు. ఉన్నవే వస్తున్నాయి. అంతటి పెద్ద వృక్షం కూడా గింజలొ ఇమిడి ఉంది కానీ కనిపించని దశలో ఉంటుంది. కనిపించని దాన్ని పూర్వ దశ అంటారు, కనిపించే దశని ఉత్తర దశ అ ...
  Posted 9 Jun 2016, 23:18 by Shashi-Kiran Rao S
 • కార్య కారణాలు ఒకటేలా అవుతాయి ?(1వ ఖండము - 7వ మంత్రము) article added     కారణమొక్కటి తెలిస్తే కార్యాలన్నీ తెలుస్తాయి. ఆ కారణ తత్త్వాన్ని కనుక తలచినట్లయితే సర్వాన్ని తలచినట్లే అవుతుంది. ఆ ఒక్కడిని ఉపాసన చేస్తే మొత్తం సర్వాన్ని ఉపాసించినట్లే అవుతుంది అని తండ్రి చెప్పాడు. పిల్లవాడికి సందేహం వచ్చింది. మట్టికి సంబంధించిన జ్ఞానం వేరు, కుండకి సంబంధించిన జ్ఞానం వేరు. మట్టి అనేది మృత్వముతో గోచర ...
  Posted 20 May 2016, 06:39 by Shashi-Kiran Rao S
 • కారణం తెలిస్తే కార్యాలన్నీ తెలిసినట్లే (1వ ఖండము-4,5,6వ మంత్రములు) article added     'ఏకేన మృత్పిణ్డేన' ఒక మట్టి ముద్దని గురించి తెలుసుకుంటే దాని ద్వారా తయారయ్యే ఏ వస్తువునైనా గుర్తించగలుగుతున్నాము. మట్టితో చేసేవి ఎన్నో వస్తువులు ఉంటాయి. బొమ్మలు, ప్రమిదలు, పెంకులు, కుండలు, కూజాల వంటి రకరకాల పరికరాలని తయారు చేస్తుంటారు. ఇవన్నీ మట్టి యొక్క వికారములే కనుక మట్టితో చేసినవి అని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకే వస్తువ ...
  Posted 19 May 2016, 07:22 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వమే "ప్రశాసన కర్త" (1వ ఖండము - 3వ మంత్రము) article added         లోకంలో దేన్ని చూసినా వాటి తయారీకీ అనేక కారణాలు కనిపిస్తుండగా జగత్తు యొక్క కారణం ఒకటెలా అవుతుందని అనిపించింది పిల్లవాడికి. తండ్రి చెప్పిన మాటల ప్రకారం ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్లు ఎలా అవుతుంది అనే సందేహం కలిగింది. అన్నింటినీ శాసించగల జగత్కారణ తత్త్వం గురించి అడిగావా అనేది తండ్రి వేసిన ప్రశ్న కాబోలు అని అనుకున్నాడు. 'ఆద ...
  Posted 14 May 2016, 07:02 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వం ఒకటేనా ? (1వ ఖండము-1,2,3వ మంత్రములు) article ఉద్ధాలకుడు అనే మహానుభావునికి మరియూ తన కుమారుడైన స్వేతకేతుకి మధ్య జరిగే సంభాషణగా సాగుతుంది 'సద్విద్య' అనే ఉపనిషత్ భాగము. స్వేతకేతు అనే పిల్లవాడికి పన్నెండవయేట ఉపనయనాన్ని చేసి గురుకులానికి పంపి విద్యాభ్యాసము చేయించి తిరిగి పిల్లవాడు  ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇంటికి వచ్చిన తరువాత అతను చదివిన చదువుల సారము ఎంతవరకు ఉందో త ...
  Posted 13 May 2016, 08:26 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వాన్ని తెలిపి కర్మ బంధాన్ని తొలగింపజేసేది -'సద్విద్య' article added మానవజన్మ లభించినప్పుడు దేన్ని తెలుసుకుంటే జన్మ సఫలం అయ్యి మనకి లభించాల్సిన దాన్ని లభింపజేస్తుందో దాన్ని ‘వేదాంతం’ అని అంటారు. వేదాంతం అనగానే ఈ జగమూ ఈ బ్రతుకూ అన్నీ మాయ అని చెప్పేది కాదు. వేదాంతం అంటే దేన్ని తెలుసుకొని దేన్ని ఆచరించి జీవించినట్లయితే దేహం చాలించిన తరువాత లభించాల్సిన ఉత్తమ పురుషార్థము లభిస్తుందో దాన్ని త ...
