Site‎ > ‎

Site Updates

Recent Site Activities and Updates

ఆండాళ్ తల్లి మనకు నేర్పినదేమి ? article added

posted 23 Nov 2016, 15:14 by Shashi-Kiran Rao S


ఎలా పాడాలో, ఎట్లా పాడాలో, నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ.  ప్రేమతో చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవ్వరికి నచ్చదు. "ప్రకటం విధాతుమ్", అందుకోసమే బుజ్జగించి అందరికి ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ. చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి. మనిషి పాటలో పరవసిస్తాడు. ఇలా చేయండి అని ఆండాళ్ తల్లి చెప్పలేదెప్పుడూనూ, ఇలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని చేర్చుకుంది. మరి ఏది పడితే అది పాడుతే సరికాదు కదా! మన ఇళ్ళల్లో మురికి నీటి నాళాలు వాడగా వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే, ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనస్సులో మన బుద్ధిలో ఉన్న మాళిన్యాన్ని తొలగించే భగవన్నామ అమృతాన్ని కనుక పోయగలిగితే అవి శుద్ది అవుతాయి. 


జగత్కారణ తత్త్వం ఒకటే - అది విశిష్ట అద్వైతము(2వ ఖండము - 1వ మంత్రము) article added

posted 12 Jun 2016, 23:07 by Shashi-Kiran Rao Sప్రమిదను చూస్తే దాంట్లో మట్టి మారలేదు, మట్టి యొక్క ఆకృతి మారింది. దాని అవస్థ మారింది. రూపాంతరం చెందింది. రూపం మారగానే పేరు మారింది. దానితో చేసే పని మారింది. కొత్త ద్రవ్యము ఏర్పడలేదు కేవలం అవస్థ మారింది- 'అవస్థ అంతర ఆపత్తి' అంటారు. అందుకే ఈ ప్రపంచం ఈవేళ ఇన్ని రూపాల్లో ఉన్నా ఇన్ని పేర్లతో ఉన్నా వీటన్నింటికీ కారణం ఒకటే 'సత్'. మరి దానికీ బహుత్వం ఉన్నదా ? అంటే 'ఏకమేవ' ఏకావస్థనే పొంది ఉన్నది. మనం విడదీసి ఈ రూపం దీనిది, ఈ పని దీనిది, ఈ పేరు దీనిది అని చెప్పే అవకాశం లేని దశలో ఉన్నది. నామ రూప విభాగానికి అర్హము కానిదై ఉన్నది. 

read more 

ఈ ప్రపంచం శూన్యం నుండి ఏర్పడలేదు(2వ ఖండము - 1వ మంత్రము) article added

posted 10 Jun 2016, 20:31 by Shashi-Kiran Rao S   [ updated 10 Jun 2016, 20:33 ]


    'ఇదమ్',ఈ కనిపించే ప్రపంచం అంతా, 'అగ్ర' పూర్వ దశలో  'సత్-ఏవ'  ఉండే ఉన్నది. మొదట చెప్పుకున్నట్లు మట్టి ఎలాగైతో కుండలుగా, ప్రమిదలుగా ఇలా రకరకాల ఎట్లా అయితే మారుతూ వచ్చిందో, అట్లానే ఈ కనిపించే ప్రపంచం ఇలా ఈ రూపం తీర్చి దిద్దుకోవడానికి ముందు 'సత్' అయి ఉన్నది. అంటే శూన్యం నుండి ఏర్పడలేదు ఈ ప్రపంచం. 'అస్తి ఇది సత్', అంటే శూన్యం నుండి ఇదేది రాలేదు, ఇదివరకు కూడా ఇది ఉన్నది. ఆ ఉన్నది అనేది ఒక ప్రమాణానికి గోచరమై ఉంటుంది. దానికి సత్తా ఉన్నది. అంటే ప్రపంచానికి కారణం 'సత్'. అంటే 'ఇదం', ఈ ప్రపంచం మరియూ 'సత్' రెండు వేరు కావు. దీన్నే సత్కార్య వాదము అంటారు. 

Read more@


'సత్' యొక్క విస్తరించిన రూపమే ఈ ప్రపంచం(2వ ఖండము - 1వ మంత్రము) article added

posted 9 Jun 2016, 23:18 by Shashi-Kiran Rao S            ఈ చూసే ప్రపంచం లేని శూన్యం నుండి వచ్చేది కాదు అనేది వైదిక సిద్ధాంతం. మిరప గింజ వేస్తే మిరప చెట్టేకదా వస్తుంది, మరొక చెట్టు రావడం లేదు కదా! లేనివి ఏవో కొత్త తొత్తవి రావడం లేదు. ఉన్నవే వస్తున్నాయి. అంతటి పెద్ద వృక్షం కూడా గింజలొ ఇమిడి ఉంది కానీ కనిపించని దశలో ఉంటుంది. కనిపించని దాన్ని పూర్వ దశ అంటారు, కనిపించే దశని ఉత్తర దశ అంటారు. గింజలో అన్నీ ఉన్నాయి కానీ అవి కనిపించటం లేదు, ఇప్పుడవి వృక్షమై కనిపించే దశలోకి వచ్చాయి. కనుక గింజ చెట్టు వేరు కావు. గింజ కారణం, చెట్టు కార్యం. కార్య కారణాలు రెండూ వేరు కాదు కానీ రెంటి అవస్థ వేరు. ప్రపంచానికి కూడా అంతే. 
Read more @


