ప్రజ్ఞ 2011-12 కార్యక్రమం


20 అగస్టు, సీతానగరం. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ప్రజ్ఞ 2011-12 కార్యక్రమం

ప్రజ్ఞ అంటే ఏమిటి ?

'జ్ఞ' అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము ఉండేది కేవలం మనుషులకేనా లేదా పశుపక్షాదులకీ జ్ఞానం ఉంటుందా ? పశువులకి జ్ఞానం ఉంటుంది కానీ అది కేవలం శరీరానికి సంబంధించినంత వరకు మాత్రమే. తమకున్న జ్ఞానంతో అవి చాలా క్రమబద్దమైన జీవనాన్ని సాగిస్తాయి. తగిన సమాయానికి నిద్ర లేస్తాయి, తగిన  సమయానికి నిద్రిస్తాయి. వాటికి ఎది తగునని ఆహారాన్ని నిర్దేశించబడి ఉంటుందో శాఖాహారమో లేక మాంసాహారమో దాన్నే స్వీకరిస్తాయి. అవసరానికి తగినట్లు ప్రకృతిని వాడుకుంటాయి, ఎంత అవసరమో అంతవరకు మాత్రమే. ప్రకృతికి విరుద్దంగా జీవించవెప్పుడూనూ. మరి మనిషో ? మనిషికున్న జ్ఞానం అనేది శరీర హద్దును దాటి లోన కనిపించక ఉన్న ఆత్మ తత్త్వాన్ని గుర్తించగలిగిన యోగ్యత కలది. మరి అలానే వినియోగించుకుంటున్నాడా ? అంటే మనిషికి ఉన్న ఆశ కారణంగా అది తప్పు దారిలో నడుస్తోంది. అందరికీ తెలిసే ఉంటుంది ఈ నాడు పాల ఉత్పత్తికి మనం జరిసి ఆవులని చూస్తున్నాం. ఇది వరకు ఆవులు వేరు. అవి ఇచ్చే పాలు ఆరోగ్యకరమైనవి కానీ మనిషికి అవి ఎక్కువగా ఇచ్చేలా సంకరం చేయటం మొదలు పెట్టాడు. అలా చేస్తూ వెళ్ళి చివరికి అలా వచ్చే పాలు ఆరోగ్యరిత్యా తగనివి అని గుర్తించి సంకరాన్ని చేయటం తగ్గిస్తూ వచ్చాడు.  అంతే కాదు ఈ నాడు అభివృద్ది చెందిన దేశాల వాళ్ళు పాల ఉత్పత్తి పెంచటానికి ఆవుల దూడలని చంపి ఆ మాంసాన్ని ఆవులకే తినిపించే వాళ్ళు తద్వారా ఆవులో ప్రొటీన్ల శాతాన్ని పెంచి పాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేసారు. కానీ అది చివరికి అనర్ధకారిగా మారింది, అలాంటి ఆవులకి మ్యాడ్ కౌ డిసీస్ అనే వ్యాది వచ్చింది. అలా ఆవ్యాది మరింత సోకుతుందేమోనమి ఒకే సారి కొన్ని లక్షల ఆవులని చంపివేసారు. అంటే మనిషి చేసే పనులకి ప్రకృతితోపాటు ఆ ప్రకృతిలో నివసించే జీవులకీ హానికరం చివరకి తనకి కూడా హాని కరం. మనిషికి జ్ఞానం ఉన్నది కానీ ఈ నాడు తప్పు దారిలో నడుస్తోంది. అంటే అది వెర్రి తలలు వేసి ఉంది. అందుకే మనిషికి ఏది తగినది ఏది తగనిది తెలిపే మంచి జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. అట్లాంటి సరియైన జ్ఞానాన్ని అందించి దాన్ని ఆచరణలో పెట్టించే కార్యక్రమమే 'ప్రజ్ఞ'.

ఈ ప్రజ్ఞ కార్యక్రమం ఎవరి కోసం ?

పెద్ద వయసు వారికి నేర్పితే వారికి ఉన్న సమయం తక్కువ. వారికున్న శక్తి తక్కువ. వారు మంచిని ప్రోత్సహించగలరు కానీ ఆచరించటం అనేది కష్టం. మధ్య వయస్సు వారు తమ ఉద్యోగాల్లో తీరిక లేక ఉంటారు. వారికి దొరికే సమయమూ తక్కువే. చిన్న పిల్లలకి నేర్పితే అది ఎక్కువ ప్రభావం ఉంటుంది కనుక వారిని ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలొగేట్టు చేసినట్లయితే అద్భుత ఫలితాన్ని ఇవ్వగలదు.

ఈ ప్రజ్ఞ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకు పోవడం ?

దేన్నైనా ఆచరించాలంటే సాధారణంగా ఉత్సాహాన్ని కలిగించేదిలా ఉండాలి. అది మనకు ఏదో లాభాన్ని ఇవ్వగలగాలి.మంచి ప్రోత్సాహం లభించాలి. ఈ మూడు విషయాలు గుర్తుకు పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఏదైనా పాటశాలకి మనం వెళ్తే అక్కడి విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చే ఆటలతో లేదా భజనలతో కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. వారికి లాభకరమైనది అని గుర్తించేట్టు ఆరోగ్య శిభరాన్ని నిర్వహించాలి. విద్యార్తులకు ముఖ్యంగా కంటికి మరియూ పంటికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు అవసరం. వాటికి సంబంధించిన శిభిరాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు వారికి ఈ కార్యక్రమం వారికి మేలు చేసేది అని గుర్తించగలుగుతారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల వారికి ఇది అవసరం. అప్పుడు నీతి కథలని మనం చెబితే వారు ఆచరించే ప్రయత్నం చేస్తారు. ప్రజ్ఞా కార్యక్రమానికి ఎనిమిది పుస్తకాలని తెలుగు మరియూ ఆంగ్ల భాషల్లో జీయర్ ఎజుకేషనల్ ట్రుస్ట్ ప్రచురించింది. అవి
1. మాతృదేవోభవ
2. పితృదేవోభవ
3. ఆచార్యదేవోభవ
4. మాతాపితృ భక్తి
5. కృతజ్ఞత
6. స్నేహం
7. జ్ఞానం
8. మాటతీరు

ఈ వార్షికానికి మన వద్ద ఉన్న సమయం సెప్టెంబర్ నుండి జనవరి వరకు. ఈ ఐదు నెలల్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని మినహాయించి వారానికి కొంత సమయాన్ని విద్యార్థులకి కెటాయించాలి. అలా ఆరోగ్యం మరియూ నైతిక ప్రవర్తన లక్ష్యంగా కనీసం వెయ్యి పాటశాలలని మనం తయారు చేయగలగటం వికాసతరంగిణి ప్రణాళిక ఏర్పటు అయ్యింది. రెండు వారాల్లో (అంటే సెప్టెంబర్ 4 వరకు) మనం ఎన్ని పాటశాలలని మనం లక్ష్యంగా తీసుకోగలమో తెలిపితే ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్తుంది. మరిన్ని వివరాల కోసం ఆయా ప్రాంతాల వారు ఆయా ప్రాంతాలకై ఏర్పాటుచేసిన కార్యనిర్వాహకులని సంప్రదించాలి.