  Posted 9 May 2016, 22:34 by Shashi-Kiran Rao S
 • సామవేద పురుషుడి కిరీటము - 'సద్విద్య' article added  సామవేద అంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని ఒక భాగమైన 'సద్విద్య' గురించి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భగవద్గీతలో తన విభూతిని వివరించే పదవ అధ్యాయంలో తనను గురించి తాను చెబుతూ, "వేదానామ్ సామ వేదోస్మి", తాను సామ వేదాన్ని అని సూచించాడు. కారణం అది వినడానికి శ్రావ్యముగా గాన రూపమై ఉంటుంది. జ్ఞానం ఉండాలి అనే నియమం ల ...
  Posted 5 May 2016, 21:59 by Shashi-Kiran Rao S
 • ఉపనిషత్తుల పరిచయం article added ఉపనిషత్తులు ప్రతి వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ప్రధానంగా ఒక పది మరియూ మరొక నాలుగు ఉపనిషత్తులు మొత్తం పద్నాలుగు ఉపనిషత్తులని వేదాంతం అని చెప్పవచ్చు. ఇవన్నీ మన పూర్వ ఆచార్యులైన ఆదిశంకరాచార్య, రామానుజాచార్య మరియూ మద్వాచార్యులచే అంగీకరించబడినవి. అందుకే వారు అందించిన దర్శనాలను వేదాంత సిద్దాంతాలు అని చెబుతార ...
  Posted 3 May 2016, 22:50 by Shashi-Kiran Rao S
 • నశించని ఆనందాన్ని లభింపజేసేది వేదం article added  మనిషికి తెలివిని దానికి అనుగుణమైన ఆచరణని అందించింది వేదం. పొందాల్సిన వాటిల్లో ఏది అన్నింటికంటే గొప్పదో దానిని పొందించే సాధనము కూడా వేదమే. 'విదుల్ లాభే' అనే మరొక ధాతువు ద్వారా కూడా వేదం అనే పదం ఏర్పడింది. అంటే లభించాల్సిన వాటిల్లో అతి విలువైనవేవో వాటిని తెలుపుతుంది వేదం. విలువైనవి అంటే ఏవి ఆనందాన్ని ఇవ్వగలవో అవి విలువైనవి. ఆ ...
  Posted 21 Apr 2016, 21:52 by Shashi-Kiran Rao S
 • వేదం తెలియజేసేది అపారము article added ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న "గాడ్ ఎలిమెన్ట్" ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ  శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ "అణోరణీయాన్ మహతోమహీయాన్" అని కఠోపనిషద్ చెబుతుంది. ఏది అతి సూక్ష్మమైనదని దర్శించగలుగుతావో దానికి కూడా కారణమై లోన ఉండ ...
  Posted 20 Apr 2016, 08:34 by Shashi-Kiran Rao S
 • అన్నివిషయాలని సమగ్రంగా అందించగలిగినది వేదం మాత్రమే article added లోకంలో ప్రసిద్ధి కొన్నింటికి కొన్ని కొన్ని కారణాల చేత ఏర్పడుతుంది. అన్నింటికీ అన్ని రకాలైన ప్రాచుర్యం ఏర్పడదు. ఒక్కోదానికి దానిలో ఉన్న గుణాలని బట్టి విలువ అనేది ఏర్పడుతుంది. వ్యాపించిన దానిలో ఆకాశాన్ని మించినది లేదు కనుక దానికి ప్రసిద్ధి అట్లా ఏర్పడుతుంది. మామిడి పండుని దాని రుచిని బట్టి గొప్పదనం. సింహానికి ద ...
  Posted 19 Apr 2016, 07:31 by Shashi-Kiran Rao S
 • విశ్వజనీనమైనది వేదం article added మనిషి, జంతువులు, పక్షులు లేక ఏ ఇతర ప్రాణి కోటి అయినా ఎదగాలి. అంటే మిగతా ప్రాణికోటి అంతా శారీరకంగా పెరగాలి అని కోరుకుంటాయి కానీ మనంజ్ఞానపరంగా కూడా పెరగాలి అని కోరుకుంటాం. శారీరక పెరుగుదల, ఆర్థికంగాపెరుగుదల, భౌతికమైన సంపదల పెరుగుదలతో పాటు మనుష్యులమైనందుకువిలక్షణమైన జ్ఞానం కూడా వికసించాలి. జ్ఞాన వికాసాన్ని కోర ...
  Posted 18 Apr 2016, 00:25 by Shashi-Kiran Rao S
 • "విష్ణుసహస్రనామ అర్థాలు క్లుప్తముగా" article added శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం రామనామాన్ని తెలుపుతూమృతసంజీవినిని ఇస్తుంది. ఎన్ని కష్టాలైనా నీకోసం నేను పడతా అని కూర్మరూపాన్నిదాల్చి చూపాడు స్వామి. పైన పర్వతాన్ని మోస్తూ, అటు రాక్షసులకి బలాన్ని ఇస్తూ,ఇటు దేవతలకి బలాన్ని ఇస్తూ, మధ్యన చుట్టిన పాముకి బలాన్ని ఇస్తూ అమృతాన్నిపుట్టించాడు. తన ఉపకారాన్ని వాడుకుంటే అంతకన్నా న ...
