"జగత్ కారణం ఏది ? అంటే "ఏకమేవ అద్వితీయం" అని చెప్పింది వేదం. ఎట్లా అయితే చెట్టు ఏర్పడటానికి గింజ కారణమో, ఈ ప్రపంచం అంతా ఏర్పడటానికి ఒక్కడే కారణం. జగత్ కారణం ఒక్కటేనా అంటే, ఒక్కడు అంటే వాడితో ఎప్పటికి వదలక వీడనివి కొన్ని ఉంటాయి, వాటినే విశిష్టములు అని అంటాం. తత్వం ఒక్కటే అన్నప్పుడు దానితో సహజమైనవి కొన్ని ఉంటాయి, వాటితో కూడుకున్న ఒక్కటి. ఇదే విశిష్ట అద్వైతం. దేనితో విశిష్టం ? పండు అనేది ఒక ఆకారం, ఒక రంగు, ఒక  పరిమళం కలిగి ఉంటుంది. వీటిని వేరుగా విడదీసి చెప్పలేం. జగత్ కారణమైన పరమాత్మ ఒక్కడే, కానీ వేటితో కూడుకున్న వాడు అని ప్రశ్న వేస్తే, వేదానికి సారభూతం, శిరస్సు వంటిది పురుషసూక్తం. అది ఇస్తుంది వివరణ. "సహస్ర శీర్షా పురుషః" ఇదంతా తయారు చేసిన ఒకడు ఉన్నాడు, "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్-న్యౌ" ఆయన లక్ష్మీ ఇత్యాదులతో కూడి ఉండును అని చెబుతుంది. పరిమళాన్ని బట్టి పుష్పంని గుర్తించినట్లు, జగత్ కారణమైన వాడిని గుర్తించేది ఆయనలో వీడక ఉండే దయని బట్టి. ఆయనలో దయ ఎప్పటికీ ఉంటుంది.  పరమాత్మలోని దయను వెలికితీసే అమ్మ లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం!!".    - శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు
 


శ్రావణ మాసం - లక్ష్మీప్రదమైన కాలం (2nd Aug-30th Aug)

లక్ష్మీ ప్రదమైన శ్రావణ మాసంలో అమ్మను గురించి తెలుసుకోవడం మన స్వరూపం. భగవంతుడు ఏ అవతారం ధరించినా మొదట ఆయనలో కలగ వల్సినవి ఏవి ? అంటే భగవంతునికి మనపై కలగాలి జాలి, దయ, కృప. మనల్ని బాగు చేయాలీ అని ఆయన హృదయంలో కలగాల్సిన కారుణ్యం. మన దుఃఖాన్ని చూసి ఆయనలో ఒక కరుగుదల ఏర్పడాలి, మన దుఃఖాన్ని తొలగించాలని కోరిక కలగాలి. అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు. అయితే ఆయనలో దయ, కారుణ్యాది గుణాలని బయటికి తెచ్చేది అమ్మ ఆయన వద్ద నిరంతరం ఉంటుంది. ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు. అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచపత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం. (read More)


ఆండాళ్ తిరునక్షత్రం -3rd Aug 

కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది.

ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది అమ్మ గోదా. శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాల్ని అందమైన పాటలుగా అందించింది గోదా. తను స్వామి సన్నిదానం చేరే ముందు మనల్ని అందరిని భాగుచేస్తానని వాగ్దానం చేసింది. మరి స్వామి ఫలింప చేస్తాడా అంటే, ఆమెను పాణిగ్రహణం చేసాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా. (Read More)

శ్రీగోదా అష్టోత్తర శతనామావళి

శ్రీ బదరీనారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం -5th Aug

నరనారాయణులు లోక ఆరాధ్యులు. లోకానికి సర్వ వేద సారమని ఋషులంతా ఉపాసించినట్టి, వేదమే దానికి సారం ఇదే అని చెప్పినటువంటి నారాయణ అష్టాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశం చేసిన స్వరూపం.

