జగద్గురు రామానుజాచార్యస్వామి తిరునక్షత్రం (27th May)
యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే | అస్మద్గురో ర్భగవతో2స్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే || నేను
భగవంతుడిని అని చెప్పేవాళ్ళని మనం సేవించటం లేదు. మహానుభావులైనటువంటి
పరంపరాగత జ్ఞానలబ్దులైనటువంటి ఆచార్యుడు చూపిన తత్వాన్ని మనం భగవత్ తత్వంగా
గుర్తిస్తాం. ఇక ఆచార్యుడిని గుర్తించేది ఎట్లా అంటే ఒక పరంపరాగత జ్ఞానం
కల్గి ఉండి భగవంతుని చేతకూడా అంగీకారం పోందబడి స్వీకృతులవుతారో అలాంటి
మహానుభావులని మనం ఆచార్యుడుగా అంగీకరిస్తాం. రామానుజులని భగవంతుడూ
స్వీకరించాడు, రామానుజులవారూ అట్లాంటి తత్వాన్నే చెప్పారు. రామాయణంలో
రామచంద్రుడు లక్ష్మణస్వామిని అంగీకరించాడు. లక్ష్మణ స్వామి రామచంద్రుడిని
అనేక సార్లు అనేక మందితో సేవ్యునిగా దర్శింపజేసాడు. అలా మనం ఆ రామానుజుడిని
మనం స్వీకరిస్తున్నాం. అట్లానే ఆ లక్ష్మణాగ్రజుడిని మనం స్వీకరిస్తున్నాం.
భగవంతుడు చూపించాడు కనుక గురువుని ఇక గురువు చూపించాడు కనుక భగవంతుడిని
మనం స్వీకరిస్తున్నాం. అయితే లక్ష్మణుడు ఒక్కడే కాదు రాముడి అనుజుడు,
భరతుడు ఉన్నాడు, శత్రజ్ఞుడు ఉన్నాడు. అయితే ఒక్కోక్కరు రామానుజుడి ఒక్కో
అంశని ప్రకటిస్తారు. తనని తప్ప వేరే ఏదైనా ఇస్తే వారికి అది "తృణాయమేనే"
గడ్డి పరకతో సమానం. "యోనిత్యం అచ్యుత పద అంబుజ యుగ్మ ఋక్మ వ్యామోహ తత్
ఇతరాని తృణాయమేనే" ఎల్లప్పటికీ అన్ని కాలాల్లో ఎప్పటికీ వీడని అచ్యుతుడి
పద్మములవంటి విలువైన పాదములు రెంటిపై వ్యామోహంచే, ఇక ఇతరత్రమైనవి
గడ్డిపరకతో సమానం. ఇదీ వైష్ణవుడి లక్షణం. ఆ రామానుజుల ప్రవృత్తిని చూసి
తరించాలి. ఇక ద్వాపర యుగంలో పరమాత్మనే (బల)రాముడి అనుజుడిగా శ్రీకృష్ణుడై
వచ్చి లోకానికి తత్వాన్ని సాక్షాత్కరించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం
అంటారు. లోకానికి గురువు అయ్యాడు. ఇక కలియుగంలో ఈజీవరాశిని ఉద్దరించగల
శక్తి సంపన్నులు వీరే అని మనకు అందిన మహనీయులు మన రామానుజాచార్యులు. ఈయననే
ఎంబెరుమానార్ అని లోకం కీర్తించింది. వారే మనకి మంత్రార్థ జ్ఞానం కలిగించి
అటు భగవంతుడికి శంఖ చక్ర క్రియాది కార్యాలను ఆచరించి ఇక ఇద్దరికి
మధ్యవర్తిగా వ్యవహరించి మనల్ని ఉద్దరించిన ఆచార్య శ్రీచరణులు మన భగవత్
రామానుజాచార్య స్వామి. అటువంటి మహనీయులు తప్ప మనల్ని ఉద్దరించే వారు లేరు.
