Site‎ > ‎

అనువాదము

"తిరువాయి మొళి మూడవ పత్తు - పరిచయం" added

posted 20 Sep 2018, 04:34 by Shashi-Kiran Rao S

తిరువాయి మొళి మూడవ పత్తులో అందరికి సమానముగా  ఈ మానవ జన్మను ఇచ్చినా   కొందరు  ఆ భగవంతుడిని ఇష్టపడకపోవడానికి  కారణము ఏమిటా  అని అలోచించి  వారికి ఆ స్వామి యొక్క గొప్ప తనము తెలవకపోవడం వలన  వారు పూజించలేక పోతున్నారని  అనుకొని  వారికి ఆ భగవంతుడి యొక్క గొప్ప గుణములను తెలుపుతున్నారు. 

"తిరువాయి మొళి రెండవ పత్తు - పరిచయం" added

posted 18 Sep 2018, 04:05 by Shashi-Kiran Rao S

భగవంతుడి మోక్షప్రద తత్వమును   విశ్వరూప దర్శనమును  తాను అనుభవించి  సంతృప్తులై  మనల్ని కూడా  ఆ భగవంతుడిని దర్శించమని చెప్పిరి.

"తిరువాయి మొళి మొదటి పత్తు - పరిచయం" added

posted 13 Sep 2018, 22:46 by Shashi-Kiran Rao S

తిరువాయి మొళి మొదటి పత్తులోని 2 వ భాగమైన వీడుమిన్ అనేభాగములో,  మన ప్రాణమై వున్న ఆత్మకు  ఆ స్వామిని చేరడానికి మించినభాగ్యము కన్నా  వేరొక భాగ్యము  లేదని చెబుతూ  ఆ సర్వేశ్వరుడే అన్నీ  అనితలచి  ఆ స్వామి సేవలందే మునిగి తేలినప్పుడు బ్రతికినంత కాలము  ఏ కొరతలేకుండా  బ్రతికి   జీవితకాలము పూర్తి అయిన తరువాత ఈ శరీరమును విడిచిపెట్టినప్పుడు  దానికి సంబంధించిన మంచి  ఫలితమును  మోక్షముగాపొందవచ్చును అని నమ్మాళ్వారు  స్పష్టముగా ఇందులో వివరించారు. 

"తిరువాయి మొళి - పరిచయం" added

posted 11 Sep 2018, 23:54 by Shashi-Kiran Rao S

తిరువాయిమొళి అనగా గొప్పవారి  నోటి నుంచి వెలువడిన దివ్యమైన మాటలు. నాలాయిర దివ్య ప్రబంధములోని చివరి భాగము ఈ తిరువాయిమొళి. ఇది నాలాయిరములో ముఖ్యమైనదే కాకుండానమ్మాళ్వారుడి రచనలలో ఇది చాలా చాలా ముఖ్యమైనది.  ఇది సామ వేద సారము. ఇందులో 1100 పాశురములు వున్నాయి.


"శిరియ తిరుమడల్ - పరిచయం" added

posted 9 Sep 2018, 22:30 by Shashi-Kiran Rao S

  తిరుమంగై ఆళ్వారు రచించిన ఆరు ప్రబంధములలో ఒకటి అయిన ఈ శిరియ తిరుమడల్ కూడా అతి తేలికగా చదవగలిగే చాలా చిన్న చిన్న పాశురములను కలిగి వున్నది.

                    పురుషార్థములో చివరిదిధర్మాధర్మముల విచక్షణతో కూడుకొని వున్న మోక్షము గురించి చాలా సులభముగా అందరము అర్థం చేసుకునే విధముగా  ఇందులో రచించారు."పెరియ తిరుమడల్ - పరిచయం" added

posted 6 Sep 2018, 00:12 by Shashi-Kiran Rao S


            ఎవరైనా అతి తేలికగా చదవగలిగే చాలా చిన్న చిన్న పాశురములతో ఈ పెరియ తిరుమడల్ ను తిరుమంగై ఆళ్వారు తన ఆరు ప్రబంధములలో ఒకటిగా రచించారు."తిరువెజు కూత్తిరుక్కై - పరిచయం" added

posted 4 Sep 2018, 23:51 by Shashi-Kiran Rao S

 ఇది ఒక అద్భుతమైన విలక్షణమైన అంకెల విశిష్టమైన ఏక పాశురమాల. అంకెల రూపముతో  భగవంతుడి వర్ణననుగుణ గణములను అవతార విశేషములను ఏకబిగిన ఎక్కడా ఆగకుండా తిరుమంగై ఆళ్వారు  అల్లుకుంటూ వచ్చారు. ఇది మామూలు పాశురము కాదు. ఇంచు మించు రెండు పేజీల ఏక పాశురము.

"పెరియ తిరువందాది - పరిచయం" added

posted 3 Sep 2018, 23:58 by Shashi-Kiran Rao S

నమ్మాళ్వారు  అధర్వణ వేద సారముతో  87 పాశురముల పెరియ తిరువందాదిని రచించారు.    ఇందులోని  పాశురములలో నమ్మాళ్వారు  అర్థ పంచక జ్ఞాన ఉపదేశములు అనగామన చుట్టూ ఉన్న ఈ పంచభూతములు అయిన ఈ భూమిఈ గాలిఈ నీరుఈ నిప్పుఈ ఆకాశము గురించే  కాకుండామనలో ఉన్న ఇంద్రియముల గురించి తెలుపుతూ,  మన ప్రాణమై ఉన్న ఆత్మ గురించిఆ ఆత్మ ధర్మము గురించి  మనకు చాలా చక్కగా వివరముగా చెప్పుకుంటూ వచ్చారు.

"తిరువాశిరియము - పరిచయం" added

posted 30 Aug 2018, 23:20 by Shashi-Kiran Rao S

నమ్మాళ్వారు రచించిన యజుర్వేద సారము ఈ 7 పాశురముల తిరువాశిరియము.

ఇందులో ఆ వైకుంఠములో కొలువై వున్న శ్రీమన్నారాయణుడి రూపు రేఖలనుఈ భూమిపైన వున్న మన కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు.  

read more@"తిరువాశిరియము - పరిచయంadded under  section దివ్య ప్రబంధ అనువాదము

"తిరువిరుత్తము-పరిచయం" added

posted 29 Aug 2018, 23:42 by Shashi-Kiran Rao S

నమ్మాళ్వారు రచించిన ఋగ్వేద సారము ఈ 100 పాశురముల తిరువిరుత్తము.

                  పుట్టడంచావడంచాలా కాలము ఏదో విధముగా  బ్రతకడం,ఇటువంటి  వాటన్నిటిని ఇష్టపడని వారు,  ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూఆ భగవంతుడిని కళ్లారా చూడాలి అని ఆశపడుతూ   ఏదో విధముగా కాలము గడుపుతూ వుండి పోలేరు అని నమ్మాళ్వారు ఈ తిరువిరుత్తములో చెప్పారు.


Read more @"తిరువిరుత్తము-పరిచయంadded under  section దివ్య ప్రబంధ అనువాదము


1-10 of 29