ఒకే భగవంతుడు రెండు రూపాలు ధరించి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆచార్యునిగా నారాయణుడు అయ్యాడు. శిష్యునిగా నరుడయ్యాడు. నారాయణుడు నరునికి ఉపదేశం చేస్తూ లోకం అంతా గుర్తించేట్టు చేసాడు. (Read more)


శ్రావణ శుక్రవారం - వరలక్ష్మీవ్రతం -   9th Aug

అయితే శ్రావణ మాస ప్రతి శుక్రవారానికి మరింత ప్రాధన్యత ఉంది. అమ్మ పేరు భార్గవి, అంటే భృగు వంశానికి చెందినది. భృగు గ్రహమే అంటే శుక్ర గ్రహం. అందుకే ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఉండే రోజు శుక్రవారం. ఆనాడు ఆరాధన చేస్తే మరింత మంచిది. అట్లా ప్రతి శుక్రవారానికి అట్లాంటి ప్రత్యేకత ఉంటుంది, కానీ దానికి తోడు శ్రావణ మాసం అయ్యే సరికి లక్ష్మీ దేవిని ఆరాధన చేసుకోవడం, ఆ తల్లి నామాన్ని, తల్లి గురించి నోరారా పలికితే ఎంతో శ్రేయోదాయకం. అందుకే వైదిక ధర్మంలో మహిళలకు ఈ మాసం ప్రాధాన్యం ఇస్తారు. వారు చేసుకొనే ధార్మిక కార్యక్రమాలకి పూర్తి స్వాతంత్రం ఇస్తారు. తమ సఖీ వర్గంతో కలిసి భగవదారాధన, వేడుకలు చేసుకుంటారు. (Read More)

శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి - 14th/15th Aug 

శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం ఒకటే అనే స్థితిలోకి వచ్చాం ఈ నాడు, కానీ ఈ రోజు ప్రాధాన్యత మరచిపోయాం. రక్ష కట్టుకోవడం అనేది దేశ రక్షణ కోసం అని, సోదరీలు  సోదరులకు రక్ష కట్టినట్లయితే వారు రక్షణ కలిపిస్తారని కొన్ని ఈ మధ్యకాలంలోని పురుషోత్తముడు అలెగ్జాండర్ కథ చెబుతారు. శ్రావణ పూర్ణిమ అంటే అంతవరకే చెబుతారు. కానీ అంతవరకే ఈ శ్రావణ పూర్ణిమ ప్రాధాన్యత కాదు. అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.(Read More)


 శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయరు స్వామి తిరునక్షత్రం -19th Aug

నేరుగా భగవంతుడిని ఆశ్రయిస్తే సిద్ది కలుగుతుందో, కలగదో సందేహమే !! "సిద్దిర్భవతివాన్ నేతి సంశయః అచ్యుతసేవినాం" అని చెబుతారు గ్రంథాల్లో. భగవంతుడిని ఆశ్రయించిన వాడిని అనుగ్రహం తప్పక లభిస్తుందో లేదో అనేది సంశయం మాత్రమే, అదే "నశంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మనాం" భగవత్ భక్తులైన ఆచార్య ఆశ్రయణ చేసిన వారికి సిద్ది లభించునా లేదా అనే సంశయం అవసరం లేదు. తప్పక లభించి తీరుతుంది. భగవంతుని వద్దకి మనం నేరుగా వెళ్ళలేం కదా, అట్లా వెళ్ళ గలిగే వారితో చేరితే తప్పక చేరుకోవచ్చు.
read more  

శ్రీకృష్ణ జన్మాష్టమి - శ్రీజయంతి  - 24th Aug

శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అనేదాని గురించి ఒక నిర్ణయం ఉంది. సూర్యుడు సింహమాసంలో ఉండాలి, బహుల ఆష్టమి రోహిని నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహ స్థితి అది. ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే రావడం రాక పోవచ్చు, కానీ అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని చేయాలి.
కణ్ణన్ తిరునక్షత్ర తనియన్
సింహమాసే సితే పక్షే రోహిణ్యామష్టమీ తిథౌ |
చరమార్థ ప్రదాతారం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||