అటువంటి వారివల్ల తప్ప ఏ ఇతరులవల్ల ఉద్దరించబడుట అనేది ఉండనే ఉండదు.
అట్లాంటి రామానుజ అనుగ్రహాన్ని పొందటానికి మనం సిద్దంగా ఉందాం. (read more: శ్రీరామానుజాచార్య స్వామి తిరునక్షత్రం)
శ్రీనందననామ సంవత్సర ఉగాది - పెరియ పెరుమాళ్ తిరునక్షత్రం (23 rd march/24th march )
ఈ లోకంలో మొట్టమొదటగా విగ్రహ రూపంలో దర్శన
మిచ్చిన స్వామి రూపం శ్రీరంగనాథుడు. చతుర్ముఖ బ్రహ్మకు మూర్తి రూపంలో దర్శనమిచ్చిన
రోజు, అతనికి దినం ఆరంభమైన రోజు. అతనికి కాలం ఆరంభమైన రోజు. అది అతనికి
నూతన యుగాన్ని ఆరంభంచేసిన రోజు. ఈనాడు శ్రీరంగనాయకుడిగా కీర్థనలందుకుంటున్న
స్వామి, తాను ఏనాడైతే విగ్రహ రూపంలో దర్షన మిచ్చాడో ఆనాటినుండే కాలాన్ని
లెక్కపెట్టుకోవడం ప్రారంభించాడు. ఈనాడు మనం లెక్క పెట్టుకుంటున్న కాలం ఆ
రంగనాథుడి ఆవిర్భావం నుండే మొదలైంది కనక ఆయన దర్శనమిచ్చిన రోజు యుగాది
అయింది. అదే మన తెలుగునాట ఉగాది అయింది. అందుకే ఈ ఉగాదినాడు రంగనాథుడి
పుట్టిన రోజు. శ్రీరంగనాథుడు ఉన్నది తమిళనాట అయినా అక్కడి పంచాంగం ఈ
రోజుతోనే మొదలవుతుంది. తెలుగు వారు ఏదైతే పంచాంగం ఇది మాది అని
తీసుకున్నారో శ్రీరంగనాథుడు దాన్నే నిరంతరం శ్రవణం చేస్తాడు. భగవంతుడి
ఆవిర్భావాన్ని గుర్తించి కాలాన్ని లెక్క చేసుకొనే పద్దతిని మన తెలుగు వారు
తమది చేసుకోవడం అనేది తెలుగు వారి అదృష్టం. (read more ఉగాది - పెరియ పెరుమాల్ తిరునక్షత్రం )
వైష్ణవానాం శ్రీరామనవమి (1st April) తెలుగునాట శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగేంత వైభవంగా మరే
ఉత్సవాలు జరగవన్నది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంవత్సర ప్రారంభ దినాలలో
రామాయణ అనుసంధానంతో వసంత నవరాత్రులు, సీతారామ కళ్యాణం జరుపుకోవడం మన చిర
మర్యాద.
వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా|| వేదవేద్యుడు, పరమ పురుషుడు దశరథరాజ నందనుడుగా
అవతరించడంతో వేదం వాల్మీకినోట రామాయణంగా వెలువడింది. రామాయణం సాక్షాత్తు
వేదం. వేదంలోని విషయాలను మనకు కనిపించేట్టు చేసేదే రామాయణం. భగవంతుడిలోని
దయ మనల్ని ఎట్లా కాపాడుతుంది ? ఎట్లా రక్షిస్తాడు ? రక్షణ అంటే ఏమి ?
రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి ? రక్షణ పొందడానికి మనం ఎం చేయాలి ?