  Posted 22 Feb 2015, 07:50 by Shashi-Kiran Rao S
 • "శ్రీవిష్ణు సహస్రనామ ధ్యానము" article added మనం స్వామిని పరిమితమైన మనిషిగా భావిస్తున్నాం కానీ గుర్తుపెట్టుకోవాల్సినది విశ్వమంతా భగవంతుడే నిండి ఉంటాడనే విషయం. మనం భావించే, కల్పించే ఆకృతులు చాలా పరిమితమైనవి. ఇన్ని ఆకృతులు కలిగి, వీటికి అతీతముగా ఉంటాడు కనుక మనం భగవంతుణ్ణి భావించేటప్పుడు చిన్ని చిన్ని రూపాలకు పరిమితం చేయకూడదు. ఎక్కడెక్కడ కాలుపెట్టే అవకాశం ఉంటుందో అద ...
  Posted 15 Feb 2015, 00:54 by Shashi-Kiran Rao S
 • "శ్రీవిష్ణు సహస్రనామ ఉపోద్ఘాతము" article added శ్రీకృష్ణుడు పాండవులని ధర్మ సంశయాలని తెలుసుకోమని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు. ఏది సర్వోత్కృష్టమయిన తత్త్వము ? దేన్ని ఉత్తమమయిన ఫలముగా పొందవచ్చు ? దేన్ని స్తుతిస్తే, దేన్ని అర్చిస్తే అన్ని శుభాలు కలుగుతాయి ? నీవు దేనిని అతి ఉత్తమమని అనుకుంటున్నావో దాన్ని నాకు చెప్పమని ధర్మరాజు భీష్మపితామహుడిని అడిగాడు. ఈ ప్రపంచంల ...
  Posted 7 Feb 2015, 10:35 by Shashi-Kiran Rao S
 • Maps - వైష్ణవ దివ్యదేశాలు updated Maps - వైష్ణవ దివ్యదేశాలు updated at Maps - వైష్ణవ దివ్యదేశాలుఆంధ్ర దివ్యదేశాలు ( 2 )శీర్గాళి దివ్య దేశాలు(16)తిరుచ్చిరాపల్లి దివ్యదేశాలు ( 8 )తిరునేల్వేలి దివ్యదేశాలు (10) కంచి దివ్యదేశాలు (15)మాయవరం-దివ్యదేశాలు(4)నాగపట్టణం దివ్య దేశాలు (3)రామనాథపురం-పుదుకోటై దివ్య దేశాలు(3)  చెన్నై దివ్యదేశాలు(7)      కుంబకోణం దివ ...
  Posted 30 Jul 2014, 00:53 by Shashi-Kiran Rao S
 • వేదం చేసే మహోపకారం article added in ఉపనిషత్తులు ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పగలిగే అలౌకికమైన శబ్దరాశి వేదం. వేదాన్ని శబ్దం అంటున్నాం కనుక ప్రత్యక్షంలో మనం గుర్తించే శబ్దం వంటిది కాదు అని గుర్తించాలి. వైదికమైన శబ్దరాశి ఇప్పుడు ఎట్లా వింటున్నామో లక్షల సంవత్సరాల క్రితమూ అట్లానే ఉండేది. ఇప్పుడు వేదాన్ని ఉచ్చరించే వాళ్ళు వాళ్ళ పూర్వుల ద్వార విని నేర్చుకున్నారు. వ ...
  Posted 25 May 2014, 18:10 by Shashi-Kiran Rao S
 • "ఆసురి ప్రవృత్తులని తొలగించటమే పరమాత్మ లక్ష్యం" article added in ఉపనిషత్తులు బ్రహ్మ తత్వాన్ని తెలుసు కోవడం ఎంత కష్టమో, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించటమే చాలా కష్టమైన పని. మన చెవులు వింటున్నట్లే ఉంటాయి కానీ వినవు. కళ్ళు చూస్తున్నట్లే ఉంటాయి కానీ చూడవు. ఆలయంలో దేవున్ని దర్శించుకున్న తరువాత దేవునికి చేసిన అలంకారం చూసామా అంటే ఏమీ గుర్తుకు రాదు. చూసినది చూసినట్లే వదిలి పెడుతుంటాం. మనలో శ్రద్ధ అన ...
  Posted 14 Jun 2013, 19:00 by Shashi-Kiran Rao S
 • "గోదా కళ్యాణం" article added సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎంద ...