అసలు శ్రీకృష్ణ అవతారమే ఒక రహస్యమైనది, అయ్యో కంసునికి తెలిస్తే ఎలా అనేది భక్తుల భయం. ఆండాళ్ తల్లి "ఒరుత్తి మగనాయ్ పిఱందు " అనిచెబుతుంది. ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. ఎవరికి పుట్టాడో ఆమే పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే కాలం యొక్క అడ్డుగోడలు లేనివారు, స్వామిపై అంత ప్రేమ. అందుకే ఏనాడు అని చేసుకున్నా ఆయనకి చెల్లుబాటు అవుతుంది. అలాంటి స్వామికి రోహిని నక్షత్రం నాడు జరుపుకోవాలి. ముఖ్యంగా ఏనాడు జరుపుకున్నా ఇబ్బంది లేదు, ఆయన అవతారం ఎందుకు వచ్చింది తెలుసుకోవడమే ప్రధానం. (read More)


విఘ్ననివారణ చతుర్థి - విష్వక్సేన పూజ- 2nd Sept 

విఘ్న నివారణ అంటే మనకు ఎదురయ్యే ఆటంకాలను తొలగించేది అని అర్థం.(read more)ప్రవచనలు -Updates

ప్రవచనలు

 • ఆండాళ్ తల్లి మనకు నేర్పినదేమి ? article added ఎలా పాడాలో, ఎట్లా పాడాలో, నేను నేర్పిస్తానంటూ వచ్చింది అమ్మ.  ప్రేమతో చెబితే వింటారు కానీ కోపంతో చెబితే ఎవ్వరికి నచ్చదు. "ప్రకటం విధాతుమ్", అందుకోసమే బుజ్జగించి అందరికి ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చింది అమ్మ. చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి. మనిషి పాటలో పరవసిస్తాడు. ఇలా చేయండి అని ఆండాళ ...
  Posted 23 Nov 2016, 15:14 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వం ఒకటే - అది విశిష్ట అద్వైతము(2వ ఖండము - 1వ మంత్రము) article added ప్రమిదను చూస్తే దాంట్లో మట్టి మారలేదు, మట్టి యొక్క ఆకృతి మారింది. దాని అవస్థ మారింది. రూపాంతరం చెందింది. రూపం మారగానే పేరు మారింది. దానితో చేసే పని మారింది. కొత్త ద్రవ్యము ఏర్పడలేదు కేవలం అవస్థ మారింది- 'అవస్థ అంతర ఆపత్తి' అంటారు. అందుకే ఈ ప్రపంచం ఈవేళ ఇన్ని రూపాల్లో ఉన్నా ఇన్ని పేర్లతో ఉన్నా వీటన్నింటికీ కారణం ఒకటే 'సత్'. మరి దానికీ బహుత ...
  Posted 12 Jun 2016, 23:07 by Shashi-Kiran Rao S
 • ఈ ప్రపంచం శూన్యం నుండి ఏర్పడలేదు(2వ ఖండము - 1వ మంత్రము) article added     'ఇదమ్',ఈ కనిపించే ప్రపంచం అంతా, 'అగ్ర' పూర్వ దశలో  'సత్-ఏవ'  ఉండే ఉన్నది. మొదట చెప్పుకున్నట్లు మట్టి ఎలాగైతో కుండలుగా, ప్రమిదలుగా ఇలా రకరకాల ఎట్లా అయితే మారుతూ వచ్చిందో, అట్లానే ఈ కనిపించే ప్రపంచం ఇలా ఈ రూపం తీర్చి దిద్దుకోవడానికి ముందు 'సత్' అయి ఉన్నది. అంటే శూన్యం నుండి ఏర్పడలేదు ఈ ప్రపంచం. 'అస్తి ఇది సత్', అంటే శూన్యం నుండి ఇదేది రాలేదు, ఇదివరకు కూడ ...
  Posted 10 Jun 2016, 20:33 by Shashi-Kiran Rao S