దీన్ని తెలుపడానికే రామావతారం. (read more )
శ్రీరంగనాచియార్ తిరునక్షత్రం (5th April) ఈ రోజు అమ్మ లక్ష్మీదేవి పుట్టిన రోజు, అంటే దేవతలు అసురులు
పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమ్మ ఆవిర్భవించిన రోజు. వారంతా ఆమెను
పొందాలి అని ఆతృతతో చూసినా, ఆమె మాత్రం భగవంతుణ్ణే చేరింది, చేరి ఆయన
వక్షస్థలాన్నే తన నిత్య నివాసంగా చేసుకుంది.ఈ నాడు శ్రీరామచంద్రుని ఇలవేల్పు అయిన రంగనాథుడు వేంచేసి
ఉన్న శ్రీరంగంలో అమ్మవారి వద్ద అద్భుతమైన పండగ జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ
సంహితల ప్రకారం ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక సనిధి ఉంటుంది. అమ్మవారు మూడు
స్థానాల్లో లయార్చ, భోగార్చ మరియూ ఆధికారార్చ అనే రూపాల్లో
దర్శనమిస్తుంది. లయార్చ అంటే భగవంతుణి వక్షస్తలంపై ఉన్న రూపం. భోగార్చ అంటే
భగవంతుణి ప్రక్కన ఉన్న రూపం. ఆధికారార్చ అంటే తన సన్నిధిలో ఒంటరిగా
భగవంతుడు ప్రక్కన లేని రూపంలో దర్శనమిస్తుంది. స్వామిని దర్శించబోయే ముందే
అమ్మను దర్శించడం నియమం. భగవంతుడు ప్రక్కన లేని రూపం అమ్మకు ఎందుకు ?
అమ్మకు మరో పేరు "శ్రీ" అంటే "శృణోతి శ్రావయతి", మన మొరలను ఆలకిస్తుంది, మన
మొరలను స్వామికి తెలియజేస్తుంది. అందుకే మొదట ఒంటరిగా మన మొరలను ఆలకించి,
తిరిగి మనం స్వామి సన్నిధానానికి వెళ్ళే సరికి అక్కడ ఆయన వక్షస్థలంపై ఉండి
మన తప్పులని కనపడకుండా చేసి, మనపై ఆయన అనుగ్రహం పడేట్టు చేస్తుంది అమ్మ.
మనం ఎన్నో జన్మలుగా ఎన్ని దోషాలు చేస్తూ వస్తున్నామో కదా. ఆయన దండించగలడు,
కానీ అమ్మ వల్ల ఆయనలోని దయపైకి ఉన్నప్పుడు వెళ్ళామా రక్షింప బడ్డామనే
లెక్క. అందుకే ఈ క్రమంలో మన మొరలను ఆలకించేందుకే అమ్మ తన సన్నిధిలో ఒంటరిగా
దర్శనమిస్తుంది. ఆస్థానాన్నే తాయార్ సన్నిధి అని పిలుస్తారు. సంవత్సరంలో
ఒక్క రోజే రంగనాథుడు అమ్మ వద్దకు వెళ్తాడు. అది ఈ నాడు. అమ్మ పుట్టిన రోజు
కనుక. దివ్య దంపతులను ఒక్క చోట ఉన్నప్పుడు సేవించుకొని రామానుజులవారు
శరణాగతి గద్యాన్ని మరో రెంటితో పాటు సమర్పించారు. ఈ మూడింటిని కలిపి
గద్యత్రయం అని అంటారు. ఆదివ్య దంపతుల కృప మనపై ఉండాలని కోరుకుంటూ అమ్మ
గొప్పతనాన్ని కొంచం తెలుసుకుందాం.(Readmore) |
Updates
-
"ఓం నమః పరమ ఋషిభ్యః " article added
పరిశోదన అంటే దాని మీదే ఆలోచిస్తూ, దానిమీదే తపన చేందుతూ దానికి సంబంధించిన విషయాలనే సేకరిస్తూ ఉండటమే కదా, దీనినే సంస్కృతంలో తపస్సు అని పేరు పెట్టారు. తప సంతాపే తప ఆలోచనే అనే రెండు ధాతువులు సంస్కృతంలో ఉన్నాయి. తపస్సు అంటే సతతమూ ఆలోచన చేయుట. అంతే కాదు ఇతరమైన అలోచనలని, విలాసాలని సంకోచింపజేసుకొనుట. దీన్నే మనం ఈనాడు రీసర్చ్ అంటుంట ...
