తిరుప్పల్లాండుపెరియాళ్వారు రచించిన తిరుప్పల్లాండు.

భగవంతుడికి దిష్టి తీస్తూ, పెరియాళ్వారు, ఆ స్వామికి మంగళం పాడుతున్నారు.

పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం

మల్లాండ తిణ్ తోళ్ మణివణ్ణా ఉన్ శెవ్వాడి శెవ్వి తిరుక్కాప్పు. (1)

1.   మల్లయోధులను జయించిన ధ్రుఢ భుజములు కలిగిన ఓ మణివర్ణుడా, అనేక ఏండ్లు, అనేక వేల సంవత్సరములు, అనేక కోట్ల వందల వేల సంవత్సరములు,  ఎర్రనైన నీ దివ్యపాదపు అందమునకు, ఏ దిష్టి తగలకుండా, రక్ష కావలెను.

అడియోమోడుం నిన్నోడుం పిరివిన్రి ఆయిరం పల్లాండు

వడివాయ్ నిన్ వలమార్పినిల్ వాళ్ కిన్ర మంగైయుం పల్లాండు

వడివార్ శోది వలత్తురైయుం శుడరాళియుం పల్లాండు

పడై పోర్ పుక్కు ముళుంగుం అప్పాంచశన్నియముం పల్లాండే. (2)

2.  జీవులము, అయిన మేము, పరమాత్మ అయిన నిన్ను, వదలకుండా, వేల కోట్ల సంవత్సరములు, ఎల్లవేళలా నీతోనే, కలిసి, వుండాలి. చక్కని నీ కుడి వక్షమున కొలువై వున్న, చల్లని శ్రీదేవీ, ఎల్లవేళలా విరాజిల్లుతూ, వుండాలి. చక్కదనముతో ప్రకాశించే, నీ కుడి చేతిలోని, చక్రము, ఎల్లప్పుడూ, కాంతులు వెదజల్లుతూ, ప్రకాశిస్తూ వుండాలి. దుష్ట శిక్షణ చేసే, సమయములో, ఓమ్ కార శబ్దము చేసే, ఆ పాంచజన్య శంఖము, ఎల్లప్పుడూ, కళకళలాడుతూ, వుండాలి.


వాళాల్ పట్టు నిన్నీర్ ఉళ్లీరేల్ వందు మణ్ణుం మణముం కొణ్ మిన్

కూళాళ్ పట్టు నిన్నీర్ కళై ఎంగళ్ కుళవినిల్ పుగదలొట్టోమ్

ఏళాల్ కాలం పళిప్పిలోమ్ నాంగుళ్ ఇరాక్కదర్ వాళ్ ఇరాక్కదర్ వాళ్ ఇలంగై

పాళాళాక ప్పడై పొరుదానుక్కు పల్లాండు కూరుదుమే. (3)

3.  లంకలో నివసించే, నిశాచరులైన రాక్షసులు నశించునట్లు, యుద్ధము చేసిన, ఆ శ్రీరామచంద్రుడికి, దిష్టి తగలకుండా, మంగళాశాసనములు చేస్తున్నాము. మా వంశములోని, ఇరవై ఒక్క తరముల వారము, మా మనస్సులోన ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, ఈ పనిని చేస్తూనే వున్నాము. మీరు కూడా, ఆ భగవంతుడి సేవలో తరించి, త్రుప్తిపడాలి, అని అనుకుంటే, మాతో వచ్చి, చేరండి. ఆ భగవంతుడికి కాకుండా, ఈ డబ్బుకు దాసులు అయినచో, మాతో కలవకండి.