 • 'సత్' యొక్క విస్తరించిన రూపమే ఈ ప్రపంచం(2వ ఖండము - 1వ మంత్రము) article added             ఈ చూసే ప్రపంచం లేని శూన్యం నుండి వచ్చేది కాదు అనేది వైదిక సిద్ధాంతం. మిరప గింజ వేస్తే మిరప చెట్టేకదా వస్తుంది, మరొక చెట్టు రావడం లేదు కదా! లేనివి ఏవో కొత్త తొత్తవి రావడం లేదు. ఉన్నవే వస్తున్నాయి. అంతటి పెద్ద వృక్షం కూడా గింజలొ ఇమిడి ఉంది కానీ కనిపించని దశలో ఉంటుంది. కనిపించని దాన్ని పూర్వ దశ అంటారు, కనిపించే దశని ఉత్తర దశ అ ...
  Posted 9 Jun 2016, 23:18 by Shashi-Kiran Rao S
 • కార్య కారణాలు ఒకటేలా అవుతాయి ?(1వ ఖండము - 7వ మంత్రము) article added     కారణమొక్కటి తెలిస్తే కార్యాలన్నీ తెలుస్తాయి. ఆ కారణ తత్త్వాన్ని కనుక తలచినట్లయితే సర్వాన్ని తలచినట్లే అవుతుంది. ఆ ఒక్కడిని ఉపాసన చేస్తే మొత్తం సర్వాన్ని ఉపాసించినట్లే అవుతుంది అని తండ్రి చెప్పాడు. పిల్లవాడికి సందేహం వచ్చింది. మట్టికి సంబంధించిన జ్ఞానం వేరు, కుండకి సంబంధించిన జ్ఞానం వేరు. మట్టి అనేది మృత్వముతో గోచర ...
  Posted 20 May 2016, 06:39 by Shashi-Kiran Rao S
 • కారణం తెలిస్తే కార్యాలన్నీ తెలిసినట్లే (1వ ఖండము-4,5,6వ మంత్రములు) article added     'ఏకేన మృత్పిణ్డేన' ఒక మట్టి ముద్దని గురించి తెలుసుకుంటే దాని ద్వారా తయారయ్యే ఏ వస్తువునైనా గుర్తించగలుగుతున్నాము. మట్టితో చేసేవి ఎన్నో వస్తువులు ఉంటాయి. బొమ్మలు, ప్రమిదలు, పెంకులు, కుండలు, కూజాల వంటి రకరకాల పరికరాలని తయారు చేస్తుంటారు. ఇవన్నీ మట్టి యొక్క వికారములే కనుక మట్టితో చేసినవి అని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకే వస్తువ ...
  Posted 19 May 2016, 07:22 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వమే "ప్రశాసన కర్త" (1వ ఖండము - 3వ మంత్రము) article added         లోకంలో దేన్ని చూసినా వాటి తయారీకీ అనేక కారణాలు కనిపిస్తుండగా జగత్తు యొక్క కారణం ఒకటెలా అవుతుందని అనిపించింది పిల్లవాడికి. తండ్రి చెప్పిన మాటల ప్రకారం ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్లు ఎలా అవుతుంది అనే సందేహం కలిగింది. అన్నింటినీ శాసించగల జగత్కారణ తత్త్వం గురించి అడిగావా అనేది తండ్రి వేసిన ప్రశ్న కాబోలు అని అనుకున్నాడు. 'ఆద ...
  Posted 14 May 2016, 07:02 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వం ఒకటేనా ? (1వ ఖండము-1,2,3వ మంత్రములు) article ఉద్ధాలకుడు అనే మహానుభావునికి మరియూ తన కుమారుడైన స్వేతకేతుకి మధ్య జరిగే సంభాషణగా సాగుతుంది 'సద్విద్య' అనే ఉపనిషత్ భాగము. స్వేతకేతు అనే పిల్లవాడికి పన్నెండవయేట ఉపనయనాన్ని చేసి గురుకులానికి పంపి విద్యాభ్యాసము చేయించి తిరిగి పిల్లవాడు  ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇంటికి వచ్చిన తరువాత అతను చదివిన చదువుల సారము ఎంతవరకు ఉందో త ...