  Posted 22 Jan 2013, 18:43 by Shashi-Kiran Rao S
 • సందేహాలు-సమాధానాలు "ఆచారాలు","సంప్రదాయం" section updated జై శ్రీమన్నారాయణ స్వామీజీ! బద్రీనాథ్ వంటి ప్రదేశాల్లో పెద్దలకి పిండ ప్రధానం చేస్తే ఇక ఎప్పుడూ చేయవలసిన అవసరం ఉండదా ?  జై శ్రీమన్నారాయణ స్వామీజీ! సాధారణంగా మగపిల్లలే కర్మ చేస్తారు. ఆడపిల్లలు ఉన్న వారికి ఎట్లా సరిపడుతుంది ? ఎందుకు ఆడపిల్లలకి కర్మచేసే అవకాశం లేదు. ? read more at  ఆచారాలు  updated in section సందేహాలు-సమాధానాలు మనం పరమపదనాథుణ్ణి శ్రీభూన ...
  Posted 7 Sep 2012, 18:06 by Shashi-Kiran Rao S
 • "శ్రీకేశవ స్వామి దేవాలయం, కోతలపర్రు, పశ్చిమగోదావరి జిల్లా" pictures added   శ్రీకేశవ స్వామి దేవాలయం, కోతలపర్రు, పశ్చిమగోదావరి జిల్లా photos and information added in section  వైష్ణవ ఆలయాలు                 
  Posted 6 Sep 2012, 21:31 by Shashi-Kiran Rao S
 • "అమృతత్త్వాన్ని ఇవ్వగలిగే మానవజన్మని వృదా చేసుకుంటే జరిగే నష్టం అపారం" article added భగవత్ తత్త్వాన్ని కనుక గుర్తించక మనం వెళ్ళిపోతే చాలా నష్టాన్ని పొందిన వాళ్ళమవుతాం. మానవ జన్మలోకి రావడానికి ఉన్న ప్రయోజనమే భగవంతుణ్ణి గుర్తించటం. మనం భగవంతునికి దాసులం, మనకందరికి వెనకాతల ఉండి నడిపే దివ్య శక్తి ఆయన. ఇంద్రియాదులన్నీ మనకి లభించాయంటే అవి మనకు సకరించటానికి. భగవంతుడిచ్చిన మానవ శరీరాన్ని చక్కగ వాడుకుంటూ, అనుభవాలకై ఇచ్చిన భ ...
  Posted 22 Aug 2012, 19:49 by Shashi-Kiran Rao S
 • "పరమాత్మ తత్త్వాన్ని పరిపూర్ణంగా గుర్తించలేము" article added భగవంతుని గురించి ఎవరికి ఎంతేంత తెలిస్తే అది దాని చివరి హద్దు కాదు. కొంత వరకు తెలుసునని చెప్పడంలో సందేహం లేదు. "నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేదచ",  భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలియదు కానీ అసలు ఏమీ తెలియలేదు అని కూడా కాదు. అంటే భగవంతుడు ఇంత హద్దు పెట్టి తెలుసుకోతగిన వాడు కాదు. "యో న స్తద్వేద తద్వేద నో న వేదేతి వేదచ ...
  Posted 22 Aug 2012, 19:30 by Shashi-Kiran Rao S
 • "పరమాత్మ తత్త్వం అపరిచిన్నమైనది" article added "యది మన్యసే సువేదేతి" భగవంతుని గురించి విన్న వారికి భగవంతుడి గురించి తెలిసిపోయింది అనిపించిందంటే ఏమీ తెలియలేదని అర్థం. భగవంతుడి గురించి తెలియలేదంటే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. "దహరమేవా", ఎంత తెలుసునూ అనుకున్న వాడికి కూడా ఆ తెలిసింది కొంచం మాత్రమే అని గుర్తించు. భగవంతునిలో అనేక అంశలు ఉన్నాయి, సముద్రంలో ఒక నీటి బిందువ ...
  Posted 21 Aug 2012, 10:43 by Shashi-Kiran Rao S
 • "పరమాత్మ తత్త్వాన్ని గుర్తించగలిగేది పూర్వుల ఉపదేశం ద్వారానే" article added మన జ్ఞానేంద్రియాలు కానీ, మన కర్మేంద్రియాలు కానీ, వాటిని నడిపించే మనస్సు కానీ, ఆ మనస్సుతోపాటు సాగే ప్రాణం గానీ, వాటికి లభించే బలం కానీ, ఇవన్నీ ఆ లోపల ఉండే పరమాత్మ చేతనే ప్రేరేపితములవుతున్నాయి. సంకల్పం తానే చేస్తాడు, ప్రేరేపణ తానే చేస్తాడు, ప్రయోజనమూ తానే పొందుతానంటాడు కానీ దాన్ని అందించక మనం అహంకారగ్రస్తులమై పాడైప ...