ఏడునిలత్తిల్ ఇడువదన్ మున్నం వందు ఎంగళ్ కుళాం పుగుందు

కూడు మనముడైయీర్ కళ్ వరంబొళి వందొల్లై క్కూడుమినో

నాడు నగరముం నన్ గరియ నమోనారాయణాయ ఎన్రు

పాడు మనముడై పత్తరుళ్లీర్ వందు పల్లాండు కూరుమినే. (4)

4.  మోక్షమును పొందాలనుకునే వారు వుంటే, వెంటనే, మీ యొక్క అహంకార మమకారములను వదిలిపెట్టి, తొందరగా, వచ్చి, మాతో చేరండి. మనమంతా కలిసి, వాడవాడలా, దేశదేశములా, ఆ భగవంతుడి గురించి, అందరికి, తెలిసేటట్లు, చక్కగా, నమో నారాయణాయ, అని గానము చేస్తూ, ఆ భగవంతుడికి, దిష్టి తగలకుండా, మంగళము పాడుదాము.

 అండక్కులత్తుక్కు అదిపతియాకి అశుర రిరాక్కదరై

ఇండక్కులత్తై ఎడుత్తు  క్కళైంద ఇరుడీ కేశన్ తనక్కు

తొండక్కులత్తి లుళ్లీర్ వందు అడి తొళుదు ఆయిరనామం శొల్లి

పండక్కులత్తై తవిరుందు పల్లాండు ప్పల్లాయిరత్తాండెన్మినే. (5)

5.  పూర్వ జన్మలలో, అల్పజీవులుగా, పుట్టిన మీరు, ఇప్పుడు, ఆ జన్మల వాసనలను పోగొట్టుకోవాలని, మనస్ఫూర్తిగా, తలచి, ఆ భగవంతుడి దివ్యపాదపద్మములను ఆశ్రయించి, మాతో వచ్చి, చేరండి. అండ పిండ బ్రహ్మాండ సమూహమునకు, స్వామి అయిన ఆ భగవంతుడికి, రాక్షస సమూహములను కూకటి వ్రేళ్లతో సహా, నాశనము చేసిన, ఆ హ్రుషీకేశుడికి, సహస్రనామములతో, అనేక సంవత్సరములు, ఏ దిష్టి తగలకుండా, మంగళము పాడుదాము.

ఎందై తందై తందై తందై తమ్మూత్తప్పన్ ఏళ్ పడికాల్ తొడంగి

వందు వళివళి ఆళచ్చెయ్ కిన్రోమ్ తిరువోణ త్తిరువిళయిల్

అందియం బోదిల్ అరియరువాగి అరియై అళిత్తవనై

వందనైతీర ప్పల్లాండు పల్లాయిరతాండెన్రు పాడుదుమే. (6)

6.  ఆ భగవంతుడికి సేవ చెయ్యడం, మాకు తెలియదు, అని మీరు, అనుకోవద్దు. నేను, నా తండ్రి, నా తాత, నా ముత్తాత, ఆ విధముగా, మా ఏడు తరాల వారము, ఈ విధముగానే, ఆ భగవంతుడికి సేవ చేస్తూనే వస్తున్నాము. మీరు కూడా, వచ్చి, మాతో చేరండి. శ్రవణా నక్షత్ర సాయంసంధ్యా సమయమున, ఆ హిరణ్యుడిని, సం హరించిన ఆ నారసిం హుడికి, ఆ సమయములో కలిగిన అలసట, కోపము పోవాలని, దిష్టి తీస్తూ, అనేక సంవత్సరములు, అనేక వేల సంవత్సరములు, చల్లగా వుండమని, మంగళము పాడుదాము.

          తీయిల్ పొలిగిన్ర శెంజుడరాళి తిగళ్ తిరుచ్చక్కరత్తిన్

కోయిల్ పొరియాలే ఒత్తుండు నిన్రు కుడికుడి యాట్చెయ్ గిన్రోమ్

మాయ ప్పొరు పడై వాణనై ఆయిరం తోళుం పొళి కురిది

పాయ శుళత్తియ ఆళివల్లానుక్కు పల్లాండు కూరుదుమే. (7)

7.  మేమందరము, మా భుజములపై, ఆ సూర్యచంద్రుల వలె, వెలిగే, శంఖ చక్రముల గుర్తులతో, చక్రాంకితులమై, మా మనస్సును శుద్ధి చేసుకొని, ఆ భగవంతుడికి సేవ చేస్తున్నాము. మాయా యుద్ధము చేసే, సైన్యము కలిగిన బాణాసురుడి వెయ్యిచేతులను, చక్రముతో నరికిన ఆ శ్రీక్రుష్ణుడిని, శాంతముగా, చల్లగా, వుండమని, దిష్టి తీస్తూ, మంగళము పాడుదాము.