Posted 26 May 2012 20:49 by Shashi-Kiran Rao S
-
వేదంలోని జ్ఞాన భాగమే ఉపనిషత్తులు article updated
శరీరానికి సుఖాన్ని కలిగించేవి రకరకాలుగా ఉన్నాయి వాటిని రకరకాలుగా సంపాధించే ప్రయత్నం చేసినా ఈ లోపల ఉండే మనల్ని గురించి తెలిస్తే తప్ప వీటిని ఎట్లా వాడుకోవాలో తెలియదు కనుక ముందు దాన్ని తెలుసుకోమని ఉపనిషత్తులు మనకి ఉపదేశం చేస్తాయి. లక్ష్యం తెలిస్తే కదా మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మనకి తెలుస్తుంది. శరీరం కంటే ప్రాధాన ...
Posted 25 May 2012 18:00 by Shashi-Kiran Rao S
-
ఆత్మ సుఖాన్ని తెలిపే వేద భాగమే ఉపనిషత్తులు article added
మనిషి బుద్ధి జీవి, ఇతర జీవులు శక్తికలవి అయినా మనిషివలె బుద్ధిని వాడుకోలేవు. అట్లా ఇతర ప్రాణులని జయించి బ్రతికే మనిషి, ఈ శరీరాన్ని కూడా జయించి బ్రతకగలడు కానీ దానికి లొంగి బ్రతుకుతున్నాడు. ఇది మనిషి పుట్టుకతోనే ఏర్పడ్డ లోపం. శరీరం వరకు వచ్చెటప్పటికి దీనికి లొంగిపోతుంటాడు, ఎందుకంటే శరీరం అనేది అతిదగ్గరది కనుక. శరీరం వరకు వచ్చేప్పుడు అది చ ...
Posted 11 May 2012 19:39 by Shashi-Kiran Rao S
-
"జగద్గురువు - శ్రీరామానుజాచార్య స్వామి" article updated
ఏదైనా ఒక ప్రదేశానికి విమానంలో వెళ్ళాలి అనుకుంటే మనమే
విమానం నడపాల్సిన అవసరం లేదు, ఆ విమానాన్ని నడిపే వ్యక్తిని కనుక
ఆశ్రయించినట్లయితే ఏ శ్రమాలేకుండా ఆ ప్రదేశానికి చేరగలిగినట్లుగానే మనం
కూడా మనకుండే ఆచార్య భక్తిచేత మన లక్ష్యమైన పరమాత్మని చేరగలం. కేవలం మన
సంప్రదాయమే కాదు అన్నిసంప్రదాయాలకు, అంటే వైదికమైన సంప్రదాయాలే కాద ...
Posted 16 Feb 2012 16:34 by Shashi-Kiran Rao S
-
కాలాగణనంతోపాటు మనం వర్తమానాన్ని సంస్కరించుకోగలగాలి article added
కాలం అనంతము. మనం నేలని విడదీసినట్లు కాలాన్నివిడదీయలేము.
అవిచ్చిన్నంగా నిరంతరమూ సాగేది కాలం అంటే. మనం ఎలాంటి మహానుబావుల దగ్గర
ఉపకారము పొందుతామో వాళ్ళని బట్టి మనము కాలాన్ని లెక్క పెట్టుకోవడం
చేస్తుంటాం. సముద్రంలో ఎన్నో రకాల వస్తువులు వుంటాయి ఐతే అన్ని మనకు అవసరము
వుండకపోవచ్చు, మనకు అవసరమయ్యేవి ఎక్కడ వుంటాయో అక్కడ నుండి మనం
ఉపయోగించుకొనే ప్రయత ...