  Posted 19 Aug 2012, 22:38 by Shashi-Kiran Rao S
 • "పరమాత్మ తత్త్వం అనేది ఇంద్రియాదులతో గుర్తించ వీలుకానిది" article added సూర్యుడు తేజస్సునిచ్చేవాడు, సూర్యుని వల్ల తేజస్సు పొందుతుంది అగ్ని. రాత్రి పూట అగ్ని ద్వారా మనం సూర్యుణ్ణి చూస్తాను అంటే అది తెలివితక్కువ తనం. అట్లా ఈ ఇంద్రియమనఃప్రాణాదుల కంటే అతిరిక్తమై వీటికి ప్రేరకుడైన పరమాత్మని వీటిచే గుర్తిస్తాం అని అనుకోవడం అంతే తెలివి తక్కువ తనం. పరమాత్మ తత్త్వం వీటన్నింటికంటే వ ...
  Posted 19 Aug 2012, 08:17 by Shashi-Kiran Rao S
 • "అన్నింటినీ నియంత్రించే పరమాత్మని గుర్తించు" Article added మనలోని ఇంద్రియ ప్రాణాదులు పనిచేస్తున్నాయి, కానీ అవి మనం చెప్పినట్లు కాదు. పని చేయగలుగుతున్నాయి అంటే వెనకాతల చైతన్యం కలిగిన దాని వల్లే. అట్లా లోకంలో చైతన్యం కలవి జీవాత్మ లేదా పరమాత్మ. అంటే పరమాత్మ వళ్ళే పని చేస్తున్నాయి అంటే తత్ ఫలితం కూడా పరమాత్మే అనుభవించాలి. అట్లా అనుభవించే వాడు పరమాత్మే కానీ దాన్ని మనం గుర్తిస్తే. ప ...
  Posted 18 Aug 2012, 03:44 by Shashi-Kiran Rao S
 • "ఎవడిచేత నడపబడుతోంది ఈ లోకం ?" article added ఇంద్రియప్రాణాదుల బలం వల్ల నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాను కానీ ఏదో భగవంతుని కోసం ఎందుకు ప్రవర్తించాలి అని అనిపిస్తుందే, అలా అనిపించి ఉపనిషత్తుని తిరస్కరించి ఎవడైతే తాను స్వతంత్రగా ప్రవర్తిస్తే, అలాంటివారికి సమాధానం చెబుతాను సుమా అంటూ ఉపనిషత్తు ఎవ్వరూ స్వతంత్రులు కారు అని తెలియజేస్తుంది. అందరూ పరతంత్రులే అని నిర్ణయించి చెబుత ...
  Posted 26 Jun 2012, 07:56 by Shashi-Kiran Rao S
 • మనలోని సకల ప్రవృత్తులు పరమాత్మ కోసం ప్రవర్తించుగాక (శాంతిమంత్రం) article added ఉపనిషత్తుకు ముందు శాంతి మంత్రం ఉంటుంది, అది ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని తెలిపేట్టుగా ఉంటుంది. మనలో ఉండే సకల ప్రవృత్తులు కూడా పరమాత్మ ఆధీనమై ఉంటాయి, పరమాత్మ చేత ప్రవర్తింపజేయబడతాయి. కనుక ఆయన ఎప్పుడూ ఆయన మనల్ని కాపాడుకుండుగాక, మనమెప్పుడూ ఆయన్ని మరచిపోకుండుగాక, ఆయన శాసించే ధర్మాలని మనం అనుష్ఠించేలాగా అగుదుముగాక అని చెబుతుంది ఈ శాంత ...
  Posted 8 Jun 2012, 19:43 by Shashi-Kiran Rao S
 • "విశ్వమంతా భగవంతుని అంశాంశ మాత్రమే - కేనోపనిషద్" article added మనం స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నామా లేదా ఎవరిచేతనైనా నడపబడుతున్నామా ? మనం అంటే ఈ లోకంలో ఉండే ప్రాణికోటి అంతా. ఈ లోకమే కాదు ఇతర ఏలోకాల్లోనైనా ఉన్న ప్రాణికోటి అంతా. వీళ్ళందరికి వెనకాతల ఉండే నియామకుడు లేదా నియంత ఎవరు? దేవుడు అని అంగీకరించటం ఎదుకు, ఏదో నామాన బ్రతుకుతున్నాను అని అనుకుంటుంటారు కొందరు. అందుకే ఈ ఉపనిష్త్తు మ ...