నైయ్యిడై నల్లదోర్ శోరుం నియతముం అత్తాణి చ్చేవగముం

కైయడై కాయుం కళుత్తుక్కు పూణొడు కాదుక్కు క్కుండలముం

మెయ్యిడ నల్లదోర్ శాందముం తందు ఎన్నై వెళ్ల యిరాక్క వల్ల

పైయుడై నాగ ప్పగై క్కొడియానుక్కు ప్పల్లాండు కూరువనే. (8)

8.  దేవాలయములో కొలువై వున్న, ఆ భగవంతుడిని, అభిషేకించి, ఆయన శరీర విగ్రహమునకు, సుగంధ, పరిమళ, చందనమును, పూస్తూ, చేతులకు కంకణములను, మెడకు కంఠాభరణములను, చెవులకు మకర కుండలములను, అనేక రకాలైన ఆభరణములను, కిరీటమును అలంకరిస్తూ, నెయ్యితో తయారయ్యే, అనేక రుచికరమైన ప్రసాదములను, నైవేద్యముగా పెడుతూ, ఎల్లవేళలా, ఆ స్వామిని విడువకుండా, సేవ చేసే, భాగ్యమును, మాకు, ఆ స్వామి ప్రసాదించెను. ఇంతటి భాగ్యమును ఇచ్చిన ఆ భగవంతుడికి, సర్ప విరోధి అయిన ఆ గరుత్మంతుడిని, వాహనముగా, చేసుకున్న, ఆ శ్రీమన్నారాయణుడికి, ఏ దిష్టి తగలకుండా, మంగళము పాడుదాము.

ఉడుత్తు క్కళైనంద నిన్ పీదగవాడై ఉడుత్తు క్కలత్తదు ఉండు

తొడుత్త తుళాయ్ మలర్ శూడిక్కళైందన శూడుం ఇత్తొండర్ గళోమ్

విడుత్త దిశై క్కరుమం త్తిరుత్తి తిరువోణ త్తిరు విళవిల్

పడుత్త పైన్నాగణై పళ్ళి కొండానుక్కు పల్లాండు కూరుదుమే. (9)

9.  మేము,  చెప్పిన పనులను, చక్కగా చేస్తూ, ఆ భగవంతుడు ధరించి విడిచిన వస్త్రములను, కట్టుకుంటూ, ఆ స్వామికి వేసి, తీసిన, తులసిమాలలను, మహాప్రసాదముగా భావిస్తూ, ఆ స్వామికి నివేదించిన ప్రసాదమును, అందరికి పంచగా, మిగిలిన దానిని తింటూ, ఆ దేవుడికి సేవ చేస్తున్నాము. మీరు కూడా, మాతో వచ్చి, చేరండి.  పుట్టిన రోజు పండుగ  మహోత్సవములో, అలసిపోయిన, మన స్వామి,  ఆ శేషశయ్యపై శయనించిన ఆ శ్రీమన్నారాయణుడికి, ఏ దిష్టి తగలకుండా, మంగళము పాడుదాము, రండి.

