శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి చాతుర్మాస్య దీక్షావిరమణ

posted 30 Sep 2012, 02:17 by Shashi-Kiran Rao S   [ updated 30 Sep 2012, 04:16 ]

30 సెప్టెంబర్, శ్రీరామనగరం. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు చాతుర్మాస్య దీక్షని విరమించారు. యతులు సాధారణంగా రోజు ఒక ప్రదేశం మారుతూ అక్కడి వారిని సంస్కరిస్తూ తిరుగుతుంటారు. సంవత్సరం మొత్తంలో వానాకాలం మాత్రం ప్రయాణాలు జరపరాదని నియమం. ప్రాణికోటికి ముప్పు జరగకూడదనే కారణం ఒకటి. రామాయణంలో రామచంద్రుడు సుగ్రీవాదులని కలిసిన తరువాత వానాకాలం రావటంతో సీతాన్వేషణని కూడా నాలుగు నెలల కాలం ఆపవలసి వచ్చింది. ఈ నాలుగు మాసాలు పరమాత్మ కూడా జీవుల్లని తాను ఎట్లా చేస్తే బాగుపడతారోనని తలుస్తూ యోగనిద్రలో ఉంటాడు. ఒక వేళ దీక్ష చేయటానికి నాలుగు మాసాలు వీలు కాని పక్షాన నాలుగు పక్షాలు చేసుకోవచ్చు. ఆషాఢపౌర్ణమి మొదలుకొని బాద్రపద పౌర్ణమి వరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. చాతుర్మాస్యంలో స్వామివారు ఛాన్దోగ్యోపనిషత్తు లోని సద్విద్యని ప్రవచనలు అనుగ్రహించారు.
 

Comments