  Posted 6 Jun 2012, 08:42 by Shashi-Kiran Rao S
 • "ఓం నమః పరమ ఋషిభ్యః " article added పరిశోదన అంటే దాని మీదే ఆలోచిస్తూ, దానిమీదే తపన చేందుతూ దానికి సంబంధించిన విషయాలనే సేకరిస్తూ ఉండటమే కదా, దీనినే సంస్కృతంలో తపస్సు అని పేరు పెట్టారు. తప సంతాపే తప ఆలోచనే అనే రెండు ధాతువులు సంస్కృతంలో ఉన్నాయి. తపస్సు అంటే సతతమూ ఆలోచన చేయుట. అంతే కాదు ఇతరమైన అలోచనలని, విలాసాలని సంకోచింపజేసుకొనుట. దీన్నే మనం ఈనాడు రీసర్చ్ అంటుంట ...
  Posted 26 May 2012, 20:49 by Shashi-Kiran Rao S
 • వేదంలోని జ్ఞాన భాగమే ఉపనిషత్తులు article updated శరీరానికి సుఖాన్ని కలిగించేవి రకరకాలుగా ఉన్నాయి వాటిని రకరకాలుగా సంపాధించే ప్రయత్నం చేసినా ఈ లోపల ఉండే మనల్ని గురించి తెలిస్తే తప్ప వీటిని ఎట్లా వాడుకోవాలో తెలియదు కనుక ముందు దాన్ని తెలుసుకోమని ఉపనిషత్తులు మనకి ఉపదేశం చేస్తాయి. లక్ష్యం తెలిస్తే కదా మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మనకి తెలుస్తుంది. శరీరం కంటే ప్రాధాన ...
  Posted 25 May 2012, 18:00 by Shashi-Kiran Rao S
 • ఆత్మ సుఖాన్ని తెలిపే వేద భాగమే ఉపనిషత్తులు article added మనిషి బుద్ధి జీవి, ఇతర జీవులు శక్తికలవి అయినా మనిషివలె బుద్ధిని వాడుకోలేవు. అట్లా ఇతర ప్రాణులని జయించి బ్రతికే మనిషి, ఈ శరీరాన్ని కూడా జయించి బ్రతకగలడు కానీ దానికి లొంగి బ్రతుకుతున్నాడు. ఇది మనిషి పుట్టుకతోనే ఏర్పడ్డ లోపం. శరీరం వరకు వచ్చెటప్పటికి దీనికి లొంగిపోతుంటాడు, ఎందుకంటే శరీరం అనేది అతిదగ్గరది కనుక. శరీరం వరకు వచ్చేప్పుడు అది చ ...
  Posted 11 May 2012, 19:39 by Shashi-Kiran Rao S
 • "జగద్గురువు - శ్రీరామానుజాచార్య స్వామి" article updated ఏదైనా ఒక ప్రదేశానికి విమానంలో వెళ్ళాలి అనుకుంటే మనమే విమానం నడపాల్సిన అవసరం లేదు, ఆ విమానాన్ని నడిపే వ్యక్తిని కనుక ఆశ్రయించినట్లయితే ఏ శ్రమాలేకుండా ఆ ప్రదేశానికి చేరగలిగినట్లుగానే మనం కూడా మనకుండే ఆచార్య భక్తిచేత మన లక్ష్యమైన పరమాత్మని చేరగలం. కేవలం మన సంప్రదాయమే కాదు అన్నిసంప్రదాయాలకు, అంటే వైదికమైన సంప్రదాయాలే కాద ...
  Posted 16 Feb 2012, 16:34 by Shashi-Kiran Rao S
 • కాలాగణనంతోపాటు మనం వర్తమానాన్ని సంస్కరించుకోగలగాలి article added కాలం అనంతము. మనం నేలని విడదీసినట్లు కాలాన్నివిడదీయలేము. అవిచ్చిన్నంగా నిరంతరమూ సాగేది కాలం అంటే. మనం ఎలాంటి మహానుబావుల దగ్గర  ఉపకారము పొందుతామో వాళ్ళని బట్టి మనము కాలాన్ని లెక్క పెట్టుకోవడం చేస్తుంటాం. సముద్రంలో ఎన్నో రకాల వస్తువులు వుంటాయి ఐతే అన్ని మనకు అవసరము వుండకపోవచ్చు, మనకు అవసరమయ్యేవి ఎక్కడ వుంటాయో అక్కడ  నుండి మనం ఉపయోగించుకొనే ప్రయత ...
  Posted 3 Jan 2012, 21:55 by Shashi-Kiran Rao S
 • రకరకాల విశ్వాసాలకి కారణం భగవంతునికి మనకి మధ్య ఉన్న బాంధవ్యం తెలియకనే article added తనకు సంబంధం కలిగినది ఉన్నది అన్న జ్ఞానాన్ని బాంధవ్యం అంటారు. ఈ భాందవ్యం తెలియకనే దొరికిన దాన్ని పట్టుకుంటున్నారు. లోకంలో ఇన్ని రకాల దేవతలని పూజిస్తున్నారు, ఇన్ని రకాల విశ్వాసాలు ఏర్పడటానికి కారణం భహుషా భగవంతునికి మనకి మధ్య ఉన్న బాంధవ్యం తెలియకనే. సముద్రంలో పడి కొట్టుకుంటున్న వాడికి గడ్డి పోచ దొరికినా పట్టుకుంటాడు. అద ...