ఎన్నాళ్ ఎంబెరుమాన్ ఉందనక్కు అడియోమ్ ఎన్రు ఎళత్తుప్పట్ట

అన్నాళే అడియో0గళ్ అడిక్కుడిల్ వీడుపెత్తు ఉయంద దుకాణ్

శెన్నాళ్ తోత్తి త్తిరు మదురైయుళ్ శిలైగు నిందు ఐందలైయ

పైన్నాగత్తలై పాయందవనే ఉన్నై ప్పల్లాండు కూరుదుమే. (10)

10.         ఈ స్రుష్టికి ముందుగా, ఉద్భవించిన, ఓమ్ కారమునకు, ముందే, వున్న ఈ ఆదిదేవుడికి, మేము భక్తులమయ్యి, సేవ చెయ్యడం వలన, మేమే కాదు, మా పిల్లలు, వారి పిల్లలకు కూడా, ఈ మానవ జన్మలోనే, తరించి, మరొక జన్మ లేకుండా, మోక్షమును పొందే భాగ్యము, లభించినది. అందుకే మీరు కూడా, మాతో వచ్చి, చేరండి. రోహిణీ నక్షత్రము నందు, పుట్టి, ఆ కాళీయుడి పడగలపై, నాట్యమాడి, మథురానగరములో, విల్లు విరిచిన ఆ శ్రీక్రుష్ణుడికి, దిష్టి తగలకుండా, మంగళము పాడుదాము.

      అల్వళక్కు ఒన్రుమిల్లా అణిక్కోట్టియర్ కోన్ అబిమాన తుంగన్

శెల్వనై ప్పోల త్తిరుమాలే నానుం ఉనక్కు ప్పళవడియేన్

నల్వగైయాల్ నమో నారాయణా వెన్రు నామం పల పరవి

పల్వగై యాలుం పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే. (11)

11. ఈ భూమిపై మెరిసే, ఆభరణము వలె వున్న, తిరుక్కోట్ట్టియూరు, అను నగరములో, కొలువై, ప్రశాంతతకు మారు పేరు అయి వున్న ఓ సౌమ్య నారాయణ స్వామీ, అభిమానవంతుడైన, నీ భక్తుడు, ఆ శెల్వనంబి వలె, నేను కూడా, ఎప్పటి నుంచీ, నీ భక్తుడను. ఏ ఒక్క చెడ్డ గుణములు లేకుండా, ధర్మాధర్మ విచక్షణతో, బ్రతుకుతూ, ఎల్లవేళలా, నీ దివ్య సహస్ర నామములనే పలుకుతూ, ఓమ్ నమో నారాయణాయ, అనే అష్టాక్షరీ మంత్రమును, మనస్సులో అనుసంధిస్తూ, నిత్యమూ, నీ సేవ చేస్తూ, జీవించే, నీ దాసుడను, నీ భక్తుడను. అన్ని వేదములు, ఉపనిషత్తులు కూడా, నువ్వే, భగవంతుడివై వున్నావని, తెలుపుతున్నాయి. పరమపావనుడైన ఓ పరిపూర్ణుడా, నీకు దిష్టి తగలకుండా, మేము, నీకు, మంగళమును, పాడెదము, స్వామీ.

పల్లాండెన్రు పవిత్తిరనై ప్పరమేట్టియై శాంఘమెన్నుం

విల్లాండాన్ తన్నై విల్లిపుత్తూర్ విట్టు శిత్తన్ విరుంబియ శొల్

నలాండెన్రు నవిన్రు రైప్పార్ నమో నారాయణాయ ఎన్రు

పల్లాండుం పరమాత్మనై శూళిందరుందు ఏత్తువర్ పల్లాండే. (12)

12.          పరమ పద వైకుంఠము నందు, కొలువై వున్న, ఆ శ్రీమన్నారాయణుడు, శాంఘము, అనే విల్లును ధరించిన ఆ శాంఘపాణి, పరమ పావనుడైన ఆ భగవంతుడికి, ఏ దిష్టి తగలకుండా, మంగళము కలగాలి, అని విల్లిపుత్తూరు నగరములోని, పెరియాళ్వారు, రచించిన ఈ పాశురములను, మనస్ఫూర్తిగా చదివినవారు, నమో నారాయణాయ, అని అంటూ, ఈ జీవిత తదనంతరమున, ఆ వైకుంఠములోని, పరమాత్మ వద్ద, మంగళము పాడుదురు.


పెరియాళ్వారుల దివ్యపాదములకు నమస్కారములు.