కార్య కారణాలు ఒకటేలా అవుతాయి ?(1వ ఖండము - 7వ మంత్రము) article added

posted 20 May 2016, 06:39 by Shashi-Kiran Rao S


    కారణమొక్కటి తెలిస్తే కార్యాలన్నీ తెలుస్తాయి. ఆ కారణ తత్త్వాన్ని కనుక తలచినట్లయితే సర్వాన్ని తలచినట్లే అవుతుంది. ఆ ఒక్కడిని ఉపాసన చేస్తే మొత్తం సర్వాన్ని ఉపాసించినట్లే అవుతుంది అని తండ్రి చెప్పాడు. పిల్లవాడికి సందేహం వచ్చింది. మట్టికి సంబంధించిన జ్ఞానం వేరు, కుండకి సంబంధించిన జ్ఞానం వేరు. మట్టి అనేది మృత్వముతో గోచరిస్తుంది, అదే కుండ అనేది ఘటత్వ విశిష్టమై గోచరిస్తుంది. రెండు జ్ఞానాలు వేరు. రెంటికి వాడే శబ్దాలు వేరు. అసలు రెంటి ప్రయోజనాలు వేరు వేరు. కారణాల వల్ల కలిగే ప్రయోజనం కార్యాల వల్ల కలిగే ప్రయోజనాలు వేరు వేరుగా ఉంటాయి. మట్టి ఉండే కాలము వేరు, అది మారి కుండగా అయిన కాలం వేరు. ఆకారం రెంటిదీ వేరు. తండ్రి చెప్పిన మాట ప్రకారం కార్యము కారణం రెండు ఒకటే. అంటే కారణమే కార్యము. ఈ ప్రపంచమునకు కారణమని చెప్పేదేదో అదే ఈ ప్రపంచము కూడా. ప్రపంచానికి మరియూ దీని కారణానికి తేడా లేకుండా ఎట్లా ఉంటుంది ? అలాంటప్పుడు ఒకటి పోతే అన్నీ పోవాలి. ఒకటి నిత్యమయితే అన్నీ నిత్యమవ్వాలి. ఒకటి అనిత్యమవుతే అన్నీ అనిత్యమవ్వాలి. కార్యము కారణము ఒకటే అయితే దాన్ని చేసేవాడు అంటూ ఒకడు ఎందుకు ? బియ్యం పెట్టగానే అన్నం తయారవ్వాలి, వండే వాడెవ్వడూ లేకుండానే. బంగారం ఆభరణం ఒకటే అవుతే ఆభరణాలని మలిచే వాడేందుకు ? కార్యము కారణము ఒకటెలా అవుతాయి అనేది పిల్లవాడి ప్రశ్న. 


కారణం తెలిస్తే కార్యాలన్నీ తెలిసినట్లే (1వ ఖండము-4,5,6వ మంత్రములు) article added

posted 19 May 2016, 07:22 by Shashi-Kiran Rao S


    'ఏకేన మృత్పిణ్డేన' ఒక మట్టి ముద్దని గురించి తెలుసుకుంటే దాని ద్వారా తయారయ్యే ఏ వస్తువునైనా గుర్తించగలుగుతున్నాము. మట్టితో చేసేవి ఎన్నో వస్తువులు ఉంటాయి. బొమ్మలు, ప్రమిదలు, పెంకులు, కుండలు, కూజాల వంటి రకరకాల పరికరాలని తయారు చేస్తుంటారు. ఇవన్నీ మట్టి యొక్క వికారములే కనుక మట్టితో చేసినవి అని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకే వస్తువు వేరే భావనలని కలిగిస్తే దాన్ని 'వివర్తము' అంటారు. అది కాక, ఒకే వస్తువు ఆకారాలు మారితే దాన్ని 'వికారము' అంటారు. "వాచారభణం వికారో నామధేయం", కానీ వాటి ఆకారాలు వేరే అయి ఉండవచ్చు. ఆకారాలు మారితే వాటి వల్ల ఏర్పడే ప్రయోజనమూ మారుతుంటుంది. ఆయా ప్రయోజనాన్ని బట్టి పేరు వచ్చి చేరుతుంటుంది. వ్యవహారంలోకి రావడానికి అలా పేరు ఏర్పడుతున్నప్పటికీ, "మృత్తికేత్యేవ సత్యమ్", మూల ద్రవ్యము మాత్రం మాట్టియే. సత్ అంటే ఒక ప్రమాణమునకి గోచరించునది అని అర్థం.  అట్లా మట్టియే అన్నింటికి మూలమని మనకు తెలుస్తున్నది. 
Read more@