  Posted 14 Dec 2011, 16:00 by Shashi-Kiran Rao S
 • మంత్రంతో సాధన కేవలం భగవంతునియందు మనస్సుని నిలపడానికి మాత్రమే article added ధ్యానం అంటే మనస్సుని మంచిగా ఆనందంగా పని చేయించడం. కానీ శూన్యంలోకి తీసుకు పోవడం కాదు. మనస్సుని నిర్విషయకం చేయడం అంటే మనస్సు చచ్చి పోయిందనే అర్థం. సాధన చేయడం ఆ మంత్రం తెలిపే భగవంతుని యందు నిలకడకి మంత్రం తప్ప మిగతా అల్పమైన విషయాలకై కాదు. సాధన మంత్రం, సాధ్యం ఆ భగవంతుడే అయినా సాధన మరియూ సాధ్యం రెండూ భగవందుడే అని మన పూర్వాచార్యుల ...
  Posted 9 Nov 2011, 17:52 by Shashi-Kiran Rao S
 • ద్వయమంత్రంలోని ఒక్కో పదం తెలిపేదేమిటి ? article added "అధిగత నిగమః", సఖల వేద సారమైనది ఈ మంత్రం. "షట్పదో యం ద్విఖణ్డః", ద్వయమంత్రం ఆరు పదాలు కలిగి ఉంటుంది. "శ్రీమన్నారాయణచరణౌ", "శరణం", "ప్రపద్యే", "శ్రీమతే", "నారాయణాయ" మరియూ "నమః" అనే ఆరు పదాలు. ఈ ఆరు పదాలు కలిసి ఏర్పడ్డ ఈ మంత్రం, రెండు భాగాలు అంటే "శ్రీమన్నారాయణచరణౌ శరణం ప్రపద్యే" మరియూ "శ్రీమతే నారాయణాయ నమః" అనే వ్యాఖ్యాలతో ఉంది కనుక ద్వయం అని పేరు. ఏమిటి ఈ మంత్రం చేస ...
  Posted 1 Nov 2011, 19:43 by Shashi-Kiran Rao S
 • పరిమళ భరితమైన ద్వయమంత్రం article added కొన్ని మంత్రాలు మంచి రుచి, చక్కని పరిమళం కలిగి ఉంటాయి. అయితే రుచి పరిమళాన్ని మనం వాస్తవికంగా గుర్తించగలగాలి. అది ఎలా ? రుచి అంటే మనం ఎన్ని సార్లు రుచి చూసినా విసుగు లేకుండా పదే పదే రుచి చూడాలని అనిపించాలి. మంచి వాసన అంటే ఆస్వాదిస్తుంటే అన్నింటినీ మరచిపోవాలి. ఇది ప్రాపంచిక విషయాల్లో కొంత హద్దు ఉంటుంది. మిఠాయి తింటామనుకోండి, ఎంత ...
  Posted 31 Oct 2011, 19:40 by Shashi-Kiran Rao S
 • పూర్వాచార్యులు ద్వయమంత్రాన్ని ఆస్వాదించిన తీరు article added ద్వయమంత్రాన్ని పదే పదే తలుస్తూ జీవించాలి అనేది మన పూర్వాచార్యులు చెప్పిన విషయం. రామానుజాచార్య శరణాగతి గద్యంలో "ద్వయం అర్థానుసంధానేన సహ సదా ఏవం" అని చెప్పారు. మనకు ఏదైనా సమయం దొరికింది అంటే ద్వయమంత్రాన్ని స్మరించాలి అని చెబుతారు. మన పూర్వాచార్యులైన మణవాళ మహామునులు సంప్రదాయ పరిరక్షణ చేసిన మహనీయులు. వారి ఆచరణ పరమ ప్రామ ...
  Posted 30 Oct 2011, 19:50 by Shashi-Kiran Rao S
 • ద్వయమంత్రం విస్తరించిన క్రమం article added   మొదట అకారం, అకారం నుండి 'అ', 'ఉ' మరియూ 'మ'లు అంటే ఓంకారం వెలువడింది. అకారాన్ని వివరించటానికి నారాయణ పదం, ఉకారాన్ని వివరించటానికి నమః పదం, మకారాన్ని వివరించటానికి ఆయ పదం వచ్చింది. ఓంకారాన్ని వివరిస్తూ వచ్చిన మూడు పదాలు ఓంకారంతో కలిస్తే అది అష్టాక్షరి మంత్రం అయ్యింది. అట్లానే నారాయణ పదాన్ని స్పష్టంగా గోచరింపజేయటానికి "శ్రీమన్నారాయణ ...