Posted 3 Jan 2012 21:55 by Shashi-Kiran Rao S
-
రకరకాల విశ్వాసాలకి కారణం భగవంతునికి మనకి మధ్య ఉన్న బాంధవ్యం తెలియకనే article added
తనకు సంబంధం కలిగినది ఉన్నది అన్న జ్ఞానాన్ని బాంధవ్యం
అంటారు. ఈ భాందవ్యం తెలియకనే దొరికిన దాన్ని పట్టుకుంటున్నారు. లోకంలో
ఇన్ని రకాల దేవతలని పూజిస్తున్నారు, ఇన్ని రకాల విశ్వాసాలు ఏర్పడటానికి
కారణం భహుషా భగవంతునికి మనకి మధ్య ఉన్న బాంధవ్యం తెలియకనే. సముద్రంలో పడి
కొట్టుకుంటున్న వాడికి గడ్డి పోచ దొరికినా పట్టుకుంటాడు. అద ...
Posted 14 Dec 2011 16:00 by Shashi-Kiran Rao S
-
మంత్రంతో సాధన కేవలం భగవంతునియందు మనస్సుని నిలపడానికి మాత్రమే article added
ధ్యానం అంటే మనస్సుని మంచిగా ఆనందంగా పని చేయించడం. కానీ
శూన్యంలోకి తీసుకు పోవడం కాదు. మనస్సుని నిర్విషయకం చేయడం అంటే మనస్సు
చచ్చి పోయిందనే అర్థం. సాధన చేయడం ఆ మంత్రం తెలిపే భగవంతుని యందు నిలకడకి
మంత్రం తప్ప మిగతా అల్పమైన విషయాలకై కాదు. సాధన మంత్రం, సాధ్యం ఆ భగవంతుడే
అయినా సాధన మరియూ సాధ్యం రెండూ భగవందుడే అని మన పూర్వాచార్యుల ...
Posted 9 Nov 2011 17:52 by Shashi-Kiran Rao S
-
ద్వయమంత్రంలోని ఒక్కో పదం తెలిపేదేమిటి ? article added
"అధిగత నిగమః", సఖల వేద సారమైనది ఈ మంత్రం. "షట్పదో యం
ద్విఖణ్డః", ద్వయమంత్రం ఆరు పదాలు కలిగి ఉంటుంది. "శ్రీమన్నారాయణచరణౌ",
"శరణం", "ప్రపద్యే", "శ్రీమతే", "నారాయణాయ" మరియూ "నమః" అనే ఆరు పదాలు. ఈ
ఆరు పదాలు కలిసి ఏర్పడ్డ ఈ మంత్రం, రెండు భాగాలు అంటే "శ్రీమన్నారాయణచరణౌ
శరణం ప్రపద్యే" మరియూ "శ్రీమతే నారాయణాయ నమః" అనే వ్యాఖ్యాలతో ఉంది కనుక
ద్వయం అని పేరు. ఏమిటి ఈ మంత్రం చేస ...
Posted 1 Nov 2011 19:43 by Shashi-Kiran Rao S
-
పరిమళ భరితమైన ద్వయమంత్రం article added
కొన్ని మంత్రాలు మంచి రుచి, చక్కని పరిమళం కలిగి ఉంటాయి.
అయితే రుచి పరిమళాన్ని మనం వాస్తవికంగా గుర్తించగలగాలి. అది ఎలా ? రుచి
అంటే మనం ఎన్ని సార్లు రుచి చూసినా విసుగు లేకుండా పదే పదే రుచి చూడాలని
అనిపించాలి. మంచి వాసన అంటే ఆస్వాదిస్తుంటే అన్నింటినీ మరచిపోవాలి. ఇది
ప్రాపంచిక విషయాల్లో కొంత హద్దు ఉంటుంది. మిఠాయి తింటామనుకోండి, ఎంత ...