జగత్కారణ తత్త్వమే "ప్రశాసన కర్త" (1వ ఖండము - 3వ మంత్రము) article added

posted 14 May 2016, 07:02 by Shashi-Kiran Rao S


        లోకంలో దేన్ని చూసినా వాటి తయారీకీ అనేక కారణాలు కనిపిస్తుండగా జగత్తు యొక్క కారణం ఒకటెలా అవుతుందని అనిపించింది పిల్లవాడికి. తండ్రి చెప్పిన మాటల ప్రకారం ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్లు ఎలా అవుతుంది అనే సందేహం కలిగింది. అన్నింటినీ శాసించగల జగత్కారణ తత్త్వం గురించి అడిగావా అనేది తండ్రి వేసిన ప్రశ్న కాబోలు అని అనుకున్నాడు. 'ఆదేశం' అంటే ప్రశాస్త, ప్రశాసన కర్త లేదా ఉపదేశం ద్వారా తెలిసే వాడని అర్థమా అని ఆలోచిస్తున్నాడు పిల్లవాడు. 

జగత్కారణ తత్త్వం ఒకటేనా ? (1వ ఖండము-1,2,3వ మంత్రములు) article

posted 13 May 2016, 08:24 by Shashi-Kiran Rao S   [ updated 13 May 2016, 08:26 ]


ఉద్ధాలకుడు అనే మహానుభావునికి మరియూ తన కుమారుడైన స్వేతకేతుకి మధ్య జరిగే సంభాషణగా సాగుతుంది 'సద్విద్య' అనే ఉపనిషత్ భాగము. స్వేతకేతు అనే పిల్లవాడికి పన్నెండవయేట ఉపనయనాన్ని చేసి గురుకులానికి పంపి విద్యాభ్యాసము చేయించి తిరిగి పిల్లవాడు  ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇంటికి వచ్చిన తరువాత అతను చదివిన చదువుల సారము ఎంతవరకు ఉందో తెలుసుకుందాం అని తండ్రి వేసిన ప్రశ్నతో ఆరవ ప్రపాటకము మొదలవుతుంది.


జగత్కారణ తత్త్వాన్ని తెలిపి కర్మ బంధాన్ని తొలగింపజేసేది -'సద్విద్య' article added

posted 9 May 2016, 22:34 by Shashi-Kiran Rao S

మానవజన్మ లభించినప్పుడు దేన్ని తెలుసుకుంటే జన్మ సఫలం అయ్యి మనకి లభించాల్సిన దాన్ని లభింపజేస్తుందో దాన్ని ‘వేదాంతం’ అని అంటారు. వేదాంతం అనగానే ఈ జగమూ ఈ బ్రతుకూ అన్నీ మాయ అని చెప్పేది కాదు. వేదాంతం అంటే దేన్ని తెలుసుకొని దేన్ని ఆచరించి జీవించినట్లయితే దేహం చాలించిన తరువాత లభించాల్సిన ఉత్తమ పురుషార్థము లభిస్తుందో దాన్ని తెలుసుకోవడమే, అది వేదాంత సారము. అవి చెప్పడానికి బయలుదేరినవే ఉపనిషత్తులు.

సామవేద పురుషుడి కిరీటము - 'సద్విద్య' article added

posted 5 May 2016, 21:59 by Shashi-Kiran Rao S   [ updated 5 May 2016, 21:59 ] సామవేద అంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని ఒక భాగమైన 'సద్విద్య' గురించి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భగవద్గీతలో తన విభూతిని వివరించే పదవ అధ్యాయంలో తనను గురించి తాను చెబుతూ, "వేదానామ్ సామ వేదోస్మి", తాను సామ వేదాన్ని అని సూచించాడు. కారణం అది వినడానికి శ్రావ్యముగా గాన రూపమై ఉంటుంది. జ్ఞానం ఉండాలి అనే నియమం లేదు, చెట్లు సైతం గానాన్ని ఆస్వాదిస్తాయి అనేది మనకు తెలిసిన విషయం. గానానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటుంటారు. ఆ వేదానికి ఆయోగ్యత తాను అధిష్టించి ఉండటం చేత ఏర్పడింది. "మమ తేజోంశ సంభవమ్ అవగశ్చ", ప్రపంచంలో ఏది ప్రకాశిస్తున్నా అది తన అంశాంశ చేరి ఉండటం చేత. 


1-10 of 310