  Posted 24 Oct 2011, 17:59 by Shashi-Kiran Rao S
 • శ్రీలక్ష్మీ పూజా విధానము added దీపావళి-శ్రీసూక్త నామావళితో లక్ష్మీపూజా విధానం added in తిరువారాధన విధానము
  Posted 23 Oct 2011, 20:44 by Shashi-Kiran Rao S
 • వైష్ణవ ఆలయాలు-శ్రీరంగనాథ స్వామి దేవాలయం, రంగస్థళ, కోలార్ జిల్లా pictures added శ్రీరంగనాథ స్వామి దేవాలయం, రంగస్థళ, కోలార్ జిల్లా pictures added in వైష్ణవ ఆలయాలు
  Posted 10 Sep 2011, 22:02 by Shashi-Kiran Rao S
 • వైష్ణవ ఆలయాలు- నంబి నారాయణ స్వామి ఆలయం, తొండనూర్, మండ్య జిల్లా article added రామానుజులవారు కేవలం మత ప్రవక్తలు మాత్రమే కాదు సామాజిక శ్రేయో విధాతలూనూ! అక్కడి ప్రజలు సాగు నీటికోసం త్రాగు నీటి కోసం పడే పాట్లు చూసి ఆ ప్రాంతం సర్వ సమృద్ధంగా ఉండాలని అక్కడ ఒక జలాశయం నిర్మింప సంకల్పించి విష్ణువర్ధనుడిచేతా జలాశయ నిర్మాణం కావింపజేసారు. జలాశయ నిర్మాణానికి కావలసిన స్థల నిర్దేశం, పరిమాణ నిరూపణ, ద ...
  Posted 16 Aug 2011, 20:03 by Shashi-Kiran Rao S
 • భగవద్గీత- కలియుగ ఉపద్రవాలని ఎదుర్కొనగలిగే సాధనమే భగవద్గీత article added కృష్ణుడు లోకపు వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుందని తెలిసే యుద్ధం చేయించాడు. ఎందుకని?  కలియుగం ఎంతెంత పెరుగుతుంటే మనుషుల్లో శక్తి క్షీణిస్తుంది. నియమాలు నిష్ఠలు అదే స్థాయిలో దిగజారుతాయి. ఇది తప్పదు, కాల ప్రభావం చేత గడిచేదే. చెట్ల ఆకులు వసంత ఋతువులో వస్తాయి, అవే శీతాకాలంలో రాలి పోతుంటాయి, ఇది ప్రకృతి నియమం. ఇది మార్చతగినది కాదు. ద ...
  Posted 11 Aug 2011, 18:25 by Shashi-Kiran Rao S
 • రహస్య త్రయం - చరమ శ్లోక ఉపదేశం article updated అవతారాల్లో చివరిగా వచ్చిన శ్రీకృష్ణ అవతారం చరమశ్లోక ఉపదేశం కోసమే. చరమ శ్లోకాన్ని ఇవ్వడానికే ముందర వెనకాతల పెద్ద రంగాన్ని సిద్ధం చేసి మొత్తం భగవద్గీతని అందించాడు. మనకి మంచి పండు కావాలంటే అది ఆకాశంలోంచి ఊడిపడదెప్పుడూనూ, దానికి ముందర చిన్న చెట్టుకావాలి, అది పెరిగి వృక్షం అవ్వాలి, అప్పుడు కాయ కాయాలి, దాన్ని రక్షించుక ...
  Posted 8 Aug 2011, 18:57 by Shashi-Kiran Rao S
 • రహస్య త్రయం- మనల్ని తరింపజేయాలని భగవంతుడు చేసిన కృషీ ఫలితమే ఈ మూడు మంత్రాలు article added మనకి జ్ఞానం కలిగిద్దాం అనే ఎన్నో సార్లు ఈ లోకంలోకి వచ్చాడు. విపరీతమైన కృషిని చేసాడు. ఎన్నో తాను తాను ఉపదేశించాడు, ఎన్నో తాను ఆచరించాడు, ఎన్నో ఇతరులచే ఉపదేశింపజేసాడు. ఇంతమంది ఇలాగా ఈ చక్రంలో పడి తిరుగుతూనే ఉన్నాం అంటే లోపం ఆయనలో లేదు, మనం ఆయన్ని పట్టించుకోకపోవడమే కారణం. విసుగులేని రైతులాగా ఒక యేడాది వానలేక పోయినా, ఒక యేడాది వాన ఎక్క ...
  Posted 6 Aug 2011, 19:10 by Shashi-Kiran Rao S
Showing posts 1 - 50 of 310. View more »

Recent Announcements

Showing posts 1 - 20 of 36. View more »