Posted 31 Oct 2011 19:40 by Shashi-Kiran Rao S
-
పూర్వాచార్యులు ద్వయమంత్రాన్ని ఆస్వాదించిన తీరు article added
ద్వయమంత్రాన్ని పదే పదే తలుస్తూ జీవించాలి అనేది మన పూర్వాచార్యులు చెప్పిన
విషయం. రామానుజాచార్య శరణాగతి గద్యంలో "ద్వయం అర్థానుసంధానేన సహ సదా ఏవం"
అని చెప్పారు. మనకు ఏదైనా సమయం దొరికింది అంటే ద్వయమంత్రాన్ని స్మరించాలి
అని చెబుతారు. మన పూర్వాచార్యులైన మణవాళ మహామునులు సంప్రదాయ పరిరక్షణ చేసిన
మహనీయులు. వారి ఆచరణ పరమ ప్రామ ...
Posted 30 Oct 2011 19:50 by Shashi-Kiran Rao S
-
ద్వయమంత్రం విస్తరించిన క్రమం article added
మొదట అకారం, అకారం
నుండి 'అ', 'ఉ' మరియూ 'మ'లు అంటే ఓంకారం వెలువడింది. అకారాన్ని
వివరించటానికి నారాయణ పదం, ఉకారాన్ని వివరించటానికి నమః పదం, మకారాన్ని
వివరించటానికి ఆయ పదం వచ్చింది. ఓంకారాన్ని వివరిస్తూ వచ్చిన మూడు పదాలు
ఓంకారంతో కలిస్తే అది అష్టాక్షరి మంత్రం అయ్యింది. అట్లానే నారాయణ పదాన్ని
స్పష్టంగా గోచరింపజేయటానికి "శ్రీమన్నారాయణ ...
Posted 24 Oct 2011 17:59 by Shashi-Kiran Rao S
-
శ్రీలక్ష్మీ పూజా విధానము added
దీపావళి-శ్రీసూక్త నామావళితో లక్ష్మీపూజా విధానం added in తిరువారాధన విధానము
Posted 23 Oct 2011 20:44 by Shashi-Kiran Rao S
News - ప్రచార వార్తలు
-
-
దివ్యసాకేత తృతీయ బ్రహ్మోత్సవాలు
Posted 30 Apr 2012 19:05 by Shashi-Kiran Rao S
-
చెలువనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు - వైరముడి సేవ @ మేల్కోట
Posted 2 Apr 2012 20:04 by Shashi-Kiran Rao S
-
యతోక్తకారి స్వామి బ్రహ్మోత్సవాలు, కాంచీపురం
Posted 1 Apr 2012 20:07 by Shashi-Kiran Rao S
-
తిరుమల పాదయాత్ర-శ్రీవిష్ణుసహస్రనామపారాయణ @ Tirupati on 3rd Feb
Posted 3 Feb 2012 23:02 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Eluru on Dec 20,21
Posted 23 Dec 2011 15:44 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Tuni Dec16,17 2011
Posted 17 Dec 2011 03:22 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Srikakulam Dec12,13 2011
Posted 17 Dec 2011 03:17 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Bobbili Dec9,10 2011
Posted 17 Dec 2011 03:15 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Vizianagaram Dec 6,7,8 2011
Posted 17 Dec 2011 03:12 by Shashi-Kiran Rao S
-
సమాశ్రయణములు on 31 డిసెంబర్ 2011
Posted 12 Dec 2011 15:50 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Ongole on Dec4,5 2011
Posted 7 Dec 2011 17:03 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Pedavadlapudi, Guntur Dt on Dec2,3 2011
Posted 5 Dec 2011 16:58 by Shashi-Kiran Rao S
-
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, తిరుపతి
Posted 30 Nov 2011 17:33 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Gudivada on Nov28,29 2011
Posted 30 Nov 2011 16:39 by Shashi-Kiran Rao S
-
సహస్ర తులసీ శ్రీనివాసమ్ @ Suryapeta Nalgonda on Nov26,27 2011
Posted 28 Nov 2011 17:56 by Shashi-Kiran Rao S
Calendar
|