  Posted 13 May 2016, 08:26 by Shashi-Kiran Rao S
 • జగత్కారణ తత్త్వాన్ని తెలిపి కర్మ బంధాన్ని తొలగింపజేసేది -'సద్విద్య' article added మానవజన్మ లభించినప్పుడు దేన్ని తెలుసుకుంటే జన్మ సఫలం అయ్యి మనకి లభించాల్సిన దాన్ని లభింపజేస్తుందో దాన్ని ‘వేదాంతం’ అని అంటారు. వేదాంతం అనగానే ఈ జగమూ ఈ బ్రతుకూ అన్నీ మాయ అని చెప్పేది కాదు. వేదాంతం అంటే దేన్ని తెలుసుకొని దేన్ని ఆచరించి జీవించినట్లయితే దేహం చాలించిన తరువాత లభించాల్సిన ఉత్తమ పురుషార్థము లభిస్తుందో దాన్ని త ...
  Posted 9 May 2016, 22:34 by Shashi-Kiran Rao S
 • సామవేద పురుషుడి కిరీటము - 'సద్విద్య' article added  సామవేద అంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని ఒక భాగమైన 'సద్విద్య' గురించి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు భగవద్గీతలో తన విభూతిని వివరించే పదవ అధ్యాయంలో తనను గురించి తాను చెబుతూ, "వేదానామ్ సామ వేదోస్మి", తాను సామ వేదాన్ని అని సూచించాడు. కారణం అది వినడానికి శ్రావ్యముగా గాన రూపమై ఉంటుంది. జ్ఞానం ఉండాలి అనే నియమం ల ...
  Posted 5 May 2016, 21:59 by Shashi-Kiran Rao S
 • ఉపనిషత్తుల పరిచయం article added ఉపనిషత్తులు ప్రతి వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ప్రధానంగా ఒక పది మరియూ మరొక నాలుగు ఉపనిషత్తులు మొత్తం పద్నాలుగు ఉపనిషత్తులని వేదాంతం అని చెప్పవచ్చు. ఇవన్నీ మన పూర్వ ఆచార్యులైన ఆదిశంకరాచార్య, రామానుజాచార్య మరియూ మద్వాచార్యులచే అంగీకరించబడినవి. అందుకే వారు అందించిన దర్శనాలను వేదాంత సిద్దాంతాలు అని చెబుతార ...
  Posted 3 May 2016, 22:50 by Shashi-Kiran Rao S
 • నశించని ఆనందాన్ని లభింపజేసేది వేదం article added  మనిషికి తెలివిని దానికి అనుగుణమైన ఆచరణని అందించింది వేదం. పొందాల్సిన వాటిల్లో ఏది అన్నింటికంటే గొప్పదో దానిని పొందించే సాధనము కూడా వేదమే. 'విదుల్ లాభే' అనే మరొక ధాతువు ద్వారా కూడా వేదం అనే పదం ఏర్పడింది. అంటే లభించాల్సిన వాటిల్లో అతి విలువైనవేవో వాటిని తెలుపుతుంది వేదం. విలువైనవి అంటే ఏవి ఆనందాన్ని ఇవ్వగలవో అవి విలువైనవి. ఆ ...
  Posted 21 Apr 2016, 21:52 by Shashi-Kiran Rao S
Showing posts 1 - 12 of 310. View more »


అనువాదము

Showing posts 1 - 10 of 36. View more »
Calendar